టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జిబాంబ్వే విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా కీలక పాత్ర పోషించాడు.
ఓటమి ఖాయం అనుకున్న వేళ రజా తన స్పిన్‌తో మ్యాజిక్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రజా తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తద్వారా ఓ అరుదైన రికార్డును రజా సాధించాడు.
కోహ్లి రికార్డులను బ్రేక్ చేసిన రజా
అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. 2022 ఏడాదిలో రజాకు ఇప్పటి వరకు 7 మ్యాన్ ఆఫ్‌ది అవార్డులు లభించాయి. కాగా అంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016లో టీ20ల్లో కోహ్లీ ఆరుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
అదే విధంగా రజా మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్‌ది అవార్డును అందుకున్న ఆటగాడిగా రజా రికార్డు సృష్టించాడు.
ఈ ఏడాది ప్రపంచకప్‌లో రజా ఇప్పటి వరకు మూడు సార్లు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి రెండుసార్లు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
చదవండి: T20 WC 2022: ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మరో మ్యాచ్ రద్దు
Comments
Please login to add a commentAdd a comment