టీ20 ప్రపంచకప్-2022 ఆదివారం(నవంబర్ 13)తో ముగిసిపోయింది. ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్‌లో సత్తా చాటిన ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను సోమవారం ప్రకటించింది.
ఇప్పటికే ఐసీసీ కూడా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ప్రకటిచింది. తాజగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌కు చోటుదక్కింది. అదే విధంగా ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ నుంచి గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపికచేసింది.
వారిలో కెప్టెన్ జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ ఉన్నారు. ఇక రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ నుంచి షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదికి స్థానం దక్కింది. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిఫ్స్, జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా, బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తిఫిజర్ రెహ్మన్, ప్రోటీస్ స్పీడ్ స్టార్ అన్రీచ్ నోర్జేకు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. కాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.
క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టు: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, విరాట్ కోహ్లి, గ్లెన్ ఫిలిఫ్స్ సూర్యకుమార్ యాదవ్, సికిందర్ రజా, షాదాబ్ ఖాన్, సామ్ కర్రాన్, షాహీన్ ఆఫ్రిది, ముస్తాఫిజుర్ రెహ్మన్, అన్రీచ్ నోర్జే
చదవండి: టీ20 వరల్డ్‌కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు
Comments
Please login to add a commentAdd a comment