Virat Kohli Spotted At Mumbai Airport As Return After T20 WC, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli Airport Video: స్వదేశానికి చేరుకున్న టీమిండియా.. బాధలో కోహ్లి

Published Sat, Nov 12 2022 10:15 PM | Last Updated on Sun, Nov 13 2022 4:45 PM

Virat Kohli Spotted Mumbai Airport Team India Members Video Viral - Sakshi

టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో దారుణ పరాజయం అనంతరం టీమిండియా స్వదేశానికి చేరుకుంది. శనివారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన టీమిండియా ఆటగాళ్లు మీడియా కంట పడకుండా స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే కోహ్లికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌ ఓటమి బాధ కోహ్లి మొహంలో స్పష్టంగా కనిపించింది. ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాకు చిక్కిన కోహ్లి ఏం మాట్లాడకుండానే కారు ఎక్కి వెళ్లిపోయాడు.

ఇక టి20 ప్రపంచకప్‌లో టీమిండియా రన్‌మెషిన్‌ కోహ్లి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో నాలుగు అర్థసెంచరీలు సాధించిన కోహ్లి 296 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ అతని కెరీర్‌లోనే కాదు క్రికెట్‌ బ్రతికున్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. 53 బంతుల్లో 82 పరుగుల ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

అంతేకాదు నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌లతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ కోహ్లి అర్థశతకంతో రాణించాడు. కోహ్లి తర్వాత టీమిండియాలో రాణించింది సూర్యకుమార్‌ మాత్రమే.వీరిద్దరు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి జట్టు వైఫల్యం టీమిండియాను సెమీస్‌లోనే వెనుదిరిగేలా చేసింది. 

చదవండి: 'ఒక్క మ్యాచ్‌కే తీసిపారేయొద్దు.. నెంబర్‌-1 ర్యాంక్‌ రాత్రికి రాత్రే రాలేదు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement