టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం కొనసాగుతుంది. ఎంతలా అంటే కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ డబుల్ డిజిట్ మార్క్‌ను అందుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 22 పరుగులు మాత్రమే చేసిన రాహుల్‌ను జట్టు నుంచి తొలిగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు(బుధవారం) బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది.
ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా గడిపింది. ఈ సందర్భంగా టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి.. కేఎల్ రాహుల్‌కు బ్యాటింగ్ పాఠాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెట్స్‌లో చాలాసేపు రాహుల్, కోహ్లి మాట్లాడుకుంటూ కనిపించారు.
ఈ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా రాహుల్ ప్రాక్టీస్‌ను గమనించారు. కోహ్లితో 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనూ కోహ్లి అతని దగ్గరికి వెళ్లాడు. ఫుట్‌వర్క్, స్టాన్స్ విషయంలో రాహుల్‌కు చిట్కాలు చెప్పాడు.
అయితే కేఎల్ రాహుల్‌కు కోహ్లి పాఠాలు చెప్పడంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమయింది. ''ఫామ్‌లో లేని ఆటగాడికి సలహాలు ఇచ్చి ఏం లాభం.. కోహ్లి భాయ్ ఇక సలహాలు అవసరం లేదనుకుంటా.. ఎలాగూ జట్టు నుంచి దూరం కానున్నాడు'' అంటూ కామెంట్స్ చేశారు.
టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు మంగళవారం ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. అతను ఫెంటాస్టిక్ ప్లేయర్ అని.. టి20ల్లో రాహుల్ ట్రాక్ రికార్డు గొప్పగా ఉందన్నాడు. రాహుల్ ఫామ్‌లోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలని.. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బలమైన మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ బౌలింగ్‌ను తట్టుకొని రాహుల్ 60 పరుగులు చేసిన విషయాన్ని మరువద్దని పేర్కొన్నాడు. అతని క్వాలిటి, ఎబిలిటీపై మాకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.
గ్రూప్ 2లో ఉన్న టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి వరల్డ్‌కప్‌కు మంచి ఆరంభాన్నిచ్చినా.. మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడటంతో ఇంకా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు. బుధవారం (నవంబర్ 2) బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న ఇండియా దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది.
చదవండి: ఇంగ్లండ్ విజయాలను శాసిస్తున్న చివరి ఆరు ఓవర్లు
అతడి ఆట తీరుపై మాకెలాంటి ఆందోళన లేదు! సంతృప్తిగా ఉన్నాం: ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment