
టీ20 వరల్డ్‌కప్-2022 ముగిసిన మరుసటి రోజే (నవంబర్ 14) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో మొత్తం ఆరు దేశాలకు ప్రాతినిధ్యం లభించగా.. టీమిండియా నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఈ జట్టుకు ఛాంపియన్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను సారధిగా ఎంపిక చేసిన ఐసీసీ.. వికెట్‌కీపర్‌గానూ, ఓపెనర్‌గానూ అతన్నే ఎంచుకుంది.
బట్లర్‌కు జోడీగా సహచరుడు అలెక్స్ హేల్స్‌ను మరో ఓపెనర్‌గా ఎంపిక చేసింది. మ్యాన్ ఆఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ సామ్ కర్రన్‌తో పాటు మార్క్ వుడ్‌లకు కూడా జట్టులో అవకాశం కల్పించింది. ఇంగ్లండ్ నుంచి మొత్తం నలుగురికి అవకాశం లభించగా.. టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లకు ఛాన్స్ దక్కింది. వీరితో పాటు హార్ధిక్ పాండ్యాను 12వ ఆటగాడిగా ఎంచుకుంది.
ఓపెనర్లుగా బట్లర్, హేల్స్‌ను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)లకు అవకాశం ఇచ్చింది. ఆతర్వాత ఆల్‌రౌండర్ల కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)లకు ఛాన్స్ ఇచ్చి.. బౌలర్లుగా సామ్ కర్రన్, అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా), మార్క్ వుడ్, షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)లకు అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు.. పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, రెండోసారి టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: ఇంగ్లండ్ గెలుపులో మూల స్తంభాలు..
Comments
Please login to add a commentAdd a comment