Jos Buttler Picks Surya Kumar As T20 World Cup 2022 Player Of The Tournament - Sakshi
Sakshi News home page

Player Of The Tournament: రేసులో నేను, మావాళ్లు ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకే: బట్లర్‌

Published Sun, Nov 13 2022 9:46 AM | Last Updated on Sun, Nov 13 2022 11:30 AM

Jos Buttler Picks Surya Kumar As T20 World Cup Player Of The Tournament - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో అద్భుత ప్రదర్శనతో విమర్శకులు, ప్రత్యర్ధుల ప్రశంసలు సైతం అందుకున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను తాజాగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ కూడా ఆకాశానికెత్తాడు. గత కొంతకాలంగా సూర్య ఆటతీరు అద్భుతంగా ఉందని, అతను గ్రౌండ్‌ నలుమూలలా ఆడుతున్న షాట్లు, క్రికెట్‌ పుస్తకాల్లో సైతం ఎక్కడా లేవని కితాబునిచ్చాడు.

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భీకరమై ఫామ్‌లో ఉండిన స్కై.. మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అని పిలుపించుకోవడానికి వంద శాతం అర్హుడని పేర్కొన్నాడు. సూర్య ఆడే షాట్లు తనను అమితంగా ఆకట్టుకుంటాయని, అవి తనకు ఏబీడీని గుర్తు చేస్తాయని అన్నాడు. పాకిస్తాన్‌తో ఫైనల్‌కు ముందు బట్లర్‌.. సూర్యకుమార్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు అందుకునేందుకు అన్ని విధాల అర్హుడని, ఐసీసీ షార్ట్‌ లిస్ట్‌ చేసిన 9 మంది ఆటగాళ్ల జాబితాలో నేను, మావాళ్లు (ఇంగ్లండ్‌ ఆటగాళ్లు) ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకే అంటూ ఇంటరెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. కాగా, మెల్‌బోర్న్‌ వేదికగా ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 13) వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే టైటిల్‌ పోరులో ఇరు జట్లు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి.

ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు కోసం ఐసీసీ షార్ట్‌ లిస్ట్‌ చేసిన క్రికెటర్లు వీరే..
1. విరాట్‌ కోహ్లి (భారత్‌)- 296 పరుగులు- 6 మ్యాచ్‌లలో
2. సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్‌)- 239 పరుగులు- 6 మ్యాచ్‌లలో
3. షాదాబ్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌)- 10 వికెట్లు, ఒక అర్ధ శతకం- 6 మ్యాచ్‌లలో
4. షాహిన్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌)- 10 వికెట్లు- 6 మ్యాచ్‌లలో
5. సామ్‌ కర్రన్‌ (ఇంగ్లండ్‌)- 10 వికెట్లు- 5 మ్యాచ్‌లలో
6. జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌)- 199 పరుగులు- 5 మ్యాచ్‌లలో- కెప్టెన్‌గానూ విజయవంతం
7. అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లండ్‌)- 211 పరుగులు- 5 మ్యాచ్‌లలో 
8. సికిందర్‌ రజా(జింబాబ్వే)- 219 పరుగులు-8  మ్యాచ్‌లలో- 10 వికెట్లు
9. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 వికెట్లు- 8 మ్యాచ్‌లలో

చదవండి: 152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్‌ ప్రధానికి ఇర్ఫాన్‌ పఠాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement