Player of the Series award
-
ఒక్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు
టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 సాధించడంలో కీలకపాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన మొదటి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మెగా టోర్నీలో బుమ్రాకు ఒకే ఒక్క సారి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో బుమ్రా గోల్డెన్ డకౌటయ్యాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్లేయర్ ఒక్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును గెలుచుకోలేదు. ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన జస్సీ.. 29.4 ఓవర్లలో 8.27 సగటున 15 వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే, తాజాగా ముగసిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై విజయం సాధించి, రెండో సారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది. -
Border-Gavaskar Trophy: ‘జడ్డూ’ తిప్పేశాడు...
న్యూఢిల్లీ: భారత్‌కు అచ్చొచ్చిన ఢిల్లీ వికెట్‌పై పర్యాటక జట్టే స్పిన్‌తో అల్లాడిస్తే... ఆతిథ్య జట్టు అంతకుమించే చేయాలి కదా! సరిగ్గా... టీమిండియా కూడా అదే చేసింది. ఒక్క సెషన్ అయినా పూర్తిగా ఆడనివ్వకుండానే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా (7/42) బిగించిన ఉచ్చులో ఆస్ట్రేలియా క్లీన్‌బౌల్డయింది. 31.1 ఓవర్లలోనే 113 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇందులో 12 ఓవర్లు, 61 పరుగులు క్రితం రోజువే కాగా... మూడో రోజు ఆసీస్ ఆడింది 19.1 ఓవర్లే! చేసింది కూడా 52 పరుగులే! అంటే సగటున ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్‌ను సమర్పించుకుంది. అంతలా ప్రపంచ నంబర్‌వన్ టెస్టు జట్టు జడుసుకుంది. ‘జడ్డూ’ ఏకంగా ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేశాడు. అనంతరం 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు జట్ల బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వకపోవడం విశేషం. మ్యాచ్ మొత్తం లో పది వికెట్లు తీయడంతోపాటు కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జడేజాకు వరుసగా రెండోసారీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–0తో ఉన్న భారత్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని తమ వద్దే అట్టిపెటుకుంది. క్రితంసారి కూడా భారతే గెలిచింది. ఇక ఈ సిరీస్‌లో మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరుగుతుంది. ఇండోర్ టెస్టులోనూ భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది. ఇలా మొదలై... అలా కూలింది! ఓవర్‌నైట్ స్కోరు 61/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా పతనం తొలి ఓవర్ నుంచే మొదలైంది. ఓపెనర్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) అశ్విన్ బౌలింగ్‌లో ఒక బౌండరీ కొట్టి ఆఖరి బంతికి అవుటయ్యాడు. కాసేపటికే సీనియర్ బ్యాటర్ స్మిత్ (19 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా అతని బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికాడు. తర్వాత జడేజా మాయాజాలం మొదలవడంతో కొత్తగా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాటర్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) సహా స్వల్ప వ్యవధిలో క్యారీ (7), కమిన్స్ (0), లయన్ (8), కున్మన్ (0)లను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. కచ్చితత్వం లేని స్వీప్ షాట్లు, అనవసరమైన రివర్స్ స్వీప్ షాట్లు ఆస్ట్రేలియన్ల కొంపముంచాయి. ప్రపంచంలో ఎక్కడైనా పేస్ బంతులు బ్యాటర్లను బెంబేలెత్తిస్తాయి. కానీ ఇక్కడ స్లో డెలివరీలకే విలవిలలాడారు. దీంతో ఆదివారం ఆటలో 9 వికెట్లు చేతిలో ఉన్న ఆసీస్ కనీసం 20 ఓవర్లయినా ఆడలేకపోయింది. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్ తిరగడంతో భారత ప్రధాన సీమర్ మొహమ్మద్ సిరాజ్‌కు బంతిని అప్పగించాల్సిన అవసరమే రాలేదు. లంచ్ బ్రేక్ అనంతరం సులువైన లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఆడాడు. కానీ కేఎల్ రాహుల్ (1) తన వైఫల్యం కొనసాగించాడు. 100వ టెస్టు ఆడుతున్న పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, మధ్యలో విరాట్ కోహ్లి (31 బంతుల్లో 20; 3 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (12)ల వికెట్లు కూలాయి. అప్పటికే టీమిండియా విజయతీరానికి దగ్గరవగా మిగతా లాంఛనాన్ని కోన శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పుజారా పూర్తి చేశాడు. 27వ ఓవర్ వేసిన మర్పీ బౌలింగ్‌లో నాలుగో బంతిని పుజారా మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించి భారత్‌ను గెలిపించాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: 262; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సి) శ్రేయస్ అయ్యర్ (బి) జడేజా 6; ట్రవిస్ హెడ్ (సి) శ్రీకర్ భరత్ (బి) అశ్విన్ 43; లబుషేన్ (బి) జడేజా 35; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 9; రెన్షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; హ్యాండ్స్కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; క్యారీ (బి) జడేజా 7; కమిన్స్ (బి) జడేజా 0; లయన్ (బి) జడేజా 8; మర్ఫీ (నాటౌట్) 3; కున్మన్ (బి) రవీంద్ర జడేజా 0; మొత్తం (31.1 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–23, 2–65, 3–85, 4–95, 5–95, 6–95, 7–95, 8–110, 9–113, 10–113. బౌలింగ్: అశ్విన్ 16–3–59–3, మొహమ్మద్ షమీ 2–0–10–0, రవీంద్ర జడేజా 12.1–1–42–7, అక్షర్ పటేల్ 1–0–2–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 31; కేఎల్ రాహుల్ (సి) అలెక్స్ క్యారీ (బి) లయన్ 1; చతేశ్వర్ పుజారా (నాటౌట్) 31; విరాట్ కోహ్లి (స్టంప్డ్) క్యారీ (బి) మర్ఫీ 20; శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) నాథన్ లయన్ 12; శ్రీకర్ భరత్ (నాటౌట్) 23; మొత్తం (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–6, 2–39, 3–69, 4–88. బౌలింగ్: కున్మన్ 7–0–38–0, నాథన్ లయన్ 12–3–49–2, టాడ్ మర్ఫీ 6.4–2–22–1, ట్రవిస్ హెడ్ 1–0–9–0. 100: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్‌కిది 100వ విజయం. మూడు ఫార్మాట్లలో రెండు జట్ల మధ్య 273 మ్యాచ్‌లు జరిగాయి. ఆసీస్‌తో 104 టెస్టులు ఆడిన భారత్ 32 విజయాలు అందుకొని, 43 పరాజయాలు చవిచూసింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా, 28 ‘డ్రా’గా ముగిశాయి. 143 వన్డేల్లో టీమిండియా 53 మ్యాచ్‌ల్లో గెలిచి, 80 మ్యాచ్‌ల్లో ఓడింది. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. 26 టి20 మ్యాచ్‌ల్లో భారత్ 15 విజయాలు సాధించి, 10 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 25012: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టి20)లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు (492 మ్యాచ్‌లు). సచిన్ (664 మ్యాచ్‌ల్లో 34, 357 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రికెటర్ కోహ్లి కాగా... 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితా లో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. 8: సొంతగడ్డపై టెస్టుల్లో జడేజాకిది ఎనిమిదో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (9 సార్లు) ‘టాప్’లో ఉండగా, సచిన్ (8 సార్లు) సరసన జడేజా నిలిచాడు. సిరాజ్, కోహ్లి, భరత్, జడేజా, అక్షర్ పటేల్ -
సామ్ కర్రాన్ అరుదైన ఘనత.. తొలి బౌలర్‌గా!
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్‌గా ఇంగ్లండ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విశ్వవిజేతగా ఇంగ్లండ్ అవతరించడంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఫైనల్లో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను దెబ్బకొట్టాడు. తుదిపోరులో తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన కర్రాన్ 13 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా ఈవెంట్లో అద్భుత ప్రదర్శన గాను ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా కర్రాన్ ఎంపికయ్యాడు. అదే విధంగా ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కర్రాన్కే వరిచింది. కాగా ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు సాధించిన తొలి స్పెషలిస్టు బౌలర్‌గా సామ్ కర్రాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచినది వీరే షాహిద్ అఫ్రిది(2007) తిలకరత్నే దిల్షాన్(2009) కెవిన్ పీటర్సన్(2010) షేన్ వాట్సన్(2012) విరాట్ కోహ్లీ(2014,2016) డేవిడ్ వార్నర్(2021) సామ్ కర్రాన్(2022) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి! -
Jos Buttler: రేసులో నేను, మావాళ్లు ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకుమార్‌కే..
టీ20 వరల్డ్‌కప్-2022లో అద్భుత ప్రదర్శనతో విమర్శకులు, ప్రత్యర్ధుల ప్రశంసలు సైతం అందుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను తాజాగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఆకాశానికెత్తాడు. గత కొంతకాలంగా సూర్య ఆటతీరు అద్భుతంగా ఉందని, అతను గ్రౌండ్ నలుమూలలా ఆడుతున్న షాట్లు, క్రికెట్ పుస్తకాల్లో సైతం ఎక్కడా లేవని కితాబునిచ్చాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భీకరమై ఫామ్‌లో ఉండిన స్కై.. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని పిలుపించుకోవడానికి వంద శాతం అర్హుడని పేర్కొన్నాడు. సూర్య ఆడే షాట్లు తనను అమితంగా ఆకట్టుకుంటాయని, అవి తనకు ఏబీడీని గుర్తు చేస్తాయని అన్నాడు. పాకిస్తాన్‌తో ఫైనల్‌కు ముందు బట్లర్.. సూర్యకుమార్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకునేందుకు అన్ని విధాల అర్హుడని, ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసిన 9 మంది ఆటగాళ్ల జాబితాలో నేను, మావాళ్లు (ఇంగ్లండ్ ఆటగాళ్లు) ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకే అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా, మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 13) వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే టైటిల్ పోరులో ఇరు జట్లు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కోసం ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసిన క్రికెటర్లు వీరే.. 1. విరాట్ కోహ్లి (భారత్)- 296 పరుగులు- 6 మ్యాచ్‌లలో 2. సూర్యకుమార్ యాదవ్ (భారత్)- 239 పరుగులు- 6 మ్యాచ్‌లలో 3. షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 10 వికెట్లు, ఒక అర్ధ శతకం- 6 మ్యాచ్‌లలో 4. షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 10 వికెట్లు- 6 మ్యాచ్‌లలో 5. సామ్ కర్రన్ (ఇంగ్లండ్)- 10 వికెట్లు- 5 మ్యాచ్‌లలో 6. జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 199 పరుగులు- 5 మ్యాచ్‌లలో- కెప్టెన్‌గానూ విజయవంతం 7. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)- 211 పరుగులు- 5 మ్యాచ్‌లలో 8. సికిందర్ రజా(జింబాబ్వే)- 219 పరుగులు-8 మ్యాచ్‌లలో- 10 వికెట్లు 9. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 వికెట్లు- 8 మ్యాచ్‌లలో చదవండి: 152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్ -
నాకు ఓటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు: విరాట్ కోహ్లి
దుబాయ్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత నెలలో కనబరిచిన ప్రదర్శనకుగాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో భారత క్రికెటర్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్తాన్‌పై అసాధారణ ఇన్నింగ్స్‌తో (82 నాటౌట్) జట్టును గెలిపించిన కోహ్లి... నెదర్లాండ్స్ (62 నాటౌట్), బంగ్లాదేశ్ (64 నాటౌట్)లపై కూడా అజేయ అర్ధసెంచరీలతో శివమెత్తాడు. దక్షిణాఫ్రికా (12)తో విఫలమైన కోహ్లి... జింబాబ్వేపై 26 పరుగులు చేశాడు. దీంతో కోహ్లితో పాటు అవార్డు రేసులో మిల్లర్ (దక్షిణాఫ్రికా), సికందర్ రజా (జింబాబ్వే) ఉన్నప్పటికీ భారత ఆటగాడినే ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ వరించింది. నెలవరీ ప్రదర్శనకిచ్చే అవార్డు అతనికిదే తొలిసారి. ‘అక్టోబర్ నెలకు సంబంధించిన అవార్డు నాకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఓటేసిన క్రికెట్ అభిమానులు, ప్యానెల్ సభ్యులకు ధన్యవాదాలు’ అని కోహ్లి తెలిపినట్లు ఐసీసీ వెల్లడించింది. మహిళా క్రికెటర్లలో పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ నిదా దార్ ఈ అవార్డుకు ఎంపికయింది. ఆమెతో భారత ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ పోటీపడ్డారు. ఆయితే ఆసియా కప్ టోర్నీలో నిలకడగా రాణించిన పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌కే ఈ అవార్డు లభించింది. -
‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’... హర్మన్‌ప్రీత్
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నెలలో అద్భుతంగా రాణించింది. ఇంగ్లండ్ పర్యటనలో మూడు వన్డేల్లో 74 నాటౌట్, 143 పరుగులతో చెలరేగింది. ఆఖరి వన్డేలో 4 పరుగులు చేసినప్పటికీ భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆమె అసాధారణ ఆటతీరుతో 23 ఏళ్ల (1999) తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత్ అమ్మాయిలు సిరీస్ గెలిచారు. -
భారత అమ్మాయిల ‘హ్యాట్రిక్’
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. దీంతో భారత అమ్మాయిల జట్టు 104 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ టోర్నీలో మహిళల జట్టుకిది వరుసగా మూడో విజయం. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (10), రిచా ఘోష్ (0), దయాళన్ హేమలత (2) నిరాశపరచడంతో భారత్ 20 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి, ఐదో వరుస బ్యాటర్ జెమీమా ధాటిగా ఆడారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. తదుపరి మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 7న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
Asia Cup 2022: మనసులో మాటను బయటపెట్టిన పాక్ ఆల్‌రౌండర్
పాకిస్తాన్ లెగ్‌స్పిన్నర్.. వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్‌లు ఆగస్టు 28న దుబాయ్‌లోని షేక్ జాయెద్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో షాదాబ్ ఖాన్ తన మనుసులోని మాటను బయటపెట్టాడు. ''వ్యక్తిగతంగా ఆసియాకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవాలనేది నా లక్ష్యం. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మాతోపాటు భారత్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా ఉన్నాయి. ఈ జట్ల నుంచి వరల్డ్ మేటి క్రికెటర్లు ఉన్నారు. వాళ్లందరిని దాటుకొని లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. నా వంతు ప్రయత్నం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే. ఆ నమ్మకమే నాకు సక్సెస్‌తో పాటు అవార్డును కూడా తీసుకొస్తుంది. ఒకవేళ ఆసియాకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ట్రోపీ ఎత్తుకుంటే మాత్రం నా గోల్ పూర్తయినట్లే. కానీ అల్టిమేట్ లక్ష్యం మాత్రం పాకిస్తాన్‌కు ఆసియా కప్ అందించడమే. ఇది నా ప్రథమ కర్తవ్యం. దీని తర్వాతే మిగతావన్నీ'' అని పీసీబీకి ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. 23 ఏళ్ల షాదాబ్ ఖాన్ తన లెగ్ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడంతో అవసరమైన దశలో బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించడంలో దిట్ట. షాదాబ్ ఖాన్ మంచి ఫీల్డర్ కూడా. గూగ్లీ వేయడంలో దిట్ట అయిన షాదాబ్ ఖాన్ పాక్ తరపున 64 టి20ల్లో 73 వికెట్లు.. 275 పరుగులు, 52 వన్డేల్లో 69 వికెట్లు, 596 పరుగులు, 6 టెస్టుల్లో 14 వికెట్లు, 300 పరుగులు సాధించాడు. చదవండి: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. వెన్నునొప్పితో కీలక బౌలర్ దూరం! కోహ్లి, రోహిత్ అయిపోయారు.. ఇప్పుడు పంత్, జడేజా వంతు -
IPL 2022: రాయల్స్‌కు ‘జై’
ముంబై: సీజన్ ఆరంభానికి ముందు రాజస్తాన్ రాయల్స్ జట్టు యశస్వి జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. ఆడిన 3 మ్యాచ్‌లలో వరుసగా 20, 1, 4 పరుగులే చేయడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించింది. ఇప్పుడు నెల రోజుల తర్వాత అతనికి మళ్లీ బరిలోకి దిగే అవకాశం రాగా, యశస్వి దానిని సమర్థంగా వాడుకొని జట్టును గెలిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీకి తోడు బౌలింగ్ లో చహల్ (3/28) రాణించడంతో రాజస్తాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. శనివారం జరిగిన పోరులో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (40 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్), జితేశ్ శర్మ (18 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. అనంతరం రాజస్తాన్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు సాధించింది. హెట్‌మైర్ (16 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పడిక్కల్ (32 బంతుల్లో 31; 3 ఫోర్లు), బట్లర్ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రాణించిన జితేశ్... బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లతో శుభారంభం చేసిన బెయిర్‌స్టో... అతని మరో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. బట్లర్ ఒంటిచేత్తో చక్కటి క్యాచ్ పట్టడంతో శిఖర్ ధావన్ (12) నిష్క్రమించాడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు రాజపక్స (18 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, బెయిర్‌స్టో తన ధాటిని కొనసాగిస్తూ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి మూడు వికెట్లు పడగొట్టి చహల్... పంజాబ్‌ను దెబ్బ తీశాడు. చహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాజపక్స క్లీన్‌బౌల్డ్ కాగా, అతని తర్వాతి ఓవర్లో మయాంక్ అగర్వాల్ (15), బెయిర్‌స్టో వెనుదిరిగారు. ఈ దశలో జితేశ్, లివింగ్‌స్టోన్ (14 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) భాగస్వామ్యం పంజాబ్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు కలిసి 26 బంతుల్లో 50 పరుగులు జత చేశారు. ప్రసిధ్ ఓవర్లో 6, 4 కొట్టిన అనంతరం లివింగ్‌స్టోన్ అదే ఓవర్లో బౌల్ట్ కాగా, కుల్దీప్ సేన్ వేసిన చివరి ఓవర్లో జితేశ్ ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. హెట్‌మైర్ మెరుపులు... తొలి ఓవర్లలో 2 ఫోర్లు, సిక్స్‌తో దూకుడు ప్రదర్శించిన యశస్వి ఇన్నింగ్స్ మొత్తం అదే జోరును ప్రదర్శించాడు. మరోవైపు రబడ వేసిన నాలుగో ఓవర్లో బట్లర్ ఆట హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో వరుసగా 6, 4, 4, 2, 4 బాది 20 పరుగులు రాబట్టిన అతను చివరి బంతికి వెనుదిరిగాడు. సామ్సన్ (12 బంతుల్లో 23; 4 ఫోర్లు) కూడా వేగంగా ఆడగా 33 బంతుల్లో యశస్వి అర్ధసెంచరీ పూర్తయింది. అయితే కీలక సమయంలో యశస్వి అవుట్ కాగా, పడిక్కల్ నెమ్మదిగా ఆడటంతో రాయల్స్‌పై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి స్థితిలో హెట్‌మైర్ జట్టు గెలుపును సునాయాసం చేశాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన అతను చకచకా పరుగులు సాధించి మరో 2 బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) చహల్ 56; శిఖర్ ధావన్ (సి) బట్లర్ (బి) అశ్విన్ 12; రాజపక్స (బి) చహల్ 27; మయాంక్ (సి) బట్లర్ (బి) చహల్ 15; జితేశ్ (నాటౌట్) 38; లివింగ్‌స్టోన్ (బి) ప్రసిధ్ 22; రిషి ధావన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–47, 2–89, 3–118, 4–119, 5–169. బౌలింగ్: బౌల్ట్ 4–1–36–0, ప్రసిధ్ 4–0–48–1, కుల్దీప్ సేన్ 4–0–42–0, అశ్విన్ 4–0–32–1, చహల్ 4–0–28–3. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) లివింగ్‌స్టోన్ (బి) అర్‡్షదీప్ 68; బట్లర్ (సి) రాజపక్స (బి) రబడ 30; సామ్సన్ (సి) శిఖర్ ధావన్ (బి) రిషి ధావన్ 23; పడిక్కల్ (సి) మయాంక్ (బి) అర్‡్షదీప్ 31; హెట్‌మైర్ (నాటౌట్) 31 పరాగ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–46, 2–85, 3–141, 4–182. బౌలింగ్: సందీప్ 4–0–41–0, రబడ 4–0–50–1, అర్‡్షదీప్ 4–0–29–2, రిషి ధావన్ 3–0–25–1, రాహుల్ చహర్ 3.4–0–39–0, లివింగ్‌స్టోన్ 1–0–6–0. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X బెంగళూరు వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ X చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
IPL 2022: కోల్‌కతా... అదే కథ
ముంబై: ప్రత్యర్థి స్పిన్, పేస్ ధాటికి మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మళ్లీ తడబడింది. ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదో పరాజయం చవిచూసింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ (4/14) తన స్పిన్‌తో... ముస్త ఫిజుర్ (3/18) తన పేస్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కట్టిపడేశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఢిల్లీ కష్టపడి ఛేదించింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో క్యాపిటల్స్ జట్టు 4 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై నెగ్గింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. నితీశ్ రాణా (34 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (26 బంతుల్లో 42; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా, పావెల్ (16 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) గెలిచేదాకా నిలిచాడు. కుల్దీప్ స్పిన్ ఉచ్చులో... ఆరంభం నుంచే నైట్‌రైడర్స్ కష్టాలు పడింది. చేతన్ సకారియా రెండో ఓవర్లో అందివచ్చిన లైఫ్‌ను ఫించ్ (3) తర్వాతి బంతికే సమర్పించుకున్నాడు. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (6)ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. కోల్‌కతా పవర్‌ప్లే స్కోరు 29/2. ఆ తర్వాత కుల్దీప్ స్పిన్ ఉచ్చులో కోల్‌కతా చిక్కుకుంది. బౌలింగ్‌కు దిగిన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో బాబా ఇంద్రజిత్ (6), సునీల్ నరైన్ (0)లను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న అయ్యర్‌ను, అప్పుడే వచ్చిన హిట్టర్ రసెల్ (0)ను కుల్దీప్ డగౌట్‌కు పంపాడు. దాంతో కోల్‌కతా మళ్లీ కష్టాల్లో పడింది. ఢిల్లీ కష్టపడి లక్ష్యానికి... ఏమంత కష్టమైన లక్ష్యం కానప్పటికీ ఢిల్లీ ఆరంభం కూడా పేలవమే! పరుగుకు ముందే వికెట్ పడింది. ఉమేశ్ తొలి బంతికి పృథ్వీ షా (0) డకౌటయ్యాడు. రెండో ఓవర్లో మిచెల్ మార్ష్ (13)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. అయితే క్రీజులో వార్నర్ ఉండటం ఢిల్లీని తేలిగ్గా నడిపించింది. చక్కగా కుదుటపడిన ఈ సమయంలో ఉమేశ్... వార్నర్‌ను అవుట్ చేయడంతో ఢిల్లీ కష్టాలపాలైంది. కేవలం రెండే పరుగుల తేడాతో మూడు ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయింది. తర్వాత శార్దుల్ (8 నాటౌట్), పావెల్ నిలబడటంతో ఢిల్లీ విజయం సాధించింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) సకారియా 3; వెంకటేశ్ (సి) సకారియా (బి) అక్షర్ 6; అయ్యర్ (సి) పంత్ (బి) కుల్దీప్ 42; బాబా ఇంద్రజిత్ (సి) పావెల్ (బి) కుల్దీప్ 6; నరైన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 0; నితీశ్ రాణా (సి) సకారియా (బి) ముస్తఫిజుర్ 57; రసెల్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 0; రింకూ సింగ్ (సి) పావెల్ (బి) ముస్తఫిజుర్ 23; ఉమేశ్ (నాటౌట్) 0; సౌతీ (బి) ముస్తఫిజుర్ 0; హర్షిత్ రాణా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–4, 2–22, 3–35, 4–35, 5–83, 6–83, 7–145, 8–146, 9–146. బౌలింగ్: ముస్తఫిజుర్ 4–0–18–3; సకారియా 3–0–17–1, శార్దుల్ 3–0–32–0, అక్షర్ 4–0–28–1, కుల్దీప్ 3–0–14–4, లలిత్ 3–0–32–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి అండ్ బి) ఉమేశ్ 0; వార్నర్ (సి) నరైన్ (బి) ఉమేశ్ 42; మార్‡్ష (సి) వెంకటేశ్ (బి) హర్షిత్ 13; లలిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 22; పంత్ (సి) ఇంద్రజిత్ (బి) ఉమేశ్ 2; పావెల్ (నాటౌట్) 33; అక్షర్ (రనౌట్) 24; శార్దుల్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–82, 4–84, 5–84, 6–113. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4–0–24–3, హర్షిత్ రాణా 3–0–24–1, సౌతీ 4–0–31–0, నరైన్ 4–0–19–1, నితీశ్ రాణా 1–0–14–0, రసెల్ 1–0–14–0, వెంకటేశ్ 1–0–14–0, శ్రేయస్ అయ్యర్ 1–0–7–0. ఐపీఎల్లో నేడు పంజాబ్ కింగ్స్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: çపుణే, రాత్రి గం. 7:30 నుంచ స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. A return to winning ways for the Delhi Capitals! 👏 👏 The Rishabh Pant-led side beat #KKR by 4 wickets & seal their 4⃣th win of the #TATAIPL 2022. 👍 👍 Scorecard ▶️ https://t.co/jZMJFLuj4h #DCvKKR pic.twitter.com/QCQ4XrJn0P — IndianPremierLeague (@IPL) April 28, 2022 -
కత్తి కార్తీక్
ముంబై: గత ఐదు మ్యాచ్‌లలో సహాయక పాత్రలో బెంగళూరుకు విజయాలు అందించిన దినేశ్ కార్తీక్ ఈసారి మరింత ఎక్కువ బాధ్యతతో తానే ముందుండి జట్టును గెలిపించాడు. శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, షహబాజ్ (21 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్ (38 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), రిషభ్ పంత్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశారు. బెంగళూరు బౌలర్లు హేజల్‌వుడ్ (3/28), సిరాజ్ (2/31) రాణించారు. బెంగళూరు ఓపెనర్లు డుప్లెసిస్ (8), రావత్ (0) తక్కువ వ్యవధిలో పెవిలియన్ చేరగా, అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి కోహ్లి (12) రనౌట య్యాడు. ఈ దశలో మ్యాక్స్‌వెల్ దూకుడైన బ్యాటింగ్ జట్టును నిలబెట్టింది. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడిన మ్యాక్స్‌వెల్... కుల్దీప్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి 23 పరుగులు రాబట్టాడు. మ్యాక్సీ వెనుదిరిగిన తర్వాత మెరుపు బ్యాటింగ్ బాధ్యతను దినేశ్ కార్తీక్ తీసుకున్నాడు. 5 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను పంత్ వదిలేయడం కూడా ఆర్సీబీకి కలిసొచ్చింది. ఆ తర్వాత కార్తీక్ చెలరేగిపోయాడు. ముఖ్యంగా ముస్తఫిజుర్ వేసిన 18వ ఓవర్లో అతని బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో కార్తీక్ వరుసగా 4, 4, 4, 6, 6, 4 (మొత్తం 28 పరుగులు) బాదడం విశేషం. 26 బంతుల్లోనే కార్తీక్ హాఫ్ సెంచరీ సాధించాడు. వార్నర్ బ్యాటింగ్ మినహా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనిపించలేదు. పృథ్వీ షా (16), మిచెల్ మార్‡్ష (14), పావెల్ (0), లలిత్ యాదవ్ (1) విఫలమయ్యారు. వార్నర్ క్రీజ్‌లో ఉన్నంత వరకు ఢిల్లీ గెలుపుపై నమ్మకంతో ఉన్నా... హసరంగ బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుదిరగడంతో ఆశలు సన్నగిల్లాయి. -
వారెవా వ్యాట్... సిక్సర్ సోఫీ..!
క్రైస్ట్‌చర్చ్: డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్ జట్టు మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లలో ఓడి ఒక దశలో లీగ్ స్థాయిలోనే నిష్క్రమించేలా కనిపించిన టీమ్...మ్యాచ్ మ్యాచ్‌కు పదునైన ఆటను ప్రదర్శిస్తూ ఆరో సారి మెగా టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డ్యానీ వ్యాట్ (125 బంతుల్లో 129; 12 ఫోర్లు) శతకంతో చెలరేగగా, సోఫీ డన్‌క్లీ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. డు ప్రీజ్ (30)దే అత్యధిక స్కోరు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (6/36) ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. శతక భాగస్వామ్యం... ఓపెనర్ బీమాంట్ (7), కెప్టెన్ హీతర్ నైట్ (1), సివర్ (15) విఫలం కాగా, ఎమీ జోన్స్ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. అయితే వ్యాట్, డన్‌క్లీ కలిసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరిని నిలువరించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా వ్యాట్ ఇచ్చిన ఐదు క్యాచ్‌లు వదిలేసి (22, 36, 77, 116, 117 పరుగుల వద్ద) సఫారీ టీమ్ ప్రత్యర్థికి మేలు చేసింది! ఈ క్రమంలో 98 బంతుల్లోనే వ్యాట్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు పార్ట్నర్షిప్ వంద పరుగులు దాటిన తర్వాత 45వ ఓవర్లో వ్యాట్ వెనుదిరిగింది. చివరి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 75 పరుగులు చేసింది. టపటపా... 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ చేతిలో సెమీస్‌లోనే ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారీ అదే తరహాలో వెనుదిరిగింది. ఛేదనలో ఆ జట్టు ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. టోర్నీలో టాప్ స్కోరర్ అయిన లౌరా వాల్వార్ట్ (0) డకౌట్‌తో దక్షిణాఫ్రికా పతనం మొదలు కాగా, ఆ తర్వాత ఒక్కరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దలేకపోయారు. 67/4 తర్వాత ఎకెల్‌స్టోన్ జోరు మొదలైంది. తర్వాతి ఆరు వికెట్లూ ఆమె ఖాతాలోనే చేరడం విశేషం. -
వన్డే చరిత్రలో ప్రసిధ్ కృష్ణ కొత్త రికార్డు
టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరపున మొదటి ఏడు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు అతను ఆడిన ఏడు వన్డేలు కలిపి 18 వికెట్లు తీశాడు. అంతకముందు అజిత్ అగార్కర్, బుమ్రాలు తొలి ఏడు వన్డేల్లో 16 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో 15 వికెట్లతో టీమిండియా మాజీ ఆటగాడు ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో 14 వికెట్లతో నరేంద్ర హిర్వాణి, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్‌లు సంయుక్తంగా ఉన్నారు. అంతేకాదు సిరీస్‌లో బౌలింగ్‌లో విశేషంగా రాణించి మూడు వన్డేల్లో తొమ్మిది వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం విశేషం. ఇక మూడో వన్డేలో టీమిండియా 96 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో రాణించగా.. పంత్ 56 పరుగులతో మెరిశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులుకే కుప్పకూలింది. -
ఆటకు శామ్యూల్స్ టాటా
కింగ్స్టన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు ఫైనల్స్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల శామ్యూల్స్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. 2018 డిసెంబర్లో శామ్యూల్స్ చివరిసారి వెస్టిండీస్ తరఫున (బంగ్లాదేశ్‌పై) అంతర్జాతీయ వన్డేలో బరిలోకి దిగాడు. 2000లో క్రికెట్లో అడుగుపెట్టిన శామ్యూల్స్ ప్రపంచ వ్యాప్తంగా పలు టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. కొలంబోలో జరిగిన 2012 టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై (56 బంతుల్లో 78; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు)... కోల్‌కతాలో జరిగిన 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శామ్యూల్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ప్రదర్శనతోనే విండీస్ రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు ఫైనల్స్‌లో శామ్యూల్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు కూడా లభించాయి. శామ్యూల్స్ కెరీర్లో వివాదాలూ ఉన్నాయి. 2008లో బుకీల నుంచి శామ్యూల్స్ డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015లో అతని బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఏడాదిపాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించారు. ఓవరాల్‌గా తన కెరీర్లో శామ్యూల్స్ 71 టెస్టులు ఆడి 3,917 పరుగులు (7 సెంచరీలు; 24 అర్ధ సెంచరీలు)... 207 వన్డేలు ఆడి 5,606 పరుగులు (10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు)... 67 టి20లు ఆడి 1,611 పరుగులు (10 అర్ధ సెంచరీలు) చేశాడు. టెస్టుల్లో 41 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టి20ల్లో 22 వికెట్లు కూడా తీశాడు. -
శుబ్‌మన్ అజేయ సెంచరీ
న్యూఢిల్లీ: అండర్–19 వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (111 బంతుల్లో 106 నాటౌట్; ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ ‘సి’ జట్టు దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో నమోదైన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’పై 6 వికెట్ల తేడాతో ‘సి’ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (69; 5 ఫోర్లు), నితీశ్ రాణా (68; 6 ఫోర్లు, 1 సిక్స్), అన్మోల్ప్రీత్ సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు), కేదార్ జాదవ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు రాబట్టడంతో చివరి 10 ఓవర్లలో 92 పరుగులు వచ్చాయి. ప్రత్యర్థి బౌలర్లలో విజయ్ శంకర్ 3, చహర్ 2, గుర్బాని ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ ‘సి’ 47 ఓవర్లలో 4 వికెట్లకు 296 పరుగులు చేసి విజయాన్నందుకుంది. లక్ష్యఛేదనలో 85 పరుగులకే కెప్టెన్ రహానే (14), అభినవ్ ముకుంద్ (37; 6 ఫోర్లు), సురేశ్ రైనా (2) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ‘సి’ జట్టును శుబ్‌మన్ గిల్ ఆదుకున్నాడు. ఇషాన్ కిషన్ (60 బంతుల్లో 69; 11 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 121, సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి అభేద్యమైన ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. విజయానికి 5 ఓవర్లలో 27 పరుగులు అవసరమైన దశలో శుబ్‌మన్, సూర్యకుమార్ యాదవ్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడటంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే ‘సి’ జట్టు గెలుపొందింది. అశ్విన్, ధవల్ కులకర్ణి, ములాని తలా ఓ వికెట్ పడగొట్టారు. సిరాజ్ నిరాశ పరిచాడు. మూడు ఓవర్లు వేసి 32 పరుగులిచ్చాడు. శనివారం జరిగే ఫైనల్లో భారత్ ‘బి’తో ‘సి’ జట్టు తలపడనుంది. -
అదే ‘స్ఫూర్తి’ కావాలి!
ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఎదురైంది అవమానకర ఓటమే. గతంలో ఎన్నడూ చూడని పరాభవమే కావచ్చు... కానీ అడుగులు అక్కడే ఆగిపోవుగా! పడిన ప్రతీ సారి పైకి లేచేందుకు కూడా ఆటలో మరో అవకాశం ఉంటుంది. అణువణువునా ఆత్మవిశ్వాసం లోపించిన భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో మట్టికరిచింది గాక... కానీ ఉస్సురని కూలిపోకుండా ఉవ్వెత్తున లేచేందుకు, మన బలం, బలగం చాటేందుకు మళ్లీ సన్నద్ధమవ్వాలి. వన్డేలకు జట్టూ మారింది... ఆపై అండగా నిలిచేందుకు కొత్త సహాయక సిబ్బందీ రానున్నారు. అన్నట్లు...ఇంగ్లండ్ గడ్డపై ఆఖరి సారి వన్డేలు ఆడినప్పుడు మనమే చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్లం. జట్టులో కొత్త ఉత్సాహం నింపేందుకు నాటి ప్రదర్శన స్ఫూర్తి సరిపోదా! ఏడాది క్రితం ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ ఎక్కడా ఉదాసీనత కనబర్చకుండా ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక...ఇలా ప్రతి పటిష్ట జట్టును ఓడించింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ అయితే అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఒక దశలో గెలుపు అవకాశాలు లేకున్నా... పట్టుదలతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. అప్పుడు కూడా ఇంగ్లండ్‌లో సీమర్లకు అనుకూలించే వాతావరణంలో భారత జట్టు టైటిల్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మనవాళ్లు సమష్టి ప్రదర్శనతో సంచలనం నమోదు చేశారు. వాళ్లలో తొమ్మిదిమంది... నాటి జట్టులో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో వారు, వీరని లేకుండా ఆటగాళ్లంతా కీలక పాత్ర పోషించారు. 2 సెంచరీలు సహా 363 పరుగులు చేసి ధావన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంటే... కోహ్లి, రోహిత్ శర్మ నిలకడైన ఆటతీరుతో అతనికి అండగా నిలిచారు. ఇక ఇంగ్లండ్ వికెట్లపై కూడా స్పిన్‌తో విజయాలు దక్కుతాయని జడేజా నిరూపించాడు. కేవలం 12.83 సగటుతో అతను 12 వికెట్లు తీశాడు. ఇక ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ భువనేశ్వర్ విజయానికి బాటలు వేశాడు. వీరంతా ఇప్పుడు వన్డే సిరీస్‌లో అప్పటి ప్రదర్శనను పునరావృతం చేయాల్సి ఉంది. రైనా రాకతో వన్డే బ్యాటింగ్ పటిష్టంగా మారిందనడంలో సందేహం లేదు. రహానే, రాయుడు కూడా మిడిలార్డర్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు వన్డే వరల్డ్ కప్‌కు ఎక్కువగా సమయం లేదు. ఇంగ్లండ్‌లోని పరిస్థితుల్లో ఈ సిరీస్‌లో రాణించే ఆటగాళ్లకే ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి శామ్సన్, కరణ్ శర్మలాంటి ఆటగాళ్లు కూడా తమ సామర్థ్యం నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. వన్డే వ్యూహాల్లో దిట్ట టెస్టు కెప్టెన్సీ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా... ధోని వన్డే కెప్టెన్సీ మాత్రం అద్భుతం అనేది అందరూ అంగీకరించాల్సిందే. ఏ దశలోనూ గెలుపు అవకాశం లేని స్థితినుంచి జట్టును విజయం వైపు మళ్లించడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య. క్లిష్ట పరిస్థితుల్లో అతడి వ్యూహాలే జట్టును నిలబెడతాయి. ఒక్కసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటే చాలు అతనేమిటో తెలుస్తుంది. 3 ఓవర్లలో 27 పరుగులిచ్చిన ఇషాంత్‌తో 18వ ఓవర్ వేయించడం... అదే ఓవర్లో 2 వికెట్లతో మ్యాచ్ భారత్ వైపు మళ్లించడం ధోనికే సాధ్యమైంది. కెప్టెన్సీనే కాకుండా ధోని ధనాధన్ బ్యాటింగ్ కూడా జట్టుకు బలం. 2011 సిరీస్‌లో వన్డేల్లోనూ మనకు ఒక్క విజయం కూడా దక్కలేదు. అయితే ఈ సారి గత రికార్డును సవరించాలని ధోని భావిస్తున్నాడు. కాబట్టి టెస్టు సిరీస్‌తో పోలిస్తే కెప్టెన్‌నుంచి మరింత మెరుగైన ఫలితాన్ని ఆశించవచ్చు. శాస్త్రి బృందం ఏం చేయనుంది..? అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్ అయిన వెంటనే రవిశాస్త్రి... తాను కామెంటేటర్‌గా మారనున్నట్లు, రెండేళ్లలో అగ్రశ్రేణి వ్యాఖ్యాతగా నిలబడతానని తన సహచరులతో చాలెంజ్ చేశాడు. పట్టుదలతో అతను దానిని చేసి చూపించాడు. క్రికెట్ ఆడే సమయంలోనూ భారత జట్టులో ‘మానసికంగా దృఢమైన’ వ్యక్తిగా శాస్త్రికి పేరుంది. రవిశాస్త్రి భారత డెరైక్టర్ పాత్ర నిర్వహించేందుకు సమర్థుడు అని అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పుడు జట్టులో ఆటగాళ్ల ప్రతిభను బట్టి చూస్తే పెద్దగా సమస్య లేదు. ఆటగాళ్లతో సంభాషిస్తూ వారి బలాలు, బలహీనతలు గుర్తించి వన్డేలకు తగిన విధంగా మలచడం శాస్త్రిలాంటి సీనియర్‌కు సమస్య కాకపోవచ్చు. అయితే భారీ ఓటమినుంచి వారిని విజయాల బాట పట్టించాలంటే మానసికంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాల్సి ఉంది. ఈ సమయంలో సంజయ్ బంగర్ సహకారం కూడా కీలకం కానుంది. ఐపీఎల్లో పంజాబ్ ఒక్కసారిగా దూసుకు రావడానికి... క్రెడిట్ మొత్తం బంగర్‌దే. మార్పుల తర్వాతైనా టెస్టు పరాజయాలు మరచిపోయే విధంగా భారత్ వన్డేల్లో విజయాలతో అభిమానులను అలరించాలని, తిరిగి గాడిలో పడి ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఉపఖండంలో మ్యాచ్‌లను మినహాయిస్తే ఈ సిరీస్ తర్వాత మనం వన్డేలు ఆడేది ఆస్ట్రేలియా గడ్డపైనే! - సాక్షి క్రీడా విభాగం