టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరపున మొదటి ఏడు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు అతను ఆడిన ఏడు వన్డేలు కలిపి 18 వికెట్లు తీశాడు. అంతకముందు అజిత్ అగార్కర్, బుమ్రాలు తొలి ఏడు వన్డేల్లో 16 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో 15 వికెట్లతో టీమిండియా మాజీ ఆటగాడు ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో 14 వికెట్లతో నరేంద్ర హిర్వాణి, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్‌లు సంయుక్తంగా ఉన్నారు. అంతేకాదు సిరీస్‌లో బౌలింగ్‌లో విశేషంగా రాణించి మూడు వన్డేల్లో తొమ్మిది వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం విశేషం.
ఇక మూడో వన్డేలో టీమిండియా 96 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో రాణించగా.. పంత్ 56 పరుగులతో మెరిశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులుకే కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment