ఒ‍క్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు | T20 World Cup 2024: Bumrah Wins Man Of The Tournament Award, Despite Not Scoring Single Run | Sakshi
Sakshi News home page

ఒ‍క్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు

Published Tue, Jul 2 2024 12:18 PM | Last Updated on Tue, Jul 2 2024 12:39 PM

T20 World Cup 2024: Bumrah Wins Man Of The Tournament Award, Despite Not Scoring Single Run

టీమిండియా టీ20 ప్రపంచకప్‌ 2024 సాధించడంలో కీలకపాత్ర పోషించి, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఓ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఒ‍క్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన మొదటి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

మెగా టోర్నీలో బుమ్రాకు ఒకే ఒక్క సారి బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో బుమ్రా గోల్డెన్‌ డకౌటయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్లేయర్‌ ఒక్క పరుగు కూడా చేయకుండా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డును గెలుచుకోలేదు. 

ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.  ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన జస్సీ.. 29.4 ఓవర్లలో 8.27 సగటున 15 వికెట్లు తీశాడు.

ఇదిలా ఉంటే, తాజాగా ముగసిన టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఫైనల్లో భారత్‌.. సౌతాఫ్రికాపై విజయం సాధించి, రెండో సారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విరాట్‌ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 47; ఫోర్‌, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్‌, రబాడ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్‌ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. 

లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్‌ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్‌, అర్ష్‌దీప్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement