
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్‌గా ఇంగ్లండ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విశ్వవిజేతగా ఇంగ్లండ్ అవతరించడంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ముఖ్యంగా ఫైనల్లో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను దెబ్బకొట్టాడు. తుదిపోరులో తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు.
ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన కర్రాన్ 13 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శన గాను ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా కర్రాన్ ఎంపికయ్యాడు. అదే విధంగా ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కర్రాన్‌కే వరిచింది. కాగా ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు సాధించిన తొలి స్పెషలిస్టు బౌలర్‌గా సామ్ కర్రాన్ నిలిచాడు.
టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచినది వీరే
షాహిద్ అఫ్రిది(2007)
తిలకరత్నే దిల్షాన్(2009)
కెవిన్ పీటర్సన్(2010)
షేన్ వాట్సన్(2012)
విరాట్ కోహ్లీ(2014,2016)
డేవిడ్ వార్నర్(2021)
సామ్ కర్రాన్(2022)
చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి!
Comments
Please login to add a commentAdd a comment