ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గిల్ ఏకంగా 93 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్ 245 పరగులు సాధించాడు.
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో గిల్(130) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే విధంగా గత కొన్ని సిరీస్‌ల నుంచి భీకర ఫామ్‌లో ఉన్న జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా నాలుగు స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో రజా సెంచరీతో చేలరేగాడు. కాగా అతడు ఆడిన గత ఆరు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం గమనార్హం.
మరోవైపు నెదార్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారాడు. ఇక ఓవరాల్‌గా వన్డే ర్యాంకిగ్స్‌లో 890 పాయింట్లతో బాబర్ ఆగ్రస్థానంలో కొనసాగుతండగా.. రెండు మూడు స్థానాల్లో వరుసగా ప్రోటీస్ ఆటగాళ్లు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (789), క్వింటన్ డి కాక్ (784) నిలిచారు.
చదవండి: Asia Cup 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు!
Comments
Please login to add a commentAdd a comment