హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ ఊదిపడేశారు.
జింబాబ్వే బౌలర్లను చొతక్కొట్టారు. యశస్వీ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేయగా.. గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 156 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్-జైశ్వాల్ జోడీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
టీ20 క్రికెట్‌లో ఛేజింగ్‌లో భారత తరపున రెండు సార్లు 150 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా గిల్-జైశ్వాల్ నిలిచారు. వీరిద్దరూ టీ20ల్లో 150 పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే రెండో సారి.
ఇంతకుముందు 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో జైస్వాల్, గిల్ ఇద్దరూ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా ఛేజింగ్‌లో నెలకొల్పినివే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్‌ను గిల్, జైశ్వాల్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టీ20 చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవే..
165 - రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ శ్రీలంక, ఇండోర్, 2017
165 - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్‌మన్ గిల్ వర్సెస్ వెస్టిండీస్, లాడర్‌హిల్, 2023
160 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ ఐర్లాండ్, డబ్లిన్, 2018
158 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ న్యూజిలాండ్, ఢిల్లీ, 2017
156* - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్‌మన్ గిల్ వర్సెస్ జింబాబ్వే, హరారే, 2024
Comments
Please login to add a commentAdd a comment