జింబాబ్వేతో కీలకమైన మూడో టీ20కి టీమిండియా సన్నద్ధమైంది. హరారే వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే చేరికతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది.
అయితే, అదే సమయంలో తుదిజట్టు కూర్పు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ కుదురుకున్నాడు. తొలి టీ20లో అభిషేక్ విఫలమైనా.. రెండో టీ20లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు.
కాబట్టి ఈ పంజాబీ బ్యాటర్‌ను తప్పించేందుకు మేనేజ్‌మెంట్ సుముఖత చూపకపోవచ్చు. ఈ నేపథ్యంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఆడించే విషయంలో సందిగ్దం నెలకొంది. ఈ క్రమంలో అతడిని జట్టులో చేర్చాలంటే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడే అవకాశం కనిపిస్తోంది.
వికెట్ కీపర్‌గా అతడికే ఛాన్స్
యశస్వి- అభిషేక్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు సమాచారం. దీంతో బ్యాటర్ సాయి సుదర్శన్‌పై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు.. సంజూ శాంసన్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ స్థానం ప్రశ్నార్థకమైంది.
అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం.. వికెట్ కీపర్‌గా అతడికే ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కాగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాని యశస్వి, సంజూలను ఈ మ్యాచ్‌లో తప్పక ఆడించాలనే యోచనలో ఉన్న బీసీసీఐ.. శివం దూబేకు మాత్రం విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.
ఒకే ఒక్క మార్పుతో
ఇదిలా ఉంటే .. జింబాబ్వే ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగన్నుట్లు సమాచారం. లెఫ్టార్మ్ పేసర్ రిచర్డ్ ఎన్గరవా ఫిట్‌నెస్ సాధిస్తే.. ల్యూక్ జాంగ్వేకు ఉద్వాసన పలుకనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడో టీ20 బుధవారం సాయంత్రం గం. 4:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
పిచ్ స్వభావం, వాతావరణం
హరారే పిచ్ బౌలర్లు, బ్యాటర్లకు సమంగా అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.
జింబాబ్వేతో మూడో టీ20కి భారత తుదిజట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్.
జింబాబ్వే తుదిజట్టు(అంచనా)
వెస్లీ మెదవెరె, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియాన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకజ్ద, ల్యూక్ జాంగ్వే/ రిచర్డ్ ఎన్గరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చతారా.
The #T20WorldCup-winning trio is in the house... 👏 👏
... and they are 𝙍𝙖𝙧𝙞𝙣𝙜 𝙏𝙤 𝙂𝙤! 💪 💪#TeamIndia | #ZIMvIND | @IamSanjuSamson | @IamShivamDube | @ybj_19 pic.twitter.com/E0rNOkHmTz— BCCI (@BCCI) July 9, 2024
Comments
Please login to add a commentAdd a comment