ICC one day rankings
-
దుమ్మురేపిన ఇషాన్ కిషన్.. ఏకంగా 117 స్థానాలు ఎగబాకి!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు దుమ్ము రేపాడు. బంగ్లాదేశ్‌తో వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన కిషన్.. ఏకంగా 117 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 పరుగులు చేశాడు. ఇక బంగ్లాదేశ్పైనే సెంచరీ చేసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ 15వ ర్యాంక్‌కు చేరుకోగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ 22వ స్థానంలో నిలిచాడు. ఇక టాప్ ర్యాంక్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. ఐసీసీ టాప్-10 వన్డే ర్యాంక్స్లో ఉన్నది వీరే 1.బాబర్ ఆజం (పాకిస్తాన్)-890 రేటింగ్ 2.ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)- 779 రేటింగ్ 3.రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)-766 రేటింగ్ 4.క్వింటన్ డికాక్ (దక్షిణాప్రికా)-759 రేటింగ్ 5.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)-747 రేటింగ్ 6.స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 719 రేటింగ్ 7.జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్)- 710 రేటింగ్ 8.విరాట్ కోహ్లి(భారత్)-707 రేటింగ్ 9.రోహిత్ శర్మ(భారత్)-705 రేటింగ్ 10.కేన్ విలియమ్సన్-700 రేటింగ్ చదవండి: FIFA WC2022: ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం -
ICC Rankings: అదరగొట్టిన శుబ్‌మన్ గిల్.. ఏకంగా 93 స్థానాలు ఎగబాకి..!
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గిల్ ఏకంగా 93 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్ 245 పరగులు సాధించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో గిల్(130) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే విధంగా గత కొన్ని సిరీస్‌ల నుంచి భీకర ఫామ్‌లో ఉన్న జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా నాలుగు స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో రజా సెంచరీతో చేలరేగాడు. కాగా అతడు ఆడిన గత ఆరు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం గమనార్హం. మరోవైపు నెదార్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారాడు. ఇక ఓవరాల్‌గా వన్డే ర్యాంకిగ్స్‌లో 890 పాయింట్లతో బాబర్ ఆగ్రస్థానంలో కొనసాగుతండగా.. రెండు మూడు స్థానాల్లో వరుసగా ప్రోటీస్ ఆటగాళ్లు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (789), క్వింటన్ డి కాక్ (784) నిలిచారు. చదవండి: Asia Cup 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు! -
వన్డేల్లో టాప్ ర్యాంక్‌ను నిలుపుకున్న బాబర్ ఆజం..
ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన నెం1 స్థానాన్ని నిలుపుకున్నాడు. మంగళవారం నెదార్లాండ్స్‌తో జరిగిన వన్డేలో 74 పరుగులు సాధించిన బాబర్.. 891 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాక్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ 800 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. టీ20ల్లోనూ నెం1 ర్యాంక్ బాబర్ ఆజాం టీ20ల్లోనూ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 818 పాయింట్లతో బాబర్ తొలి స్థానంలో ఉండగా.. భారత ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(794), పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(794) రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఇక న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కాన్వే 683 పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 792 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా హేజిల్‌వుడ్ పురోగతి సాధించాడు. ప్రస్తుతం అతడు వన్డేల్లో 679 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐర్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ టీ20ల్లో 8వ ర్యాంక్ సాధించాడు. చదవండి: సూర్యను డివిలియర్స్‌తో పోల్చడమేంటి? జెట్ లాగ్ వల్లేనేమో: పాక్ మాజీ కెప్టెన్ -
ICC ODI Rankings: భారత్‌ను వెనక్కి నెట్టిన పాక్.. !
ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్.. టీమిండియాను వెనుక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది. దీంతో భారత్ జట్టు ఐదో స్థానానికి పరిమితమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ క్వీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా పాక్ ఖాతాలో 4 పాయింట్లు వచ్చి చేరాయి. కాగా పాక్ 106 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా 105 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక 125 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా.. 124 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో.. 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా త్వరలో టీమిండియా ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లలో తలపడనుంది. దీంతో త్వరలోనే పాకిస్తాన్‌ను వెనుక్కి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఆనందం మున్నాళ్ల ముచ్చటే అనే చెప్పుకోవాలి. చదవండి: IND vs SA: 'చాహల్ ఫామ్ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది' -
మిథాలీ రాజ్ ర్యాంక్ యథాతథం..
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన స్థానాల్లో ఎటువంటి మార్పు లేదు. 738 రేటింగ్స్‌తో మిథాలీ మూడో స్థానంలో కొనసాగుతుండగా... 710 రేటింగ్స్‌తో స్మృతి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. వీరిద్దరు మినహా మరో భారత బ్యాటర్ టాప్–10లో చోటు దక్కించుకోలేదు. బౌలింగ్ విభాగంలో టీమిండియా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రెండో స్థానంలో ఉంది. చదవండి: Trent Boult: బస్ డ్రైవర్‌ను హగ్ చేసుకున్న కివీస్ స్టార్ బౌలర్ -
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్ ర్యాంక్‌లో మిథాలీ రాజ్
Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. మిథాలి 762 పాయింట్లతో..దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెల్లీ లీ తో కలిసి ఉమ్మడిగా నెం1 స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లీ అజేయంగా 91 పరగులు సాధించి టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ మూడవ స్థానంలో ఉండగా, భారత ఓపెనర్ స్మృతి మంధాన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్లలో భారత పేసర్ జూలన్ గోస్వామి, సీనియర్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ వరుసగా ఐదవ, తొమ్మిదవ స్థానంలో నిలిచారు. ఆల్ రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఐదవ స్థానంలో కొనసాగుతోంది. . టీ 20 ర్యాంకింగ్స్‌లో భారత యువ సంచలనం షఫాలి వర్మ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. చదవండి: T20 World Cup 2021: ‘ఆ రెండు జట్లే హాట్ ఫేవరేట్.. అయితే టీమిండియా కూడా’ -
కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్ వేరు, నా స్టైల్ వేరు
లాహోర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి, తన బ్యాటింగ్ శైలి వేర్వేరు అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అభిప్రాయడ్డాడు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని, అలాంటి దిగ్గజంతో తనను పోల్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుందని వెల్లడించాడు. అయితే, వ్యక్తిగతంగా తనకు పోలికలంటే ఇష్టముండదని, ముఖ్యంగా కోహ్లీ లాంటి ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడితో పోలిస్తే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌పై మూడు శతకాలు చేయడం తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, అప్పటి నుంచి నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించాడు. ప్రతి మ్యాచ్‌ను ఆఖరి మ్యాచ్‌లా ఆడతానని, ఈ క్రమంలో రికార్డులు వాటంతట అవే తన ఖాతాలో చేరుతున్నాయని ఆయన వెల్లడించాడు. కాగా, పాక్ అభిమానులు, మాజీలు ఇకపై తనను కోహ్లీతో పోల్చడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. కోహ్లీలా తాను కూడా ఉన్నత శిఖరాలకు చేరాలంటే అభిమానులు ఇటువంటి పోలికలను పక్కకు పెట్టాలని సూచించాడు. మైదానంలో నా ప్రతిభ జట్టు విజయాలకు దోహదపడాలని, నా దేశం గర్వించే స్థాయికి నేను ఇంకా ఎదగాల్సి ఉందని ఈ పాక్ యువ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్.. కోహ్లీని అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 25 ఏళ్ల ఈ పాక్ కెప్టెన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. చదవండి: ఫ్రెంచ్ ఓపెన్‌పై కరోనా పంజా.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్‌కు పాజిటివ్ -
భారత్ ర్యాంక్ 3
అగ్రస్థానంలోనే కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ (112) మూడో ర్యాంక్‌కు పడిపోయింది. అయితే బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో ఆస్ట్రేలియా (115) టాప్ ర్యాంక్‌లో ఉండగా... లంక (112) రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 3-2తో గెలుచుకోవడంతో ఒక రేటింగ్ పాయింట్‌ను దక్కించుకున్న మాథ్యూస్ సేన దశాంశమానం తేడాతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో కెప్టెన్ ధోని ఆరో స్థానంలో కొనసాగుతుండగా, శిఖర్ ధావన్ ఎనిమిదో ర్యాంక్‌కు దిగజారాడు. రోహిత్ శర్మ టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు. బౌలర్ల విభాగంలో జడేజా ఐదో ర్యాంక్‌తో టాప్-10లో నిలిచాడు. సేననాయకే (లంక), ట్రేడ్వెల్ (ఇంగ్లండ్)లు తొలిసారి టాప్-20లోకి వచ్చారు. -
రెండో ర్యాంక్‌కు భారత్
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ (117) మళ్లీ రెండో స్థానానికి పడిపోయింది. ఆదివారం తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆస్ట్రేలియా (117) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. దీంతో దశాంశమానం తేడాతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. అయితే భారత్ మళ్లీ నంబర్‌వన్‌కు చేరాలంటే కివీస్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాలి. అప్పుడు 118 పాయింట్లతో అగ్రస్థానం దక్కుతుంది. లేదంటే రెండో ర్యాంక్‌తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా (110), ఇంగ్లండ్ (109), శ్రీలంక (108) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.