ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు దుమ్ము రేపాడు. బంగ్లాదేశ్‌తో వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన కిషన్.. ఏకంగా 117 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 పరుగులు చేశాడు.
ఇక బంగ్లాదేశ్‌పైనే సెంచరీ చేసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ 15వ ర్యాంక్‌కు చేరుకోగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ 22వ స్థానంలో నిలిచాడు. ఇక టాప్ ర్యాంక్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కొనసాగుతున్నాడు.
ఐసీసీ టాప్-10 వన్డే ర్యాంక్స్‌లో ఉన్నది వీరే
1.బాబర్ ఆజం (పాకిస్తాన్)-890 రేటింగ్
2.ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)- 779 రేటింగ్
3.రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)-766 రేటింగ్
4.క్వింటన్ డికాక్ (దక్షిణాప్రికా)-759 రేటింగ్
5.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)-747 రేటింగ్
6.స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 719 రేటింగ్
7.జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్)- 710 రేటింగ్
8.విరాట్ కోహ్లి(భారత్)-707 రేటింగ్
9.రోహిత్ శర్మ(భారత్)-705 రేటింగ్
10.కేన్ విలియమ్సన్-700 రేటింగ్
చదవండి: FIFA WC2022: ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment