Ishan Kishan Net worth 2023: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ పుట్టిన రోజు నేడు(జూలై 18). ఈ జార్ఖండ్ ప్లేయర్ నేటితో 25వ వసంతంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి పాతికేళ్ల ఇషాన్ కెరీర్, కింగ్ కోహ్లికి ఇంత వరకు సాధ్యం కాని విధంగా సాధించిన రెండు రికార్డులు, నెట్‌వర్త్ గురించి తెలుసుకుందామా?!
బిహారీ కుర్రాడు
బిహార్‌లోని పాట్నాలో 1998లో జన్మించాడు ఇషాన్ కిషన్. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతడు అంచెలంచెలుగా ఎదిగి అండర్-19 వరల్డ్‌కప్ ఆడే స్థాయికి ఎదిగాడు.
తొలుత గుజరాత్ లయన్స్‌కు
2016లో ఢాకాలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో ఆరు ఇన్నింగ్స్ ఆడి 73 పరుగులు సాధించాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ తరఫున 799 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచి అందరి దృష్టి ఆకర్షించాడు. తద్వారా ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్.. 2017లో గుజరాత్ లయన్స్‌కు ఆడాడు.
ఈ క్రమంలో మరుసటి ఏడాది ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇషాన్‌ను 6.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇషాన్ కిషన్ దశ తిరిగింది. ఆరంభ సీజన్‌లో కొన్ని గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
గుర్తుండిపోయే ఇన్నింగ్స్
నాడు కేకేఆర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇక ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ అతడికి ఏకంగా రికార్డు స్థాయిలో 15.25 కోట్లు చెల్లించి సేవలు వినియోగించుకుంది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్ల తర్వాత ఇషాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో 2021లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇక అదే వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్.. వెస్టిండీస్-2023 పర్యటనలో భాగంగా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.
కింగ్ కోహ్లికి ఇంతవరకు సాధ్యం కానివి.. ఇషాన్ సాధించిన రికార్డులు
►ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచిన రెండు సందర్భాల్లో(2019, 2020) ఇషాన్ ఆ జట్టులో సభ్యుడు. తద్వారా.. ఆరంభం నుంచి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనత ఇషాన్ సొంతమైంది.
►ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 14 వన్డేలు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఖాతాలో ఏకంగా ఓ ద్విశతకం ఉంది. బంగ్లాదేశ్‌పై చెలరేగి వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 210 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా ఇషాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా కింగ్ కోహ్లికి వన్డేల్లో అత్యధిక స్కోరు: 183.
నెట్‌వర్త్ ఎంతంటే!
చిన్న వయసులోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ఇషాన్ ప్రధాన ఆదాయ వనరు ఆటే! టీమిండియా బ్యాటర్‌గా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్ బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువే.
పలు బ్రాండ్స్‌ను ఎండార్స్ చేస్తున్న ఈ యువ క్రికెటర్ యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 60 కోట్లుగా ఉన్నట్లు అంచనా. 2016- 17లో గుజరాత్ లయన్స్ తరఫున రెండేళ్లు 35 లక్షల చొప్పున, 2018, 19, 20, 21 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ఆడి ఏడాదికి 6.2 కోట్ల రూపాయల చొప్పున, 2022, 23 ఎడిషన్లలో 15.25 కోట్ల మేర ఆర్జించాడు.
విలాసవంతమైన కార్లు
ఇషాన్ కిషన్‌కు గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు దర్శనమిస్తాయి. సుమారు 92 లక్షల విలువ చేసే ఫోర్ట్ ముస్టాంగ్, 1.05 కోట్ల మేర ధర పలికే మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్, 72 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఇషాన్ కార్ల జాబితాలో ఉన్నాయి. ఇక ఇషాన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే బిల్డర్ అన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు.
చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు స్టార్ ఆటగాడు దూరం!
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. డబుల్ సెంచరీతో..!
Comments
Please login to add a commentAdd a comment