ODI record
-
పాతికేళ్లకే ఇషాన్ ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడా! కోహ్లికి కూడా సాధ్యం కానివి..
Ishan Kishan Net worth 2023: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ పుట్టిన రోజు నేడు(జూలై 18). ఈ జార్ఖండ్ ప్లేయర్ నేటితో 25వ వసంతంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి పాతికేళ్ల ఇషాన్ కెరీర్, కింగ్ కోహ్లికి ఇంత వరకు సాధ్యం కాని విధంగా సాధించిన రెండు రికార్డులు, నెట్‌వర్త్ గురించి తెలుసుకుందామా?! బిహారీ కుర్రాడు బిహార్‌లోని పాట్నాలో 1998లో జన్మించాడు ఇషాన్ కిషన్. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతడు అంచెలంచెలుగా ఎదిగి అండర్-19 వరల్డ్‌కప్ ఆడే స్థాయికి ఎదిగాడు. తొలుత గుజరాత్ లయన్స్‌కు 2016లో ఢాకాలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో ఆరు ఇన్నింగ్స్ ఆడి 73 పరుగులు సాధించాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున 799 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచి అందరి దృష్టి ఆకర్షించాడు. తద్వారా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్.. 2017లో గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. ఈ క్రమంలో మరుసటి ఏడాది ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇషాన్‌ను 6.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇషాన్ కిషన్ దశ తిరిగింది. ఆరంభ సీజన్లో కొన్ని గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. గుర్తుండిపోయే ఇన్నింగ్స్ నాడు కేకేఆర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇక ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ అతడికి ఏకంగా రికార్డు స్థాయిలో 15.25 కోట్లు చెల్లించి సేవలు వినియోగించుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్ల తర్వాత ఇషాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో 2021లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇక అదే వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్.. వెస్టిండీస్-2023 పర్యటనలో భాగంగా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. కింగ్ కోహ్లికి ఇంతవరకు సాధ్యం కానివి.. ఇషాన్ సాధించిన రికార్డులు ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచిన రెండు సందర్భాల్లో(2019, 2020) ఇషాన్ ఆ జట్టులో సభ్యుడు. తద్వారా.. ఆరంభం నుంచి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనత ఇషాన్ సొంతమైంది. ►ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 14 వన్డేలు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఖాతాలో ఏకంగా ఓ ద్విశతకం ఉంది. బంగ్లాదేశ్‌పై చెలరేగి వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 210 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా ఇషాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా కింగ్ కోహ్లికి వన్డేల్లో అత్యధిక స్కోరు: 183. నెట్‌వర్త్ ఎంతంటే! చిన్న వయసులోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ఇషాన్ ప్రధాన ఆదాయ వనరు ఆటే! టీమిండియా బ్యాటర్‌గా, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్ బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువే. పలు బ్రాండ్స్‌ను ఎండార్స్ చేస్తున్న ఈ యువ క్రికెటర్ యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 60 కోట్లుగా ఉన్నట్లు అంచనా. 2016- 17లో గుజరాత్ లయన్స్ తరఫున రెండేళ్లు 35 లక్షల చొప్పున, 2018, 19, 20, 21 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ఆడి ఏడాదికి 6.2 కోట్ల రూపాయల చొప్పున, 2022, 23 ఎడిషన్లలో 15.25 కోట్ల మేర ఆర్జించాడు. విలాసవంతమైన కార్లు ఇషాన్ కిషన్‌కు గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు దర్శనమిస్తాయి. సుమారు 92 లక్షల విలువ చేసే ఫోర్ట్ ముస్టాంగ్, 1.05 కోట్ల మేర ధర పలికే మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్, 72 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఇషాన్ కార్ల జాబితాలో ఉన్నాయి. ఇక ఇషాన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే బిల్డర్ అన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు స్టార్ ఆటగాడు దూరం! చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. డబుల్ సెంచరీతో..! -
కంగ్రాట్స్ హర్మన్.. ఆ నలుగురి తరువాత నువ్వే
లక్నో: టీమిండియా బ్యాట్స్‌వుమన్ హర్మన్ ప్రీత్ కౌర్ లక్నో వేదికగా దక్షిణాఫ్రికతో జరిగిన తొలి వన్డే ద్వారా అరుదైన ఘనతను సాధించింది. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. భారత్ తరఫున 100కు పైగా వన్డేలు ఆడిన క్రీడాకారిణుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిథాలి రాజ్ (210), జులాన్ గోస్వామి (183), అంజుమ్ చోప్రా (127), అమితా శర్మ (116)లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో భారత వన్డే వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేరింది. ఆమె సాధించిన ఈ ఘనతకు గాను అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్రాట్స్ హర్మన్.. వెల్కమ్ టు ద క్లబ్ అంటూ సహచర క్రికెటర్లు ట్వీట్లతో అభినందించారు. హర్మన్ 100 మ్యాచ్‌ల్లో 3 శతకాలు 11 అర్ధ శతకాల సాయంతో 2,412 పరుగులు చేసింది. అజేయమైన 171 పరుగులు ఆమె అత్యధిక స్కోరుగా ఉంది. టీ20 కెప్టెన్ కూడా అయిన ఆమె..114 మ్యాచ్‌ల్లో ఒక శతకం, ఆరు అర్థ శతకాల సాయంతో 2186 పరుగులు సాధించింది. దూకుడుగా ఆడే క్రికెటర్‌గా పేరున్న హర్మన్‌కు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం పెద్దగా లభించింది. ఆమె కేవలం 2 మ్యాచ్‌ల్లో 26 పరుగులు మాత్రమే సాధించింది. పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రాణించే ఆమె..టెస్ట్‌ల్లో 9, వన్డేల్లో 23, టీ20ల్లో 29 వికెట్లు సాధించింది. -
'కోహ్లి వేగం మధ్యలోనే ఆగిపోతుందనుకున్నా'
ముంబై : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. టెస్ట్ స్పెషలిస్ట్ వివిఎస్ లక్ష్మణ్ కోహ్లి సాధించిన రికార్డుపై శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 'నాకు తెలిసినంతవరకు ఒక ఆటగాడు ఇన్నేళ్ల కెరీర్లో ఒకే ఇంటన్సిటీతో పరుగులు సాధించడమనేది ఇప్పుడే చూస్తున్నా. అది విరాట్ కోహ్లి కావడం ఇక్కడ గర్వించదగ్గాల్సిన విషయం. కోహ్లి కెరీర్ మొదట్లో తాను ఆడిన తీరు గమనిస్తే.. వేగంగా పరుగులు చేయడానికే బరిలోకి దిగినట్లు కనిపించేవాడు. కెరీర్ ఆరంభం కాబట్టి అలా ఉండడం సహజం... కెరీర్ సాగుతున్న అతని వేగం ఆగిపోతుందని భావించా... కానీ అలా జరగలేదు. ఇన్నేళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా అతని ఎనర్జీ లెవెల్స్‌లో డ్రాప్ కనిపించకపోవడం విశేషం.(చదవండి : పాపం కోహ్లి.. మూడు సార్లు అతని బౌలింగ్‌లోనే) అది బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఏదైనా సరే పాదరసంలా కదులుతుంటాడు. కోహ్లి చేసిన 42 సెంచరీల్లో 26 సెంచరీలు చేజింగ్‌లో రావడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. సాధారణంగా చేజింగ్‌లో పెద్ద స్కోరు ఉంటే బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనవుతుంటాడు. కోహ్లి విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఎంత ఎక్కువ ఒత్తిడి ఉంటే అంత బాగా ఆడడం కోహ్లికున్న ప్రత్యేకం అని చెప్పొచ్చు. 'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు 12వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. సచిన్ 12వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 309 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. కోహ్లి మాత్రం 242 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. కాగా ఓవరాల్‌గా కోహ్లి కెరీర్లో 251 మ్యాచ్‌ల్లో 12040, 86 టెస్టుల్లో 7240, 82 టీ20ల్లో 2794 పరుగులు సాధించాడు. -
చరిత్ర సృష్టించనున్న విలియమ్సన్
మాంచెస్టర్: న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించడానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్‌లో జరిగే తుది సమరంలో అతడీ ఘనత సాధించే అవకాశముంది. మంచి ఫామ్‌లో ఉన్న విలియమ్సన్ తమ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. తుదిపోరులోనూ రాణించి కివీస్ ప్రపంచ విజేతగా నిలపాలని న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించేందుకు విలియమ్సన్ ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. మరొక్క పరుగు సాధిస్తే ఈ ఘనత అతడి సొంతమవుతుంది. ఈ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్ ఆడి అతడు 2 సెంచరీలు, 2 అర్ధ శతకాలతో 548 పరుగులు చేసి మహేల జయవర్ధనేతో రికార్డును సమం చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో అప్పటి శ్రీలంక కెప్టెన్ జయవర్ధనే 11 మ్యాచ్‌లు ఆడి శతకం, నాలుగు హాఫ్ సెంచరీలతో 548 పరుగులు చేశాడు. ఇదే సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 9 ఇన్నింగ్స్‌లో 539 పరుగులు సాధించాడు. విలియమ్సన్ ఇంకొక్క పరుగు సాధిస్తే ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా కొత్త రికార్డు సృష్టిస్తాడు. ఒక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విలియమ్సన్ ఇప్పటికే రికార్డుకెక్కాడు. తాజా వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేసి టాప్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఐదు సెంచరీలతో రోహిత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. -
మోర్గాన్.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా
లండన్: ప్రపంచకప్ 2019లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇంగ్లండ్ తరుపున అత్యధిక వన్డేలు(200)లు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ సారథి పాల్ కాలింగ్‌వుడ్(197) రికార్డును అదిగమించాడు. అతర్వాతి స్థానంలో జేమ్స్ అండర్సన్(194), స్టివార్ట్(170), ఇయాన్ బెల్(161)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఇదే మ్యాచ్‌లో ఏడు వేల పరుగుల మైలురాయిని కూడా మోర్గాన్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 223వ అంతర్జాతీయ వన్డేలు ఆడిన మోర్గాన్.. అందులో 23 వన్డేలు ఐర్లాండ్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. 2006లో ఐర్లాండ్ తరుపున స్కాట్లాండ్పై అరంగేట్రం చేసిన మోర్గాన్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అనంతరం 2009లో ఇంగ్లండ్ జట్టుకు మారాడు. 2009లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ తరుపున మరోసారి అరంగేట్రం చేశాడు. ఇక ఆటగాడిగానే కాకుండా సారథిగా కూడా మోర్గాన్ రికార్డులు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మోర్గాన్‌కు సారథిగా 101వది కావడం విశేషం. ఇప్పటివరకు మోర్గాన్ సారథ్యంలో 100 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ 61 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. -
కోహ్లి మరో రికార్డుపై కన్నేసిన ఆమ్లా
లండన్ : ప్రపంచకప్ అంటేనే క్రికెట్ అభిమానులకు పండగ. 46 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండగ ఇంగ్లండ్ వేదికగా నేడు ప్రారంభమైంది. ప్రపంచకప్ 2019లో భాగంగా నేడు ఆతిథ్య ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడుతోంది. అయితే ప్రపంచకప్ ఆరంభపు మ్యాచ్‌లోనే ప్రొటీస్ సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లా విరాట్ కోహ్లి రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. అంతకుముందు విరాట్ ఈ ఘనతను 175 ఇన్నింగ్స్‌లో సాధించాడు. ఇప్పటివరకు ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు పూర్తి చేశాడు. మంచి హిట్టింగ్తో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆమ్లా.. వన్డేల్లో 2000, 3000, 5000, 6000, 7000 పరుగులు సాధించిన ఆటగాడిగా ఆమ్లా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డు అందుకుంటే దక్షిణాఫ్రికా తరుపున ఎనిమిది వేల పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా ఆమ్లా చేరతాడు. ఈ జాబితాలో జాక్వస్ కలిస్(11,550), డివిలియర్స్(9427), గిబ్స్(8094)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఫామ్‌లో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమ్లా ఈ మ్యాచ్‌లో రాణించాలని కసిగా ఉన్నాడు. ఇక ప్రొటీస్ జట్టుకూడా ఆమ్లాతో సహా టాపార్డర్ రాణిస్తే తమకు ఎదురుండదని భావిస్తోంది. చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం ఇమ్రాన్ తాహీర్ నయా రికార్డ్.. -
ఇండియా రికార్డు బద్దలు
నాటింగ్‌హామ్: గతంలో వన్డేల్లో 300 పరుగులను చేధించడమంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం 300 లక్ష్యం అనేది చాలా చిన్న విషయంలా మారిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో వన్డేలో పాకిస్తాన్ నిర్ధేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా సాధించింది. మూడు రోజుల వ్యవధిలో 340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు చేధించిన జట్టుగా ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో వన్డేల్లో 340 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధికంగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. గతంలో భారత్ మూడుసార్లు ఈ ఘనత సాధించగా అది కాస్త ఇప్పుడు కనుమరుగైంది. -
కోహ్లిని ఊరిస్తోన్న మరో రికార్డు
ఆక్లాండ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మరో రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్‌తో ఈ నెల 23 నుంచి జరగనున్న ఐదు వన్డే సిరీస్‌లో అతడు సెంచరీ సాధిస్తే మరో ఘనత అతడి సొంతమవుతుంది. వన్డేల్లో కివీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెట్ కెప్టెన్‌గా ఈ ‘ఛేజింగ్ స్టార్’ నిలిచిపోతాడు. జట్టులో ఆటగాడిగా న్యూజిలాండ్‌లో కోహ్లి గతంలో శతకం బాదాడు. అతడి ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే కెప్టెన్‌గా కూడా సెంచరీ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో న్యూజిలాండ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని కొనసాగుతున్నాడు. 2015లో ఆక్లాండ్‌లో జరిగిన వన్డేలో ధోని 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఇప్పుడు అతడు ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌లో ధోని తన వ్యక్తిగత స్కోరును మెరుగుపరుచుకుంటాడో, లేదో చూడాలి. -
ఓవర్లో ఆరు సార్లయినా డైవ్ చేస్తా!
వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని దాటడం సంతోషంగా ఉందని, అయితే ఇప్పటికీ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమిస్తానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. పదేళ్లు దాటినా పరుగులు సాధించడంలో ఉదాసీనత ఉండరాదని అతను అన్నాడు. బుధవారం వైజాగ్ వన్డేలో పది వేల పరుగులు పూర్తి చేసుకొని సచిన్ టెండూల్కర్ కంటే వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అనంతరం తన మనోభావాలను బీసీసీఐ వెబ్‌సైట్‌తో పంచుకున్నాడు. కోహ్లి స్పందన అతని మాటల్లోనే... ‘పది వేల పరుగులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. నేను ఎంతో అదృష్టవంతుడినని చెప్పగలను. నా వన్డే కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. సాధారణంగా అయితే నా దృష్టిలో ఇలాంటి వ్యక్తిగత మైలురాళ్లకు చోటు లేదు. అయితే పదేళ్లుగా ఆడుతూ ఇక్కడి దాకా చేరుకున్నామనే విషయం మనకు తెలుస్తుంది. అందుకే ఇది అంత ప్రత్యేకమని చెప్పగలను. నేను ఈ ఆటను అమితంగా ప్రేమించడమే నా ఆనందానికి మరో కారణం. అలాంటి క్రికెట్‌ను ఇంకా ఇంకా ఆడాలని భావిస్తున్నా కాబట్టి ఇదో విశేషంగా భావిస్తున్నా. ఇంత సుదీర్ఘంగా ఆడగలగడం సంతృప్తిగా ఉంది. మరిన్ని సంవత్సరాలు దీనికి జత కావాలి. ఇంతటి ఘనతను సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. భారత్ తరఫున ఆడితే చాలనుకున్నాను. ఇంతటి చిరస్మరణీయ రోజు వస్తుందనే ఆలోచన కూడా నాకు రాలేదు. మనం ఏం చేసినా దానిపైనే శ్రద్ధ పెట్టి సరైన దారిలో శ్రమించాలని మాత్రం తెలుసు. ఇలాంటి రికార్డులు కొంత కాలం తర్వాత చూస్తే ప్రాధాన్యత లేనివిగా కనిపిస్తాయి. పరుగులు చేయడమే నాకు తెలిసిన విద్య. సుదీర్ఘ కాలంగా దానిని పూర్తి చేసే క్రమంలోనే ఇలాంటి ఘనత దక్కింది. ప్రతీ మ్యాచ్‌లో జట్టు కోసం, జట్టు అవసరాలకు అనుగుణంగా భారీ స్కోరు కోసం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే నాకు తెలుసు.భవిష్యత్తుల్లో కూడా ప్రతీ మ్యాచ్, ప్రతీ పరిస్థితుల్లో అలాంటి పరుగులు చేయాలనుకుంటున్నా. శారీర కంగా, మానసికంగా కూడా నా శక్తియుక్తులు జట్టు కోసం పరుగులు సాధించేందుకు వెచ్చించాను. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటూ బ్యాట్‌తో నా పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. నా ఒక్కడి గురించి ఆలోచించి ఉంటే ఇలాంటి రికార్డులు రాకపోయేవేమో. బయటి నుంచి చూసేవారికి ఇదంతా మామూలుగానే కనిపించవచ్చు. కానీ కఠిన పరిస్థితులు ఎదురైన సమయంలో జట్టు కోసం తీవ్రంగా శ్రమించడం, మరో 10–12 ఓవర్లు అదనంగా ఆడితే వచ్చే పరుగులతో భారీ స్కోరుకు సహకరించడం ఎంతో ముఖ్యం. దేశం తరఫున ఆడే అవకాశం రావడం గొప్ప గౌరవం. అయితే పదేళ్ల తర్వాత కూడా దానిని నాకు లభించిన ప్రత్యేక హక్కుగా భావించడం లేదు. ఇప్పటికీ ప్రతీ పరుగు కోసం నేను కూడా తీవ్రంగా శ్రమించాల్సిందే. ఎందుకంటే భారత జట్టులో ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. మనకు ఆ అవకాశం ఉన్నప్పుడు పరుగులు చేసే విషయంలో అదే ఆకలి, తపన ఉండాలి. ఏ విషయంలోనూ ఉదాసీనత కనబర్చకుండా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాలి. పరుగు పూర్తి చేసే క్రమంలో ఒకే ఓవర్లో ఆరు సార్లు డైవ్ చేయాల్సి వచ్చినా నేను వెనుకాడను. ఎందుకంటే నేను దేశం తరఫున ఆడేందుకు ఎంపికయ్యాను. అది నా బాధ్యతతో పాటు ఉద్యోగ ధర్మం కూడా. ఇలా నేను ఎవరికి మేలు చేయడం కోసమో ఆడటం లేదు. పైగా ఎవరి కోసమో నేను నిరూపించాల్సిన పని లేదు.నా శ్రమంతా ఆ అదనపు పరుగు కోసమే. నేను శారీరకంగా లేదంటే మానసికంగా అలసిపోయానని చెప్పి ఆ పరుగు తీయకుండా ఉండలేను. జట్టుకు ఉపయోగపడేందుకు ఏం చేయాల్సి వచ్చినా ఎప్పుడైనా చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను’ -
ప్రపంచ రికార్డు సృష్టించిన కివీస్ మహిళలు
-
న్యూజిలాండ్ 490
వన్డేల్లో జట్టు స్కోరు 500 పరుగులు... ఒకప్పుడు ఊహకు కూడా అందని విషయమిది. దీనిని న్యూజిలాండ్ మహిళల జట్టు దాదాపుగా చేసి చూపించింది. 500 పరుగుల మైలురాయిని చేరలేకపోయినా అతి చేరువగా వచ్చి కొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది. కివీ బ్యాట్స్‌మన్ జోరుకు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 490 పరుగులు నమోదయ్యాయి. వన్డే క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు కాగా... పురుషుల వన్డేల్లో అత్యధిక స్కోరు 444 (ఇంగ్లండ్) పరుగులు మాత్రమే కావడం విశేషం. అనంతరం ఐర్లాండ్ 144 పరుగులు మాత్రమే చేసి 346 పరుగులతో చిత్తుగా ఓడింది. డబ్లిన్: మహిళల వన్డే క్రికెట్లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐర్లాండ్‌తో శుక్రవారం ఇక్కడి వైఎంసీఏ గ్రౌండ్లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు చేసింది. ఫలితంగా గతంలో తమ పేరిటే ఉన్న 455/5 పరుగుల (1997లో పాకిస్తాన్‌పై) అత్యధిక స్కోరు రికార్డును కివీస్ బద్దలు కొట్టింది. కివీస్ వీర విధ్వంసంలో ఇద్దరు సెంచరీలతో సత్తా చాటగా, మరో ఇద్దరు అర్ధ సెంచరీలు సాధించారు. టాప్ ప్లేయర్, కెప్టెన్ సుజీ బేట్స్ (94 బంతుల్లో 151; 24 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాడీ గ్రీన్ (77 బంతుల్లో 121; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలు బాదారు. అమేలియా కేర్ (45 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్ వాట్కిన్ (59 బంతుల్లో 62; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 64 ఫోర్లు, 7 సిక్సర్లు నమోదు కాగా... ఐర్లాండ్ ఎక్స్‌ట్రాల రూపంలో 33 పరుగులు సమర్పించుకుంది. ఆ తర్వాత ఐర్లాండ్ 35.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బేట్స్, వాట్కిన్ జట్టు ఇన్నింగ్స్‌ను సాధారణంగానే ప్రారంభించినా... ఆ తర్వాత దూకుడు పెంచారు. 40 పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన బేట్స్ ఆ తర్వాత చెలరేగి 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. 172 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత వాట్కిన్ అవుటైనా, ఆ తర్వాత వచ్చిన గ్రీన్ కూడా ఎక్కడా తగ్గలేదు. కారా ముర్రే ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన అనంతరం ఎట్టకేలకు అదే ఓవర్లో బేట్స్ వెనుదిరిగింది. అనంతరం 62 బంతుల్లోనే గ్రీన్ శతకం పూర్తయింది. 48 ఓవర్లో కెర్ 2 భారీ సిక్సర్లు బాదడంతో స్కోరు 467 పరుగులకు చేరింది. చివరి 2 ఓవర్లలో 33 పరుగులు చేస్తే కివీస్ స్కోరు 500 పరుగులు చేరుతుందని భావించినా... 49వ ఓవర్లో 4, ఆఖరి ఓవర్లో 4 ఫోర్లు సహా 19 పరుగులు మాత్రమే వచ్చాయి. న్యూజిలాండ్ ధాటికి ఐర్లాండ్ బౌలర్లు కారా ముర్రే (119), గ్యాబీ లూయీస్ (92), లారా మారిట్జ్ (92), లౌజీ లిటిల్ (92), అమీ కెనలీ (81) భారీగా పరుగులు ఇచ్చారు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో తర్వాతి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. మహిళల వన్డేల్లో రెండు సార్లు న్యూజిలాండ్ 400 పరుగులు దాటగా, ఆస్ట్రేలియా మాత్రమే ఒక సారి (412/3) ఈ ఘనత సాధించింది. -
కివీస్ కెప్టెన్ అరుదైన ఘనత
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో 5000 పరుగులు పూర్తిచేసుకున్న కివీస్ కెప్టెన్. ఈ ఫార్మాట్లో అతివేగంగా ఈ ఫీట్ సాధించిన ఐదో క్రికెటర్ గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భాగంగా ఐదువేల పరుగులు పూర్తి చేసిన విలియమ్సన్.. న్యూజిలాండ్ తరపున అతివేగంగా ఈ రికార్డు అందుకున్న తొలి క్రికెటర్ అయ్యాడు. వెల్లింగ్టన్లో శనివారం జరుగుతున్న వన్డేలో కివీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ వేయగా.. ఓవర్ చివరి బంతిని క్లాస్ ఆటగాడు విలియమ్సన్ బౌండరీకి తరలించి ఐదువేల పరుగులు పూర్తిచేశాడు. వెస్టిండీస్ క్రికెటర్ గ్రీనిడ్జ్ (121 ఇన్నింగ్స్‌లు)ను అధిగమిస్తూ విలియమ్సన్ ఈ ఫీట్ అత్యంత వేగంగా చేరుకున్న ఐదో క్రికెటర్ అయ్యాడు. ఫాస్టెస్ట్ 5000 క్లబ్ - టాప్ 5 క్రికెటర్స్ వీరే.. క్రికెటర్ - ఇన్నింగ్స్‌లు హషీం ఆమ్లా - 101 (104 మ్యాచ్‌లు) రిచర్డ్స్ - 114 (126 మ్యాచ్‌లు) విరాట్ కోహ్లి - 114 (120 మ్యాచ్‌లు) బ్రియాన్ లారా - 118 (120 మ్యాచ్‌లు) విలియమ్సన్ - 119 (125 మ్యాచ్‌లు) గ్రీనిడ్జ్ - 121 (122 మ్యాచ్‌లు) -
బంగ్లాదేశ్ క్రికెటర్ ఘనత
ఢాకా: బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన బంగ్లాదేశ్ తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఏడాది తర్వాత 2008లో తొలి సెంచరీ సాధించాడు. 11 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తమీమ్ ఇప్పటివరకు 177 మ్యాచ్‌లు ఆడి 35.65 సగటుతో 6010 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 154. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 5235 పరుగులతో తమీమ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అక్కడ అతడే టాప్ వన్డేల్లో ఒక వేదికపై అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా తమీమ్ పేరిట ఉంది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో అత్యధిక పరుగులు సాధించాడు. సనత్ జయసూర్య(2514) పేరిట ఉన్న రికార్డును అతడు సవరించాడు. -
వేగంగా విరాట్ 6 వేల పరుగులు!
హైదరాబాద్: భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి వన్డేలో అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. రాజీవ్ గాంధీ స్టేడియంలో శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో 53 పరుగులు చేయడంతో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ రికార్డును అధిమించారు. 144వ మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ల్లో విరాట్ ఈ ఘనతను సాధించారు. వివ్ రిచర్డ్స్ 156 మ్యాచులాడి 141 ఇన్నింగ్స్ లో 6 వేల పరుగుల మార్కును చేరుకున్నారు. 6 వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న భారతీయ క్రికెటర్లలో విరాట్ ఎనిమిదో వ్యక్తిగా కాగా, ప్రపంచవ్యాప్తంగా 47వ క్రికెటర్ గా చరిత్రల్లోకెక్కాడు. Follow @sakshinews