మహిళల వన్డే క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐర్లాండ్‌తో శుక్రవారం ఇక్కడి వైఎంసీఏ గ్రౌండ్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు చేసింది. ఫలితంగా గతంలో తమ పేరిటే ఉన్న 455/5 పరుగుల (1997లో పాకిస్తాన్‌పై) అత్యధిక స్కోరు రికార్డును కివీస్ బద్దలు కొట్టింది. కివీస్ వీర విధ్వంసంలో ఇద్దరు సెంచరీలతో సత్తా చాటగా, మరో ఇద్దరు అర్ధ సెంచరీలు సాధించారు. టాప్ ప్లేయర్, కెప్టెన్ సుజీ బేట్స్ (94 బంతుల్లో 151; 24 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాడీ గ్రీన్ (77 బంతుల్లో 121; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలు బాదారు. అమేలియా కేర్ (45 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్ వాట్కిన్ (59 బంతుల్లో 62; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 64 ఫోర్లు, 7 సిక్సర్లు నమోదు కాగా... ఐర్లాండ్ ఎక్స్‌ట్రాల రూపంలో 33 పరుగులు సమర్పించుకుంది. ఆ తర్వాత ఐర్లాండ్ 35.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది.
ప్రపంచ రికార్డు సృష్టించిన కివీస్ మహిళలు
Published Sat, Jun 9 2018 10:37 AM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM
Advertisement
Advertisement
Advertisement