లక్నో: టీమిండియా బ్యాట్స్‌వుమన్ హర్మన్ ప్రీత్ కౌర్ లక్నో వేదికగా దక్షిణాఫ్రికతో జరిగిన తొలి వన్డే ద్వారా అరుదైన ఘనతను సాధించింది. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. భారత్ తరఫున 100కు పైగా వన్డేలు ఆడిన క్రీడాకారిణుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిథాలి రాజ్ (210), జులాన్ గోస్వామి (183), అంజుమ్ చోప్రా (127), అమితా శర్మ (116)లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో భారత వన్డే వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేరింది. ఆమె సాధించిన ఈ ఘనతకు గాను అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్రాట్స్ హర్మన్.. వెల్‌కమ్ టు ద క్లబ్ అంటూ సహచర క్రికెటర్లు ట్వీట్లతో అభినందించారు.
హర్మన్ 100 మ్యాచ్‌ల్లో 3 శతకాలు 11 అర్ధ శతకాల సాయంతో 2,412 పరుగులు చేసింది. అజేయమైన 171 పరుగులు ఆమె అత్యధిక స్కోరుగా ఉంది. టీ20 కెప్టెన్ కూడా అయిన ఆమె..114 మ్యాచ్‌ల్లో ఒక శతకం, ఆరు అర్థ శతకాల సాయంతో 2186 పరుగులు సాధించింది. దూకుడుగా ఆడే క్రికెటర్‌గా పేరున్న హర్మన్‌కు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం పెద్దగా లభించింది. ఆమె కేవలం 2 మ్యాచ్‌ల్లో 26 పరుగులు మాత్రమే సాధించింది. పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రాణించే ఆమె..టెస్ట్‌ల్లో 9, వన్డేల్లో 23, టీ20ల్లో 29 వికెట్లు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment