వేగంగా విరాట్ 6 వేల పరుగులు!
వేగంగా విరాట్ 6 వేల పరుగులు!
Published Mon, Nov 10 2014 10:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
హైదరాబాద్: భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి వన్డేలో అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. రాజీవ్ గాంధీ స్టేడియంలో శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో 53 పరుగులు చేయడంతో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ రికార్డును అధిమించారు.
144వ మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ల్లో విరాట్ ఈ ఘనతను సాధించారు. వివ్ రిచర్డ్స్ 156 మ్యాచులాడి 141 ఇన్నింగ్స్ లో 6 వేల పరుగుల మార్కును చేరుకున్నారు. 6 వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న భారతీయ క్రికెటర్లలో విరాట్ ఎనిమిదో వ్యక్తిగా కాగా, ప్రపంచవ్యాప్తంగా 47వ క్రికెటర్ గా చరిత్రల్లోకెక్కాడు.
Follow @sakshinewsAdvertisement
Advertisement