నవీన్‌ను సముదాయిస్తూ కోహ్లితో మాట్లాడుతున్న కేఎల్ రాహుల్ (PC: IPL/BCCI)
IPL 2023- LSG Vs RCB: ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ మధ్య వివాదం గురించి నెట్టింట్లో రచ్చ కొనసాగుతూనే ఉంది. గత మ్యాచ్‌లో గంభీర్ చర్యకు కోహ్లి బదులిచ్చాడని కింగ్ అభిమానులు అంటుండగా.. సీనియర్ అన్న గౌరవం లేదా అంటూ గౌతీ ఫ్యాన్స్ కోహ్లిపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ గొడవలో ‘‘తప్పెవరిది’’ అన్న విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చోపర్చలు జరుగుతున్నాయి.
గంభీర్ ఫ్యాన్స్‌కు చురక!?
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్‌స్టా పోస్ట్‌తో మరోసారి గంభీర్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన కోహ్లి.. బుధవారం మరో ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పాత ఇంటర్వ్యూ తాలూకు దృశ్యాలు పంచుకున్నాడు. ఇందుకు.. ‘‘ది రియల్ బాస్’’ అంటూ కోహ్లి క్యాప్షన్ జత చేయడంతో మరోసారి గంభీర్ అభిమానులకు చురక తగిలినట్లయింది.
ఈ వీడియోలో క్రికెట్ డిస్ట్రిక్ట్‌తో రిచర్డ్స్ ముచ్చటిస్తూ.. పొట్టి ఫార్మాట్‌లో వివిధ లీగ్‌లలో ఆడటాన్ని తాను ఇష్టపడతానని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ ఆడీ ఆడీ బోర్ కొట్టిందని.. ఇప్పుడు ఐపీఎల్ లేదంటే సీపీఎల్ వంటి లీగ్‌లలో ఆడాలని ఉందని చెప్పుకొచ్చాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం (మే 1) నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ కోహ్లి- లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.
గంభీర్ అలా.. కోహ్లి ఇలా!
అంతకు ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై తమ విజయానంతరం గంభీర్..ఆర్సీబీ ఫ్యాన్స్‌ను నోరు మూసుకోవాలి అన్నట్లు సైగతో ట్రోల్ చేశాడు. అయితే, ఈ విషయాన్ని తేలికగా వదిలిపెట్టని కోహ్లి.. లక్నోలో తమ విజయం నేపథ్యంలో ఆద్యంతం గంభీర్, లక్నో జట్టును కవ్వించేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
నవీన్ ఉల్ హక్ కారణంగా
ఇక ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫ్రీ హిట్ నేపథ్యంలో లక్నో టెయిలెండర్ నవీన్ ఉల్ హక్‌తో అతడికి తలెత్తిన గొడవలో కోహ్లి జోక్యంతో వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో కోహ్లిని ఆపడానికి మరో ఎండ్‌లో ఉన్న అమిత్ మిశ్రా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మ్యాచ్ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో నవీన్ కోహ్లితో అనుచితంగా ప్రవర్తించడం.. గంభీర్ సహా మేయర్స్ జోక్యం చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం నవీన్‌కు సర్దిచెప్తూ సున్నితంగానే కోహ్లిని వారించే ప్రయత్నం చేశాడు.
వాళ్లిద్దరే
ఈ గొడవ నేపథ్యంలో కోహ్లి, గంభీర్ మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెంటిల్మన్ గేమ్‌కు మాయని మచ్చ తెచ్చారంటూ పలువురు భారత మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా రిచర్డ్స్‌పై ఎల్లప్పుడూ అభిమానం చాటుకునే కోహ్లి.. గతంలో ఓసారి.. ‘‘ సచిన్ టెండుల్కర్, వివియన్ రిచర్డ్స్ మాత్రమే GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్)’’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment