
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో కోహ్లి అభిమానులు.. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను ఆటపట్టించే ప్రయత్నం చేశారు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సమయంలో (38వ ఓవర్) గంభీర్ మైదానంలో నుంచి కామెంట్రీ బాక్స్ వైపు వెళ్తుండగా కొందరు అభిమానులు కోహ్లి, కోహ్లి అంటూ కేకలు వేశారు. దీంతో చిర్రెత్తిపోయిన గంభీర్.. కోహ్లి ఫ్యాన్స్‌కు మధ్య వేలును చూపించి, వారి తిక్క కుదిర్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
Gautam Gambhir showing middle finger to people who were chanting kohli kohli 😭pic.twitter.com/EymNOqTjY7
— K ♡ (@sarphiribalika_) September 4, 2023
ఇదిలా ఉంటే, వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న భారత్-నేపాల్ మ్యాచ్‌లో నేపాల్ 230 పరుగులకు ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ షేక్ (58), సోంపాల్ కామీ (48), కుషాల్ భుర్టెల్ (38), దీపేంద్ర సింగ్ (29), గుల్షన్ ఝా (23) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment