ఆసీస్‌తో నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు.
రాహుల్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చగా.. కోహ్లి లక్ష్యానికి 33 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేయడం ఖాయమని అతనితో సహా అంతా అనుకున్నారు. అయితే ఓ అనవసరమైన షాట్ ఆడి అతను పారేసుకున్నాడు. ఇలాంటి షాట్ ఆడినందుకు కోహ్లి చాలా బాధపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాక తానాడిన షాట్‌ను గుర్తు చేసుకుంటూ రెండుసార్లు తల బాదుకున్నాడు. కెమెరాలు తనపై ఫోకస్ చేస్తున్న విషయాన్ని గమనించి కాస్త తగ్గాడు.
Kohli was frustrated ! 🥺 pic.twitter.com/Q4lCWZkO6y
— V I P E R™ (@VIPERoffl) October 8, 2023
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసిన అభిమానులు ప్రతి ఆటగాడిలో ఇలాంటి కసి ఉండాలని అంటున్నారు. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాన్న బాధతో కోహ్లి కుమిలిపోయాడని, అతని ప్రవర్తనలో అది స్పష్టంగా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి ప్రతి మ్యాచ్‌లో జట్టు కోసం నూటికి రెండు వందల శాతం ఇవ్వాలని ప్రయత్నిస్తాడని, ఇతరులు సాధించిన విజయాలను సైతం అతను సొంత విజయాల మాదిరి ఆస్వాధించడం మనం అనునిత్యం చూస్తూనే ఉంటామని అంటున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్ యాదవ్ (10-0-42-2), అశ్విన్ (10-1-34-1), సిరాజ్ (6.3-1-26-1), హార్దిక్ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ కాగా.. కోహ్లి, రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 3, స్టార్క్ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్, ఇషాన్‌లతో పాటు శ్రేయస్ అయ్యర్ డకౌట్లయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment