Vivian Richards
-
టీమిండియా ఆఖరి వరకు అజేయంగా నిలవడం ఖాయం! కానీ..
ICC WC 2023- Team India: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అన్నాడు. ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూ టైటిల్ కైవసం చేసుకుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ ప్రయాణంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు దరిచేరనీయొద్దని రోహిత్ సేనకు విజ్ఞప్తి చేశాడు. అలా అయితే మొదటికే మోసం వస్తుందని విండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ రిచర్డ్స్ హెచ్చరించాడు. కాగా ప్రపంచకప్-2023లో లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలోనూ టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో ఇప్పటికే టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో మిగిలిన ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భారీ విజయంతో అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. నెదర్లాండ్స్ వంటి పసికూనతో మ్యాచ్‌లో భారత జట్టుకు ఇదేమీ అంతకష్టమని పనికాదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అంటేనే ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్ధమైంది. శ్రీలంకపై ఘన విజయంతో అనధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న కివీస్.. రోహిత్ సేనతో తలపడటం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే, 2015, 2019 టోర్నీల్లో టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి ఏం జరుగుతుందోననే ఆందోళన అభిమానులను వెంటాడుతోంది. ఈ క్రమంలో వివియన్ రిచర్డ్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలా అయితేనే ఆఖరి వరకు అజేయంగా ఐసీసీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా చివరి దాకా అజేయంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అయితే, కొన్నిసార్లు.. ‘మేము ఇక్కడిదాకా బాగానే ఆడాం.. కానీ సెమీ ఫైనల్లో ఏం జరుగుతుందో’ అనే భయాలు ఉండటం సహజం. కానీ ఇలాంటి ప్రతికూల అంశాల గురించి ఎంత పక్కనపెడితే అంత మంచిది. ఇప్పటిదాకా ఆత్మవిశ్వాసంతో ఎలా ఆడారో ఇక ముందు కూడా అలాగే ఆడాలి. వాళ్ల మైండ్‌సెట్‌లో ఎలాంటి మార్పూ రాకూడదు’’ అని వివియన్ రిచర్డ్స్ పేర్కొన్నాడు. నెగటివ్‌గా అనిపించే ప్రతి విషయాన్ని భారత ఆటగాళ్లు పక్కనపెట్టాలని ఈ సందర్భంగా సూచించాడు. చదవండి: కానిస్టేబుల్ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా..
England vs New Zealand Ben Stokes Record: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగి పలు అరుదైన ఘనతలు సాధించాడు. కాగా వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్లో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టోక్స్ రీఎంట్రీలో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో తొలి వన్డేతో పునరాగమనం చేసిన స్టోక్స్ 52 పరుగులతో రాణించాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు తీసి అవుటయ్యాడు. ఈ క్రమంలో.. మూడో వన్డేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సంచలన ఇన్నింగ్స్‌తో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో నాలుగో సెంచరీ చేసిన స్టోక్సీ.. ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఆ రికార్డులు బద్దలు.. ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా ఈ క్రమంలో జేసన్ రాయ్ (180; 2018లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న ఈ రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు. అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానంలో వచ్చి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ తర్వాత ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో రాస్ టేలర్, ఏబీ డివిలియర్స్, టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్లను అధిగమించాడు. వన్డేల్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు వీరే! ►వివియన్ రిచర్డ్స్- 189 ►బెన్ స్టోక్స్- 182 ►వివియర్ రిచర్డ్స్- 181 ►రాస్ టేలర్- 181 ►ఏబీ డివిలియర్స్- 176 ►కపిల్ దేవ్- 175 ఒక్క రన్‌తో ధోని, కోహ్లి రికార్డు మిస్ కివీస్‌పై ఇన్నింగ్స్(182)తో.. వన్డేల్లో నాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన ఆరో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. చార్ల్స్ కొవంట్రీ(194), వివియన్ రిచర్డ్స్(189), ఫాఫ్ డుప్లెసిస్(185), మహేంద్ర సింగ్ ధోని(183), విరాట్ కోహ్లి(183) ఈ జాబితాలో స్టోక్స్ కంటే ముందున్నారు. ఇదిలా ఉంటే మూడో వన్డేలో ఇంగ్లండ్ 181 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. One of the greatest of this generation. PERIOD. 🐐 📹 | @BenStokes38 sent New Zealand bowlers to the cleaners, scoring 182 in just 124 balls 🥵#SonySportsNetwork #ENGvsNZ #BenStokes pic.twitter.com/OytoOEqNOb — Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2023 -
ఈసారి ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు అతడే: విండీస్ దిగ్గజం
ICC World Cup 2023- Leading Wicket Taker Prediction: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ ఫీవర్ నడుస్తోంది. మెగా ఈవెంట్‌కు ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే డిబేట్లు మొదలయ్యాయి. ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేదెవరు? టాప్ వికెట్ టేకర్ అయ్యేదెవరు? తదితర అంశాల గురించి క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కలిస్ ఓటు అతడికి.. సెహ్వాగ్ అంచనా ఇతడిపై ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహిస్తున్న షోలో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్, టీమిండియా స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ రన్ స్కోరర్ ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు. ప్రొటిస్ ఆల్‌రౌండర్ కలిస్.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను ఎంపిక చేసుకోగా.. వీరూ భాయ్.. టీమిండియా సారథి రోహిత్ శర్మకు అగ్రస్థానం దక్కుతుందని పేర్కొన్నాడు. పాకిస్తాన్లో ఉన్నపుడు దగ్గరగా చూశాను ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేదెవరో అంచనా వేశాడు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి ఆ అర్హత ఉందని రిచర్డ్స్ పేర్కొన్నాడు. ‘‘పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగమైన సమయంలో షాహిన్ ఆఫ్రిది ఎదుగుదలను దగ్గరగా చూశాను. ఈసారి అత్యధిక పరుగుల వీరుడు అతడే ఆట పట్ల అంకితభావం కలవాడు. వరల్డ్‌కప్‌లో షాహిన్ ఆఫ్రిది లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడు. అతడినే నేను ఎంపిక చేసుకుంటా’’ అని వివియర్ రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. కాగా మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ ప్రధాన పేసర్‌గా మారాడు 23 ఏళ్ల షాహిన్ ఆఫ్రిది. పాకిస్తాన్ స్టార్ పేసర్.. మూడు ఫార్మాట్లలోనూ ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 27 టెస్టులు, 39 వన్డేలు, 52 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 105, 76, 64 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు. ఇక ప్రపంచకప్ కంటే ముందు షాహిన్ ఆఫ్రిది ఆసియా కప్-2023 బరిలో దిగనున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఈ వన్డే టోర్నీ ఆరంభం కానుండగా.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ఈవెంట్ మొదలుకానుంది. ఆసియా కప్-2023కి పాకిస్తాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది. చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజాలతో..
ICC Cricket World Cup Qualifiers 2023 SCO Vs NED: వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్‌కు వచ్చే రెండు జట్లేవో తేలిపోయింది. మాజీ చాంపియన్ శ్రీలంక ఇంతకుముందే అర్హత సాధించగా, ఇప్పుడు నెదర్లాండ్స్ తమ చోటును ఖాయం చేసుకుంది. తప్పనిసరిగా నెగ్గాల్సిన గురువారం నాటి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్లతో స్కాట్లాండ్పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ అసాధారణ రీతిలో బ్రెండన్ మెక్‌ములన్ (106; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. బాస్ డి లీడె (5/52) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావాలంటే 44 ఓవర్లలోనే లక్ష్యం సాధించాల్సిన స్థితిలో నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. ఆ జట్టు 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు సాధించింది. బాస్ దంచికొట్టాడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బాస్ డి లీడె (92 బంతుల్లో 123; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... విక్రమ్‌జిత్ సింగ్ (40), సాఖిబ్ జుల్ఫికర్ (33 నాటౌట్) రాణించారు. 36 ఓవర్లు ముగిసేవరకు కూడా మ్యాచ్ స్కాట్లాండ్ నియంత్రణలోనే ఉంది. 8 ఓవర్లలో నెదర్లాండ్స్ 85 పరుగులు చేయాల్సి ఉంది. తర్వాతి 4 ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 4 ఓవర్లలో 45కు మారింది. ఈ సమయంలో డి లీడె ఒక్క సారిగా టి20 తరహా ఆటను చూపించాడు. వాట్ వేసిన ఓవర్లో 2 సిక్స్‌లు, మెక్‌ములెన్ వేసిన తర్వాతి ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో మొత్తం 42 పరుగులు వచ్చేశాయి. 84 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. డి లీడె రనౌటైనా, వాన్ బీక్ సింగిల్ తీయడంతో డచ్ శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి. తొలి డచ్ క్రికెటర్‌గా ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సెంచరీ హీరో బాస్ డి లీడె అరుదైన రికార్డు సాధించాడు. డచ్ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన నిలిచాడు. వన్డేల్లో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు డి లీడె. గతంలో వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్), కాలింగ్‌వుడ్ (ఇంగ్లండ్), రోహన్ ముస్తఫా (యూఏఈ) మాత్రమే ఈ ఘనత సాధించారు. తొలి ప్లేయర్ వివియన్ రిచర్డ్స్ 1987లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వివ్ రిచర్డ్స్ 119 పరుగులు చేయడంతో పాటు 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్‌తో 2005 నాటి మ్యాచ్‌లో పాల్ కాలింగ్‌వుడ్ సెంచరీ సాధించడంతో పాటు ఆరు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ కెప్టెన్ రోహన్ ముస్తఫా 2017లో పపువా న్యూ గినియాతో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
Virat Kohli: ఇప్పట్లో చల్లారేలా లేదు! కోహ్లి మరో పోస్ట్ వైరల్! రియల్ బాస్ ఎవరంటే!
IPL 2023- LSG Vs RCB: ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ మధ్య వివాదం గురించి నెట్టింట్లో రచ్చ కొనసాగుతూనే ఉంది. గత మ్యాచ్‌లో గంభీర్ చర్యకు కోహ్లి బదులిచ్చాడని కింగ్ అభిమానులు అంటుండగా.. సీనియర్ అన్న గౌరవం లేదా అంటూ గౌతీ ఫ్యాన్స్ కోహ్లిపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ గొడవలో ‘‘తప్పెవరిది’’ అన్న విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చోపర్చలు జరుగుతున్నాయి. గంభీర్ ఫ్యాన్స్‌కు చురక!? ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్‌స్టా పోస్ట్‌తో మరోసారి గంభీర్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన కోహ్లి.. బుధవారం మరో ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పాత ఇంటర్వ్యూ తాలూకు దృశ్యాలు పంచుకున్నాడు. ఇందుకు.. ‘‘ది రియల్ బాస్’’ అంటూ కోహ్లి క్యాప్షన్ జత చేయడంతో మరోసారి గంభీర్ అభిమానులకు చురక తగిలినట్లయింది. ఈ వీడియోలో క్రికెట్ డిస్ట్రిక్ట్‌తో రిచర్డ్స్ ముచ్చటిస్తూ.. పొట్టి ఫార్మాట్లో వివిధ లీగ్‌లలో ఆడటాన్ని తాను ఇష్టపడతానని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ ఆడీ ఆడీ బోర్ కొట్టిందని.. ఇప్పుడు ఐపీఎల్ లేదంటే సీపీఎల్ వంటి లీగ్‌లలో ఆడాలని ఉందని చెప్పుకొచ్చాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం (మే 1) నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ కోహ్లి- లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. గంభీర్ అలా.. కోహ్లి ఇలా! అంతకు ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై తమ విజయానంతరం గంభీర్..ఆర్సీబీ ఫ్యాన్స్‌ను నోరు మూసుకోవాలి అన్నట్లు సైగతో ట్రోల్ చేశాడు. అయితే, ఈ విషయాన్ని తేలికగా వదిలిపెట్టని కోహ్లి.. లక్నోలో తమ విజయం నేపథ్యంలో ఆద్యంతం గంభీర్, లక్నో జట్టును కవ్వించేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నవీన్ ఉల్ హక్ కారణంగా ఇక ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫ్రీ హిట్ నేపథ్యంలో లక్నో టెయిలెండర్ నవీన్ ఉల్ హక్‌తో అతడికి తలెత్తిన గొడవలో కోహ్లి జోక్యంతో వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో కోహ్లిని ఆపడానికి మరో ఎండ్‌లో ఉన్న అమిత్ మిశ్రా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మ్యాచ్ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో నవీన్ కోహ్లితో అనుచితంగా ప్రవర్తించడం.. గంభీర్ సహా మేయర్స్ జోక్యం చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం నవీన్‌కు సర్దిచెప్తూ సున్నితంగానే కోహ్లిని వారించే ప్రయత్నం చేశాడు. వాళ్లిద్దరే ఈ గొడవ నేపథ్యంలో కోహ్లి, గంభీర్ మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెంటిల్మన్ గేమ్‌కు మాయని మచ్చ తెచ్చారంటూ పలువురు భారత మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా రిచర్డ్స్‌పై ఎల్లప్పుడూ అభిమానం చాటుకునే కోహ్లి.. గతంలో ఓసారి.. ‘‘ సచిన్ టెండుల్కర్, వివియన్ రిచర్డ్స్ మాత్రమే GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్)’’ అని పేర్కొన్నాడు. చదవండి: #ViratGambhirFight: మిమ్మల్ని అనలేదు.. నా వాళ్లను అన్నావు! కోహ్లి- గంభీర్ గొడవ.. జరిగిందిదే: ప్రత్యక్ష సాక్షి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రిచర్డ్స్, సచిన్, కోహ్లి, రోహిత్! కానీ ఇలాంటి బ్యాటర్ శతాబ్దానికొక్కడే!
India vs Sri Lanka- Suryakumar Yadav: ‘‘అతడి ఇన్నింగ్స్ గురించి వర్ణించడానికి నాకు మాటలు చాలడం లేదు. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి... ఈ జాబితాలో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన ఎప్పుడో కలిగించాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదువ లేదు. అందులోనూ ఇలాంటి ప్లేయర్లు సూపర్. తన ఆట అత్యద్భుతం. ముఖ్యంగా ఫైన్ లెగ్ దిశగా తను కొట్టే ల్యాప్ షాట్ అమోఘం. తను అలా ఆడుతుంటే బౌలర్లు బెంబేలెత్తిపోతారు. తను ఎటూ కదలకుండానే మిడాన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదగలడని వాళ్లకు తెలుసు. షాట్ సెలక్షన్ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రిక్కీ పాంటింగ్.. లాంటి ఎంతో మంది బ్యాటింగ్ దిగ్గజాలను చూశాను. కానీ.. అతడిలా బంతిని ఇంత క్లీన్‌గా హిట్ చేయగల బ్యాటర్‌ను చూడలేదు. హ్యాట్సాఫ్’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. సూర్యకుమార్ యాదవ్‌ను ఆకాశానికెత్తాడు. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా ‘స్కై’ కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సూర్య విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న ‘స్కై’.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 112 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి.. సిరీస్ గెలవడంలో సహాయపడ్డాడు. కపిల్ దేవ్- స్కై శతాబ్దానికి ఒక్కడు ఈ నేపథ్యంలో.. కపిల్ దేవ్.. సూర్య ది గ్రేట్ ఇన్నింగ్స్ గురించి ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘హ్యాట్సాఫ్ సూర్యకుమార్ యాదవ్.. తనలాంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరే ఉంటారు’’ అంటూ కొనియాడాడు. కాగా లంకతో మ్యాచ్‌లో సెంచరీ సూర్య కెరీర్లో మూడోది. మిగతా రెండూ కూడా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లలో సాధించినవే!! ఈ శతకంతో సూర్య పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం.. రోజుల వ్యవధిలోనే దంపతుల హఠాన్మరణం Virat Kohli: అదొక జబ్బు! దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్ వైరల్ -
రోహిత్‌కు వీరాభిమానిని.. ముఖ్యంగా కోహ్లి కెప్టెన్సీలో అతడు: విండీస్ దిగ్గజం
T20 world Cup 2022: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. తనకు రోహిత్ ఆట తీరంటే ఎంతో ఇష్టమన్న ఆయన.. కెప్టెన్ కాకముందు నుంచే హిట్‌మ్యాన్‌కు తాను అభిమానినని చెప్పుకొచ్చాడు. కాగా విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే, ఆసియా కప్-2022లో మాత్రం భారత జట్టు అంచనాల మేరకు రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా టీ20 వరల్డ్‌కప్-2022 ట్రోఫీ కైవసం చేసుకొని కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలిచన ఘనత సాధించాలని రోహిత్ శర్మ పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ది కూడా ఇలాంటి పరిస్థితే! ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచకప్ వేదిక ఆస్ట్రేలియాకు చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీసులో తలమునకలైపోయింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్ ఇంటర్వ్యూలో సర్ వివియన్ రిచర్డ్స్ మాట్లాడుతూ రోహిత్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ అంటే ఇష్టం.. ‘‘నాకు రోహిత్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడిన సమయంలో అతడి ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. రోహిత్ కెప్టెన్ కాకముందు నుంచే నేను అతడికి వీరాభిమానిని’’ అని వివియన్ రిచర్డ్స్ పేర్కొన్నాడు. అదే విధంగా సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి పట్ల అభిమానం చాటుకున్నాడు. ‘‘సచిన్, విరాట్ కోహ్లిలంటే నాకెంతో గౌరవం. వారికి కూడా నా పట్ల అభిమానం ఉంది. వాళ్లిద్దరు సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే నేను సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిల ఆటను ఎంతగానో ఆరాధిస్తాను. ఈరోజు భారత జట్టు ఈ స్థాయిలో ఉందంటే ఇలాంటి గొప్ప ఆటగాళ్ల వల్లే! ఇండియాలో ఎంతో మంది గొప్ప బ్యాటర్లు ఉన్నారు. వాళ్లందరి వల్లే ఇది సాధ్యమైంది’’ అని వివియన్ రిచర్డ్స్ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022 Warm Ups: అక్టోబరు 17న ఆసీస్‌తో టీమిండియా! వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
WC 2022 Final: ఆడం గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన అలిస్సా హేలీ..
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- Alyssa Healy: ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హేలీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి వారికి పీడకలను మిగిల్చింది. అలిస్సా ఏకంగా 26 ఫోర్లు బాదిందంటే ఆ బౌలర్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో తన అద్భుత ఇన్నింగ్స్‌తో అలిస్సా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడం గిల్‌క్రిస్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ల జాబితాలో ప్రథమస్థానంలో నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు ఆడం గిల్‌క్రిస్ట్, రిక్కీ పాంటింగ్, వివియన్ రిచర్డ్స్‌ను వెనక్కి నెట్టింది. తద్వారా ప్రపంచకప్ ఫైనల్లో అరుదైన ఫీట్‌తో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే హేలీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు 1. అలిస్సా హేలీ(ఆస్ట్రేలియా)- 170 పరుగులు- ప్రత్యర్థి ఇంగ్లండ్- 2022 2. ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా)- 149 పరుగులు- ప్రత్యర్థి శ్రీలంక-2007 3. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 140 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇండియా- 2003 4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 138 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇంగ్లండ్- 1979 చదవండి: IPL 2022: ఢిల్లీ జట్టుకు గుడ్‌న్యూస్.. వాళ్లిద్దరూ జట్టులోకి రానున్నారన్న పాంటింగ్! -
WI Vs Eng 2nd Test: జో రూట్ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి..
WI Vs Eng 2nd Test- Joe Root: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 25వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో బార్బడోస్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 24 సెంచరీలు నమోదు చేసిన గ్రెగ్ చాపెల్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు, మహ్మద్ యూసఫ్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లను వెనక్కి నెట్టాడు. వీరి కంటే రూట్ ఒక అడుగు ముందు వరుసలో నిలిచాడు. ఈ క్రమంలో బ్యాట్‌తో అభివాదం చేస్తూ మైదానంలోని అభిమానులతో రూట్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా అతడి పేరును పాటగా ఆలపిస్తూ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. కాగా విండీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాక్ క్రాలే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వనౌడౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రూట్ 246 బంతుల్లో 119 పరుగులు(నాటౌట్) సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఓపెనర్ అలెక్స్ లీస్ 30 పరుగులు చేసి నిష్క్రమించగా.. క్రీజులోకి వచ్చిన డానియెల్ లారెన్స్ 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. చదవండి: MS Dhoni: నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్ IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ! అయితే.. An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 -
పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి
నీనా గుప్తా.. నటనకు నిర్వచనం! వివియన్ రిచర్డ్స్.. క్రికెట్ సంచలనం! ఆమె అతని ఫ్యాన్.. అతని జీవన సహచరిగా కూడా కావాలనుకుంది.. కుదరలేదు.. ఆ వైఫల్యం మనసు నిండా బాధను నింపింది.. ఆ ప్రేమ ఇచ్చిన గుర్తును గుండెకు హత్తుకొని ముందుకు సాగింది.. అలా మొదలైంది.. 1980ల నాటి సంగతి.. ఇండియాతో సిరీస్ ఆడ్డానికి వెస్ట్ ఇండీస్ టీమ్ ఇక్కడికి వచ్చింది. ఆ సమయంలో వెస్ట్ ఇండీస్ టీమ్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్. ఆటగాడిగా ఎంత ఫేమస్సో లేడీస్ మన్‌గానూ అంతే పాపులర్. మ్యాచ్ షెడ్యూల్లో భాగంగా ముంబై చేరుకుందా టీమ్. ఒకరోజు పేజ్ త్రీ పార్టీకి హాజరయ్యాడు రిచర్డ్స్. ఆ పార్టీకి నీనా గుప్తా కూడా వచ్చింది. రిచర్డ్స్ అంటే వెర్రి అభిమానం ఆమెకు. అక్కడ అతను కనిపించేసరికి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతలోనే నీనా సన్నిహితులు ఆమెను రిచర్డ్స్కు పరిచయం చేశారు ‘మీ అభిమాని’ అంటూ. తనను చూసినప్పుడు నీనా కళ్లల్లో మెరిసిన మెరుపు అతణ్ణి కట్టిపడేసింది. నీనా అభిమానం ఆమె ముందు నుంచి కదలనివ్వకుండా చేసింది. ఆ ఇద్దరి మధ్య స్నేహం ఇంకా నిలదొక్కుకోకముందే ఆకర్షణ ఆ జంటను ప్రేమలోకి తోసింది. అప్పటికే రిచర్డ్స్ ఇద్దరు పిల్లల తండ్రి కూడా.. రిచర్డ్స్ అప్పటికే వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా! ‘నువ్వంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నాను’ అని నీనా అన్నప్పుడే తనకు పెళ్లయిన విషయం చెప్పేశాడు అని అంటారు ఆ జంట లవ్ స్టోరీ తెలిసిన సన్నిహితులు. అయినా నీనా .. రిచర్డ్స్ ప్రేమను ఆస్వాదించింది. సిరీస్ అయిపోయాక రిచర్డ్స్ స్వదేశం వెళ్లిపోయాడు. షూటింగ్స్ లేని ఖాళీ సమయాలను రిచర్డ్స్‌తోనే వెచ్చించింది.. అతని దేశంలో. ఆ సమయంలో రిచర్డ్స్ తన భార్యకు దూరంగా.. విడాకుల ఆలోచనలో ఉన్నాడని.. అయినా నీనా, రిచర్డ్స్‌ల మధ్య పెళ్లి ప్రస్తావన రాలేదని అప్పటి మీడియాలో వార్త. రిచర్డ్స్ ప్రేమలో ప్రపంచాన్ని మరచిపోయింది. ఆ సంతోషంలో ఆమె గ్రహించిన విషయం.. తాను తల్లిని కాబోతున్నానని. సంబరపడాల్సిందే కానీ.. పెళ్లి కాకుండా .. కరెక్ట్కాదు.. అన్నారు నీనా కుటుంబ పెద్దలు. మసాబా పుట్టింది.. రిచర్డ్స్ నుంచి ఏదైనా అనుకూలమైన నిర్ణయం వస్తుందేమోనని చూసింది నీనా. రాలేదు.. ‘పెళ్లి చేసుకోలేను’ అనే మాటను మార్చలేదు రిచర్డ్స్. అది నీనా మనసును కష్టపెట్టింది. అతని తీరు చూసి నీనా స్నేహితులూ హెచ్చరించారు..‘నువ్వు నీ గురించే ఆలోచించుకుంటున్నావ్ తప్ప పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించట్లేదు. పుట్టబోయే ఆ బిడ్డను సఫర్ చేయడం తప్ప నువ్వేం సాధించలేవు’ అని. వినలేదు నీనా. బిడ్డను కనాలనే తీర్మానించుకుంది. మసాబా పుట్టింది. సింగిల్ పేరెంట్.. ఒంటరి తల్లిగానే మసాబాను పెంచింది. ఆ ప్రయాణంలో నీనా తండ్రి ఆమెకు అండగా ఉన్నాడు. అయినా చాలా సమస్యలు ఎదుర్కున్నారు ఇటు నీనా.. అటు మసాబా కూడా. 42ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమ పండిట్ జస్రాజ్ కొడుకు శారంగ్దేవ్ పండిట్ నీనాతో ప్రేమలో పడ్డాడు. నిశ్చితార్థమూ జరిగింది. కానీ ఎందుకో అది పెళ్లిదాకా రాలేదు. దాంతో నీనా చాలా కుంగిపోయింది. ఇంక పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ.. తన 42వ ఏట.. అంటే 2002లో ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మిశ్రా.. నీనాతో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లు కొనసాగిన ఆ ప్రేమ 2008లో పెళ్లిగా మారింది. ఆ వైవాహిక బంధం సంతోషంగా సాగిపోతోంది. ఒకసారి ముంబై మిర్రర్ ప్రతినిధి నీనా గుప్తాను ‘గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో దేని గురించైనా పునరాలోచించాల్సివస్తే దేన్ని పరిగణనలోకి తీసుకుంటారు?’ అని అడిగితే.. ‘పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది. ప్రతి బిడ్డకు తల్లి, తండ్రి ఇద్దరి ఆప్యాయత, సంరక్షణ అత్యంతవసరం. సింగిల్ పేరెంట్‌గా నేను ఏలోటు రానివ్వకుండా మసాబాను పెంచినా చెంత తండ్రి లేకుండా తనెంత సఫర్ అయిందో నాకు తెలుసు’ అని చెప్పింది. నాకు అమ్మ, నాన్న ఇద్దరి పట్లా అంతే ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇద్దరు ఎవరికి వారే గొప్ప వాళ్లు. నా చిన్నప్పుడు నాన్నతో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. ఆయనతో మేము, మాతో ఆయన ఉండిపోలేదు కానీ సెలవుల్లో మాత్రం నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో గడిపేవాళ్లం. – మసాబా గుప్తా జీవితంలో నాకు రిగ్రెట్స్ ఉన్నాయి. పెళ్లి కాకుండా బిడ్డను కనేకంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సింది. అలా చేసుంటే నా జీవితం ఇలా ఇన్ని మలుపులు తిరిగుండకపోయేది! – నీనా గుప్తా ‘సచ్ కహూ తో’ అనే తన ఆత్మకథలో నిర్భయంగా, నిజాయితీగా చాలా విషయాలనే రాసింది నీనా గుప్తా. ∙ఎస్సార్ చదవండి: శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాలపై పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు 'స్పిరిట్'కు ప్రభాస్ రికార్డు స్థాయి పారితోషికం! -
నాల్గో టెస్టుకు సేమ్ పిచ్ కావాలి: మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: మొటేరా పిచ్ నాణ్యతపై చర్చ కొనసాగుతోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఇప్పటికే.. ‘‘ఇది ఐదు రోజుల టెస్టు పిచ్ కాదు’’ అంటూ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన నాటి నుంచి ఇంగ్లిష్ మీడియా సైతం ఇదే తరహా కామెంట్లు చేస్తోంది. ఈ విషయాల గురించి తాజాగా స్పందించిన వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్.. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారడం తనకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు పిచ్ గురించి మాట్లాడటం మానేయాలని, స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై పర్యాటక జట్టు దృష్టి సారించాలని హితవు పలికాడు. ‘‘ఇండియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో, మూడో టెస్టు గురించి ఈ మధ్య కాలంలో చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నాను. పిచ్ గురించి ఎవరైతే బాగా బాధపడుతున్నారో వారు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. టెస్టు మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. స్పిన్‌కు మాత్రమే పిచ్ అనుకూలిస్తుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. నిజానికి మీరు ఎక్కడ ఆడుతున్నారో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకు వెళ్తున్నారు అంటేనే స్పిన్ లాండ్కు వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. పిచ్ గురించి చింతించడం మానేయాలి’’ అని ఫేస్బుక్ వీడియోలో రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా నాలుగో టెస్టుకు కూడా సేమ్ పిచ్‌ను తయారు చేయాలని ఇండియాకు విజ్ఞప్తి చేశాడు. ‘‘రెండు రోజుల్లోనే మూడో టెస్టు ముగిసింది. కాబట్టి పిచ్‌ను అంచనా వేసేందుకు ఇంగ్లండ్‌కు మంచి అవకాశం దొరికినట్లయింది. నాలుగో టెస్టు ఎలా ఉండబోతోందో అర్థమయింది. నేనైతే ఆఖరి టెస్టు మ్యాచ్‌కు కూడా అదే పిచ్ తయారుచేయాలని కోరుకుంటున్నా’’అని రిచర్డ్స్' పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పిచ్ నాణ్యతపై చర్చ చేయి దాటిపోతోందంటూ విమర్శకులపై మండిపడిన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ‘‘పిచ్ స్పిన్నింగ్స్కు అనుకూలంగా మారినప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరు ఏడుపు మొదలెట్టేశారు’’ అని కౌంటర్ ఇచ్చాడు. కాగా మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: 'పిచ్‌ను నిందించడం కాదు.. ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టండి' మొటేరా పిచ్ ఎలా తయారవుతుందో చూడండి! -
నా పెళ్లి గురించి మసాబా ఏమన్నదంటే..
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడిస్తారు. యాభైలలో నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. రిచర్డ్స్‌తో విడిపోయిన తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. అప్పుడు మసాబాకు 19 సంవత్సరాలు. అయితే వివేక్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి మసాబాతో చెప్పినప్పుడు తాను ఎలా స్పందించింది అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నీనా గుప్తా. (చదవండి: విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..) ఈ సందర్భంగా నీనా గుప్తా మాట్లాడుతూ.. ‘వివేక్-నేను ఓ పదేళ్ల పాటు కలిసి తిరిగాము. తను నా కోసం ముంబై వచ్చేవాడు.. నేను అతడి కోసం ఢిల్లీ వెళ్లేదాన్ని. ఇవన్ని మసాబాకు తెలుసు. ఇక మేం పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు దీని గురించి మసాబాకు చెప్పాను. అప్పుడు తన వయసు 19 ఏళ్లు. పెళ్లి గురించి చెప్పగానే తను అడిగిన మొదటి ప్రశ్న.. ఎందుకు వివాహాం చేసుకోవాలనుకుంటున్నావు అని. అప్పుడు నేను ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే పెళ్లి తప్పని సరి అని చెప్పాను’ అన్నారు. అయితే దీని గురించి మసాబాతో చెప్పడానికి తాను కొంత ఇబ్బంది పడ్డానన్నారు నీనా గుప్తా. కానీ మసాబా నన్ను అర్థం చేసుకుంది. నా ఆనందం కోసం తను ఏమైనా చేస్తుంది. అది తనకు నచ్చినా.. నచ్చకపోయినా. కాబట్టి నేను ఆందోళన చెందలేదు అన్నారు. ఇక నీనా గుప్తా, వివేక్ మెహ్రాల వివాహం 2008లో జరిగింది. -
పొలాక్ మదిలో సచిన్ కానీ అతడి జాబితాలో..
హైదరాబాద్ : టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై దక్షిణాఫ్రికా మాజీ సారథి షాన్ పొలాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన తరం క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ సచిన అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు తన ఆటను మార్చుకుంటాడని ప్రశంసించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలాక్ పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నాడు. ‘పరిస్థితులను ఆకలింపు చేసుకుని, జట్టు అవసరాలకు తగ్గట్లు తన ఆటను మార్చుకుంటాడు. అతడికి సంధించే షార్ట్ పిచ్ బంతులను కీపర్, స్లిప్ ఫీల్డర్ల మీదుగా ఆడే షాట్స్ అప్పట్లో ఓ వండర్ అనుకోవాలి. టెక్నికల్‌గా అతడి బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు. అందుకే ఔట్ చేయడం చాలా కష్టంగా అనిపించేది. అయితే అతడు తప్పిదం చేసేవరకు వేచి చూసేవాళ్లం’అని పొలాక్ పేర్కొన్నాడు. ఇక సచిన్ వన్డేల్లో 9 సార్లు అవుట్ చేసిన పొలాక్.. ఎక్కువ సార్లు అతడిని అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. వివి రిచర్డ్స్ పేరు చెప్పిన హోల్డింగ్ ఇక ఇదే అంశంపై వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘నేను చూసిన అప్పడు, ఇప్పుడు, ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ వివి రిచర్డ్సే. రిచర్డ్ హ్యాడ్లీ, డెన్నీస్ లిల్లీ, అబ్ధుల్ ఖాదీర్, బిషన్ బేడి, ఇయాన్ బోథమ్ వంటి అప్పటి ప్రపంచ ప్రఖ్యాత బౌలర్లను సమర్థవంతంగా ఎలాంటి భయం, బెరుకు లేకుండా పరుగులు రాబట్టాడు. అందుకే రిచర్డ్స్ అత్యుత్తమ ఆటగాడని నా అభిప్రాయం’అని హోల్డింగ్ పేర్కొన్నాడు. -
విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..
తన కూతురు మసాబా విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా అన్నారు. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని పేర్కొన్నారు. వెస్టిండీస్ క్రికెటర్, వివాహితుడైన వివియన్ రిచర్డ్స్‌ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమెకు మసాబాగా నామకరణం చేసి.. తల్లీతండ్రీ తానే అయి అపురూపంగా పెంచుకున్నారు. ఈ క్రమంలో మసాబా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. రెండేళ్ల క్రితం వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. మధు, మసాబా ఈ మేరకు 2018 ఆగస్టులో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కోర్టు మ్యారేజీ ద్వారా పెళ్లి చేసుకున్న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం వారికి విడాకులు మంజూరయ్యాయి.(వివాహితుడిని ప్రేమించకండి: నటి) ఈ విషయం గురించి తాజాగా మసాబా తల్లి నీనా గుప్తా మాట్లాడుతూ.. మధు, మసాబాల విడాకుల గురించి తెలిసి తాను దుఃఖ సాగరంలో మునిగిపోయానని తెలిపారు. ‘‘నిజానికి ఈ విషయం తెలిసిన తర్వాత బాధ నుంచి తేరుకోలేకపోయాను. అప్పుడు మసాబానే నాకు సహాయం చేసింది. నేను అస్సలు ఈ విషయాన్ని అంగీకరించలేకపోయాను. నాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది’’అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా... ‘‘నా కూతురి పెంపకంలో నా తండ్రి నాకు ఎంతగానో సహాయం చేశారు. నా కోసం ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు. నా కోసం అంతగా కష్టపడిన నాన్నకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సింగిల్ పేరెంట్‌గా ఉన్న నాకు వెన్నెముకగా నిలిచారు’’ అని తన కూతురి పెంపకంలో ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకున్నారు. కాగా కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్ రిచర్డ్స్, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. బదా యీ హో, సర్వమంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించారు. ఇక కొన్నిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేసిన నీనా గుప్తా.. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడవద్దంటూ తన అనుభవాల గురించి పంచుకున్న సంగతి తెలిసిందే. -
బౌన్సర్లే ఎదురుదాడికి ప్రేరణ
అంటిగ్వా: బౌలర్లపై ఎదురుదాడికి దిగేందుకు వారు వేసే బౌన్సర్లు తనకు ప్రేరణ ఇస్తాయని టీమిండియా సారథి విరాట్ కోహ్లి అన్నాడు. బౌన్సర్ తగులుతుందేమోనని బాధపడడం కన్నా.. నొప్పిని భరిస్తూనే బాదడం మేలని చెప్పాడు. వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్‌తో జరిగిన ముఖాముఖిలో కోహ్లి వెల్లడించిన అభిప్రాయాలివి. దీనికి సంబంధించిన తొలి భాగం వీడియోను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఇదంతా ఆటలో భాగమే ‘బౌన్సర్ ఎక్కడ గాయపరుస్తుందోనని భయపడే కన్నా ముందే దెబ్బ తగిలించుకోవడం మంచిదని అనుకుంటాను. అదీ గట్టిగా! మరోసారి అలా జరగకుండా ఇది నాకు ప్రేరణనిస్తుంది. శరీరమంతా ఆ నొప్పి పాకుతున్నప్పుడు.. సరే! మళ్లీ ఇది చోటుచేసుకోదు’ అని భావిస్తానని కోహ్లి చెప్పాడు. రిచర్డ్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. ‘ఇదంతా ఆటలో ఒక భాగం. ఇలాంటి గాయాల తర్వాత మనమెలా తిరిగొస్తామన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. గతంలో ఛాతీ భాగంలో చిన్న గార్డ్స్ మాత్రమే ఉండేవి. బంతులు తగిలి బాధపడేవాళ్లం. కానీ తప్పదు’ అని రిచర్డ్స్ వెల్లడించారు. ప్రస్తుతం మాలాంటి బ్యాట్స్‌మెన్ అందరికీ మీరే గొప్ప స్ఫూర్తి అని విరాట్ చెప్పగా.. తమ ఇద్దరిలోని సారూప్యతలను రిచర్డ్స్ పేర్కొన్నాడు. ‘పోటీకి నేనెప్పుడూ సిద్ధమే అనుకొనేవాడిని. నా సామర్థ్యం మేరకు నన్ను నేను అత్యుత్తమంగా బయట పెట్టుకుంటాను. ఆ అభిరుచి, ఆ సారూపత్యను నీలో చూస్తున్నాను. కొన్నిసార్లు కొందరు మనల్ని భిన్నంగా చూస్తారు’ అని విండీస్ దిగ్గజం వెల్లడించాడు. నేను గొప్పవాడినని నమ్మేవాడిని.. అత్యంత నాణ్యమైన బౌలింగ్ ఉన్నప్పటి శకంలో మీరెందుకు హెల్మెట్ ధరించలేదని కోహ్లి అడిగిన ప్రశ్నకు ‘నేను గొప్పవాడినని నమ్మేవాడిని. మీకు పొగరులా అనిపించొచ్చు. కానీ, నాకు తెలిసిన క్రీడలో భాగమయ్యానని ఫీలయ్యేవాడిని. ప్రతిసారీ నన్ను నేను ప్రోత్సహించుకొనేవాడిని. అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాలని భావించినప్పుడు దెబ్బలు తినడానికీ సిద్ధంగా ఉండేవాడిని. హెల్మెట్ ధరించినప్పుడు అసౌకర్యంగా ఉండేది. మెరూన్ టోపీ ధరిచినప్పుడు గర్వంగా భావించేవాడిని. ఆడేందుకు నేను సరిపోతానన్న ఆలోచన ధోరణితో ఉండేవాడిని. ఒక వేళ నేను గాయపడితే అది దేవుడి దయ. క్షేమంగా బయటపడేవాడిని’ అని రిచర్డ్స్ తెలిపాడు. -
రిచర్డ్స్ సరసన కోహ్లి చేరతాడా?
కేప్‌టౌన్:భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంకా 129 పరుగులు సాధిస్తే ఒక పర్యటనలో వెయ్యి పరుగుల్ని సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలుస్తాడు. గతంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ఒక్కడే ఒక టూర్లో వెయ్యి పరుగుల్ని పూర్తి చేసిన క్రికెటర్. 1976లో ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్టులు, మూడు టెస్టులు ఆడిన రిచర్డ్స్ 1,045 పరుగులు సాధించాడు. అంతకుముందు డాన్ బ్రాడమన్ ఒక పర్యటనలో వెయ్యి పరుగులను పూర్తి చేయడానికి దగ్గరగా వచ్చినా 26 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇప్పుడు అరుదైన జాబితాలో చేరే అవకాశం కోహ్లి ముందుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో సత్తా చాటిన కోహ్లి.. భారత జట్టు వన్డే సిరీస్‌ను 5-1తో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆరు వన్డే సిరీస్‌లో 558 పరుగులు సాధించిన కోహ్లి.. ముందుగా జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో 286 పరుగులు సాధించాడు. ఇక తొలి రెండు టీ 20ల్లో కలిపి 27 పరుగులు చేశాడు. మొదటి టీ20లో 26 పరుగులు చేసిన కోహ్లి.. రెండో టీ20లో పరుగుకే అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో చివరి మ్యాచ్ అయిన మూడో టీ20లో కోహ్లి సెంచరీకి పైగా స్కోరు సాధిస్తే వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకుంటాడు. అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని కూడా కోహ్లి నమోదు చేస్తాడు. మరి వివియన్ రిచర్డ్స్ సరసన కోహ్లి నిలుస్తాడా?లేదో చూడాల్సింది. -
'మా క్రికెట్‌ను మరింత వెనక్కి నెట్టింది'
ఆంటిగ్వా: గత కొన్నిరోజుల క్రితం క్రికెటర్ డారెన్ బ్రేవోపై సస్పెన్షన్ వేటు వేస్తూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ తీవ్రంగా తప్పుబట్టాడు. తమ దేశ క్రికెట్ వెనక్కిపోవడానికి ఈ తరహా చర్యలే కారణమంటూ ధ్వజమెత్తాడు. ప్రతీ విషయాన్ని వివాదాస్పద కోణంలో చూడటం విండీస్ బోర్డుకు సాధారణంగా మారిపోయిందంటూ విమర్శించాడు. 'ఈ తరహా వేటు ఆమోదయోగ్యం కాదు. ప్రతీసారి పలు అంశాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని విడిచిపెట్టకతప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో అనవరసర రాద్దాంతాలు అనవసరం అని అనుకుంటున్నా. బ్రేవో వివాదం వెస్టిండీస్ క్రికెట్ సంస్కృతిని మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. పరిస్థితి బాగుందీ అనుకునే లోపే, మళ్లీ మొదటకొస్తుంది. ఇలా అయితే మన క్రికెట్ లో పురోగతి ఎలా సాధిస్తాం'అని రిచర్డ్స్ ప్రశ్నించాడు. ‘బిగ్ ఇడియట్’ కాంట్రాక్టు వివాదం డారెన్ బ్రేవోపై వేటకు కారణమైన సంగతి తెలిసిందే. డబ్ల్యూఐసీబీ ఇవ్వచూసిన సీ-కేటగిరి కాంట్రాక్టుపై అతడు బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. స్టార్ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కెమరాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. నాలుగేళ్లలో డేవ్ చేసింది ఏమీ లేదంటూ విమర్శించాడు. డేవ్ బిగ్ ఇడియట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఆ క్రమంలోనే ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో 27 ఏళ్ల బ్రావోకు చోటు కల్పించలేదు. అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని డబ్ల్యూఐసీబీ వెల్లడించింది. 95 వన్డేలు ఆడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు. -
వస్త్రధారణపై వివియన్ రిచర్డ్స్ కుమార్తె వ్యాఖ్యలు
బంజారాహిల్స్: నలుగురిలో ప్రత్యేకంగా నిలిపేవి, మన వ్యక్తిత్వాన్ని చాటే దుస్తులను ధరించాలని బాలీవుడ్ నటి నీనాగుప్తా, వెస్టిండిస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ల కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా పేర్కొన్నారు. బంజారాహిల్స్ పార్క్‌హయత్ హోటల్లో ఫిక్కీ ఎఫ్ఎల్వ్ ఆధ్వర్యంలో ‘ డిజైన్ యువర్ పర్సనాలిటి ’ పేరుతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రపంచ ఫ్యాషన్ పరిశ్రమలో మన దేశం ఇప్పుడిప్పుడే సత్తా చాటుతోందన్నారు. సోనమ్ కపూర్, అలియాభట్ సహా పలువురు నటీమణులకు తాను దుస్తులు డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. రిట్జ్ మ్యాగజైన్ ఎడిటర్ వనజా బంగారి కార్యక్రమ సంధానకర్తగా వ్వవహరించారు. ఎఫ్ఎల్వో చైర్పర్సన్ పద్మారాజగోపాల్ సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
కోహ్లికి జూనియర్ రిచర్డ్స్ కానుక
అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్య కానుక అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌ను ఇదివరకే విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ప్రశంసించగా ఇప్పుడు రిచర్డ్స్ తనయుడు కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే ఊరికే ప్రశంసలతోనే కాకుండా తన చిత్రకళానైపుణ్యాన్ని జోడించి కోహ్లి బ్యాట్ పెకైత్తి అభివాదం చేస్తున్న చిత్రాన్ని అతడు కానుకగా అందించాడు. 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాలి రిచర్డ్స్ నేరుగా హోటల్ గదికి వెళ్లి మరీ ఈ పెయింటింగ్‌ను అందించాడు. ‘కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించినందుకు గుర్తుగా కోహ్లికి ఏదైనా ఇద్దామనుకున్నాం. అంతే ఒకే రోజులో ఈ చిత్రాన్ని నా స్నేహితుడి సహకారంతో చిత్రించాను’ అని మాలి తెలిపాడు. -
విరాట్ పై అభిమానంతో..
ఆంటిగ్వా:వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానుల్లో ఇప్పుడు క్రికెట్ దిగ్గజ కుమారుడు వివియన్ రిచర్డ్స్ కుమారుడు మాలి రిచర్డ్స్ కూడా చేరిపోయాడు. స్వతహాగా తనకు కోహ్లి అంటే ఇష్టమని, ఆంటిగ్వాలో డబుల్ సెంచరీ చేయడంతో అతనిపై అభిమానం మరింత పెరిగిందన్నాడు. దీనిలో భాగంగా కోహ్లికి కోసం ఓ పెయింటింగ్‌ను గీసినట్లు మాలి తెలిపాడు. 'ఆంటిగ్వాలో కోహ్లి డబుల్ సెంచరీ చేసిన అనంతరం ఏమైనా చేయాలని అనుకున్నా. అది కొద్ది ప్రత్యేకంగా ఉండాలని భావించా. కేవలం ఒక్క రోజులోనే విరాట్ పెయింటింగ్ గీశా. ఆ చిన్నకానుకను విరాట్‌కు అందించాలనే ఇక్కడకు వచ్చా'అని మాలి తెలిపాడు. ఇప్పటివరకూ 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన మాలి.. కోహ్లి బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. తాను పెయింటింగ్ గీయడానికి అతని రికార్డు ఇన్నింగ్సే కారణమన్నాడు. తన తండ్రి రిచర్డ్స్, వ్యాపార భాగస్వామి రోన్ హోవెల్‌తో కలిసి విరాట్‌కు ఆ బహుమతిని మాలి అందజేశాడు. -
విండీస్ బోర్డును రద్దు చేయండి
గ్రెనెడా: తమ దేశ క్రికెట్ బోర్డును వెంటనే రద్దు చేయాలని వెస్టిండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, వివియన్ రిచర్డ్స్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న బోర్డుకు జవాబుదారీతనం లేదని, దీనివల్ల క్రికెట్ పరిస్థితి దిగజారిపోతోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న బోర్డు డెరైక్టర్లంతా వెంటనే రాజీనామా చేసి, మద్యంతర బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశంలో బీసీసీఐ శక్తివంతమైన బోర్డే అయినా, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తుందని... కానీ వెస్టిండీస్‌లో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. -
రిచర్డ్స్ ప్రామిస్!
ఎంగేజ్మెంట్కు నాన్న రాలేదని అలిగిన మసబా గుప్తాకు పెద్ద ఊరటే లభించింది. నవంబర్‌లో జరిగే పెళ్లికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చి కుమార్తె మోములో వెలుగులు పూయించాడు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్, మసాబా తండ్రి వివియన్ రిచర్డ్స్! వెటరన్ నటి నీనాగుప్తా, రిచర్డ్స్‌ల కూతురైన మసాబా ఫ్యాషన్ డిజైనర్. ఫిల్మ్ ప్రొడ్యూసర్ మధు మంతెనతో ముంబైలో రీసెంట్గా ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అలియాభట్, సిద్ధార్థ్ మల్హోత్రా, హ్యుమా ఖురేషి తదితర బాలీవుడ్ ప్రముఖులు, క్లోజ్ ఫ్రెండ్స్ ఈ అకేషన్‌కు అటెండయ్యారు. రిచర్డ్స్ మాత్రం మిస్సయ్యాడు. అయితే రిచర్డ్స్, ఆయన సతీమణి మిరియమ్ స్పీచ్‌తో ప్రదర్శించిన ఏవీ ఫంక్షన్లో ఉన్నవారందర్నీ టచ్ చేసింది. మసాబాను తొలిసారి కలిసి హగ్ చేసుకున్న మిరియమ్... ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంది. ఆమె తనకు మంచి ఫ్రెండని చెప్పింది. పెళ్లి తరువాత కుమార్తె అత్తింటికి వెళ్లిపోతే తాను ఒంటరినైపోతానంటూ నీనాగుప్తా కంటతడి పెట్టుకుంది. భర్తను రిటైర్మెంట్ తీసుకుని తనకు తోడుగా ఇంట్లోనే ఉండమని కోరిందట! మొత్తానికి మసాబా ఎంగేజ్మెంట్ పక్కా సెంటిమెంట్ సినిమాలా మారి... అతిథుల హృదయాలను ద్రవింపజేసింది! -
సచిన్ నా ఫేవరెట్ క్రికెటర్: వివియన్ రిచర్డ్స్
ఆంటిగ్వా:వివియన్ రిచర్డ్స్.. ఒకప్పటి వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం. ఆ ఆటగాడు బరిలో దిగేడంటే ప్రత్యర్థులకు వణుకే. మరి అటువంటి క్రికెటర్ కు సచిన్ టెండూల్కర్ ఆటంటే చాలా ఇష్టమట. అతనే తన ఫేవరెట్ ఆటగాడిని రిచర్డ్స్ తాజాగా స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి రాసిన కాలమ్ లో రిచర్డ్స్ ఈ విషయాలను స్పష్టం చేశాడు. ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్థానం దక్కించుకోవడంలో ఎటువంటి ఆశ్యర్యం లేదన్నాడు ఆల్ టైం వన్డే 10 మంది క్రికెటర్లలో రిచర్డ్స్ స్థానాన్ని సచిన్ అధిగమించాడు. దీనిపై స్పందించిన రిచర్డ్స్.. 'నేను సచిన్ కు ఫేవరెట్ ఆటగాడిని. ఒక్క మాటలో చెప్పాలంటే సచిన్ క్రికెట్ లెజెండ్. అతని మ్యాచ్ లను డబ్బులు చెల్లించి మరీ చూసేవాడినన్నాడు. -
'ఆ విషయంలో కోహ్లి అంటే ఇష్టం'
సిడ్నీ: మైదానంలో విరాట్ కోహ్లి దూకుడును వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వీవీఎన్ రిచర్డ్స్ సమర్థించాడు. కోహ్లి తన సహజసిద్ధ ప్రవర్తనను మార్చకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై నోటికి పనిచెప్పడం భారత ఆటగాళ్లు పెద్దగా చేయరని, కానీ కోహ్లి ఈ విషయంలో ముందున్నాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో కోహ్లిని అభిమానిస్తానని అన్నాడు. దూకుడు స్వభావంతో అసలైన ఆటతీరు బయటకు వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే దుండుకు ప్రవర్తనతో ఎవరినీ బాధ పెట్టకూడదని వీవీయన్ రిచర్డ్స్ సలహాయిచ్చాడు. -
వేగంగా విరాట్ 6 వేల పరుగులు!
హైదరాబాద్: భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి వన్డేలో అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. రాజీవ్ గాంధీ స్టేడియంలో శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో 53 పరుగులు చేయడంతో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ రికార్డును అధిమించారు. 144వ మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ల్లో విరాట్ ఈ ఘనతను సాధించారు. వివ్ రిచర్డ్స్ 156 మ్యాచులాడి 141 ఇన్నింగ్స్ లో 6 వేల పరుగుల మార్కును చేరుకున్నారు. 6 వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న భారతీయ క్రికెటర్లలో విరాట్ ఎనిమిదో వ్యక్తిగా కాగా, ప్రపంచవ్యాప్తంగా 47వ క్రికెటర్ గా చరిత్రల్లోకెక్కాడు. Follow @sakshinews