వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్
ICC World Cup 2023- Leading Wicket Taker Prediction: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ ఫీవర్ నడుస్తోంది. మెగా ఈవెంట్‌కు ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే డిబేట్లు మొదలయ్యాయి. ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేదెవరు? టాప్ వికెట్ టేకర్ అయ్యేదెవరు? తదితర అంశాల గురించి క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
కలిస్ ఓటు అతడికి.. సెహ్వాగ్ అంచనా ఇతడిపై
ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహిస్తున్న షోలో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్, టీమిండియా స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ రన్ స్కోరర్ ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు. ప్రొటిస్ ఆల్‌రౌండర్ కలిస్.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను ఎంపిక చేసుకోగా.. వీరూ భాయ్.. టీమిండియా సారథి రోహిత్ శర్మకు అగ్రస్థానం దక్కుతుందని పేర్కొన్నాడు.
పాకిస్తాన్‌లో ఉన్నపుడు దగ్గరగా చూశాను
ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేదెవరో అంచనా వేశాడు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి ఆ అర్హత ఉందని రిచర్డ్స్ పేర్కొన్నాడు. ‘‘పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగమైన సమయంలో షాహిన్ ఆఫ్రిది ఎదుగుదలను దగ్గరగా చూశాను.
ఈసారి అత్యధిక పరుగుల వీరుడు అతడే
ఆట పట్ల అంకితభావం కలవాడు. వరల్డ్‌కప్‌లో షాహిన్ ఆఫ్రిది లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడు. అతడినే నేను ఎంపిక చేసుకుంటా’’ అని వివియర్ రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. కాగా మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ ప్రధాన పేసర్‌గా మారాడు 23 ఏళ్ల షాహిన్ ఆఫ్రిది.
పాకిస్తాన్ స్టార్ పేసర్.. మూడు ఫార్మాట్లలోనూ
ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 27 టెస్టులు, 39 వన్డేలు, 52 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 105, 76, 64 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు.
ఇక ప్రపంచకప్ కంటే ముందు షాహిన్ ఆఫ్రిది ఆసియా కప్-2023 బరిలో దిగనున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఈ వన్డే టోర్నీ ఆరంభం కానుండగా.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ఈవెంట్ మొదలుకానుంది.
ఆసియా కప్-2023కి పాకిస్తాన్ జట్టు:
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment