భారత జట్టు
India vs Sri Lanka- Suryakumar Yadav: ‘‘అతడి ఇన్నింగ్స్ గురించి వర్ణించడానికి నాకు మాటలు చాలడం లేదు. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి... ఈ జాబితాలో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన ఎప్పుడో కలిగించాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదువ లేదు.
అందులోనూ ఇలాంటి ప్లేయర్లు సూపర్. తన ఆట అత్యద్భుతం. ముఖ్యంగా ఫైన్ లెగ్ దిశగా తను కొట్టే ల్యాప్ షాట్ అమోఘం. తను అలా ఆడుతుంటే బౌలర్లు బెంబేలెత్తిపోతారు. తను ఎటూ కదలకుండానే మిడాన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదగలడని వాళ్లకు తెలుసు.
షాట్ సెలక్షన్ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రిక్కీ పాంటింగ్.. లాంటి ఎంతో మంది బ్యాటింగ్ దిగ్గజాలను చూశాను. కానీ.. అతడిలా బంతిని ఇంత క్లీన్‌గా హిట్ చేయగల బ్యాటర్‌ను చూడలేదు. హ్యాట్సాఫ్’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. సూర్యకుమార్ యాదవ్‌ను ఆకాశానికెత్తాడు.
సూర్యకుమార్ యాదవ్
ఆకాశమే హద్దుగా ‘స్కై’
కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సూర్య విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న ‘స్కై’.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 112 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి.. సిరీస్ గెలవడంలో సహాయపడ్డాడు.
కపిల్ దేవ్- స్కై
శతాబ్దానికి ఒక్కడు
ఈ నేపథ్యంలో.. కపిల్ దేవ్.. సూర్య ది గ్రేట్ ఇన్నింగ్స్ గురించి ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘హ్యాట్సాఫ్ సూర్యకుమార్ యాదవ్.. తనలాంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరే ఉంటారు’’ అంటూ కొనియాడాడు. కాగా లంకతో మ్యాచ్‌లో సెంచరీ సూర్య కెరీర్‌లో మూడోది. మిగతా రెండూ కూడా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లలో సాధించినవే!! ఈ శతకంతో సూర్య పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
చదవండి: Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్‌లో తీవ్ర విషాదం.. రోజుల వ్యవధిలోనే దంపతుల హఠాన్మరణం
Virat Kohli: అదొక జబ్బు! దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment