కోహ్లి మరో రికార్డుపై కన్నేసిన ఆమ్లా | World Cup 2019 Hashim Amla Eye on Breaking Kohli ODI Record | Sakshi
Sakshi News home page

కోహ్లి మరో రికార్డుపై కన్నేసిన ఆమ్లా

Published Thu, May 30 2019 5:37 PM | Last Updated on Thu, May 30 2019 6:37 PM

World Cup 2019 Hashim Amla Eye on Breaking Kohli ODI Record - Sakshi

లండన్‌ : ప్రపంచకప్‌ అంటేనే క్రికెట్‌ అభిమానులకు పండగ. 46 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్‌ పండగ ఇంగ్లండ్‌ వేదికగా నేడు ప్రారంభమైంది. ప్రపంచకప్‌ 2019లో భాగంగా నేడు ఆతిథ్య ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడుతోంది. అయితే ప్రపంచకప్‌ ఆరంభపు మ్యాచ్‌లోనే ప్రొటీస్‌ సీనియర్‌ ఆటగాడు హషీమ్‌ ఆమ్లా విరాట్‌ కోహ్లి రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు.  అంతకుముందు విరాట్ ఈ ఘనతను 175 ఇన్నింగ్స్‌లో సాధించాడు. ఇప్పటివరకు ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు పూర్తి చేశాడు.
మంచి హిట్టింగ్‌తో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆమ్లా.. వన్డేల్లో 2000, 3000, 5000, 6000, 7000 పరుగులు సాధించిన ఆటగాడిగా ఆమ్లా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డు అందుకుంటే దక్షిణాఫ్రికా తరుపున ఎనిమిది వేల పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా ఆమ్లా చేరతాడు. ఈ జాబితాలో జాక్వస్‌ కలిస్‌(11,550), డివిలియర్స్‌(9427), గిబ్స్‌(8094)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఫామ్‌లో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమ్లా ఈ మ్యాచ్‌లో రాణించాలని కసిగా ఉన్నాడు. ఇక ప్రొటీస్‌ జట్టుకూడా ఆమ్లాతో సహా టాపార్డర్‌ రాణిస్తే తమకు ఎదురుండదని భావిస్తోంది.    
 

చదవండి:
పన్నెండో ప్రపంచ యుద్ధం
ఇమ్రాన్‌ తాహీర్‌ నయా రికార్డ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement