అగ్రస్థానంలోనే కోహ్లి
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ (112) మూడో ర్యాంక్‌కు పడిపోయింది. అయితే బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో ఆస్ట్రేలియా (115) టాప్ ర్యాంక్‌లో ఉండగా... లంక (112) రెండో స్థానంలో నిలిచింది.
ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 3-2తో గెలుచుకోవడంతో ఒక రేటింగ్ పాయింట్‌ను దక్కించుకున్న మాథ్యూస్ సేన దశాంశమానం తేడాతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో కెప్టెన్ ధోని ఆరో స్థానంలో కొనసాగుతుండగా, శిఖర్ ధావన్ ఎనిమిదో ర్యాంక్‌కు దిగజారాడు. రోహిత్ శర్మ టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు. బౌలర్ల విభాగంలో జడేజా ఐదో ర్యాంక్‌తో టాప్-10లో నిలిచాడు. సేననాయకే (లంక), ట్రేడ్‌వెల్ (ఇంగ్లండ్)లు తొలిసారి టాప్-20లోకి వచ్చారు.
భారత్ ర్యాంక్ 3
Published Thu, Jun 5 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement