Asia Cup 2022: Team India Surfing, Playing Volleyball At Dubai Video Goes Viral - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్‌

Published Fri, Sep 2 2022 2:20 PM | Last Updated on Fri, Sep 2 2022 3:53 PM

Asia Cup 2022: Team India At Dubai Shores Surfing Volleyball Video Viral - Sakshi

విరాట్‌ కోహ్లి- రోహిత్‌ శర్మ- అర్ష్‌దీప్‌సింగ్‌(PC: BCCI Twitter)

Virat Kohli Rohit Sharma Along With Others Enjoying In Dubai: వరుస విజయాలతో జోష్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు దుబాయ్‌లో మస్తుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. బీచ్‌ అందాలను ఆస్వాదిస్తూ.. సర్ఫింగ్‌ చేస్తూ, వాలీబాల్‌ ఆడుతూ సేదతీరుతున్నారు. ఆదివారం నాటి మ్యాచ్‌కు ముందు లభించిన విరామ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సహా మిగిలిన ఆటగాళ్లంతా ఈ బ్రేక్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, కేఎల్‌ రాహుల్‌ సర్ఫింగ్‌ చేస్తుండగా.. కోహ్లి.. దినేశ్‌ కార్తిక్‌, అశ్విన్‌, రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా తదితరులతో బీచ్‌ వాలీబాల్‌ ఆడుతూ కనిపించాడు.

పాక్‌ను మట్టికరిపించి
ఇక ఆసియా కప్‌-2022 టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను మట్టికరిపించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో హాంగ్‌ కాంగ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్‌-ఏలో సూపర్‌-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. పసికూనతో బుధవారం(ఆగష్టు 31) జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో గెలుపొంది సూపర్‌ 4లో ఎంట్రీ ఇచ్చింది. 

ఈ క్రమంలో గ్రూప్‌- ఏ టాపర్‌ టీమిండియా ఆదివారం(సెప్టెంబరు 4) ఇదే గ్రూపులోని సెకండ్‌ టాపర్‌తో తలడనుంది. ఇక హాంగ్‌ కాంగ్‌తో శుక్రవారం(సెప్టెంబరు 2) నాటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాకిస్తాన్‌ మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. 
చదవండి: Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్‌ కాంగ్‌ను పాక్‌ లైట్‌ తీసుకుంటే అంతే సంగతులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement