కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఆగస్టు 18 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. చిన్నజట్టే కదా అని తీసిపారేస్తే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతమున్న జింబాబ్వే మునుపటి జట్టులా మాత్రం కాదు. ఆ విషయం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను వన్డే, టి20 సిరీస్‌ల్లో ఓడించడమే అందుకు నిదర్శనం. టి20 ప్రపంచకప్ అర్హత సాధించామన్న వారి ధైర్యం జింబాబ్వేను పూర్వవైభవం దిశగా అడుగులు వేయిస్తుంది.
ఎంతకాదన్న సొంతగడ్డ అనేది ఆతిథ్య జట్టుకు బలం. సొంత ప్రేక్షకుల మధ్య మద్దతు విరివిగా లభించే చోట ఎలాంటి చిన్న జట్టైనా చెలరేగి ఆడుతుంది. ముఖ్యంగా జింబాబ్వే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సికందర్ రజా ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో వరుస సెంచరీలతో హోరెత్తించాడు. 2021 ఏడాదిలో సికందర్ రజా వన్డే క్రికెట్‌లో అద్బుత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. పాకిస్తాన్ దేశంలో పుట్టి జింబాబ్వేలో స్థిరపడ్డ సికందర్ రజా ఇప్పటివరకు 13 మ్యాచ్‌లాడి 627 పరుగులు సాధించాడు.
సికందర్ రజా
ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సికందర్ రజా నాలుగో స్థానంలో ఉన్నాడు. రజా కంటే ముందు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, రాసి వాండర్ డుసెన్, క్వింటన్ డికాక్‌లు మాత్రమే ఉన్నారు. హరారే క్రికెట్ మైదానం సికందర్ రజాకు బాగా కలిసివచ్చింది. ఈ వేదికపై వన్డేల్లో జింబాబ్వే తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టేలర్, హామిల్టన్ మసకద్జ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇన్నోసెంట్ కియా
అందుకే టీమిండియా బౌలర్లు సికిందర్ రజాతో జాగ్రత్తగా ఉండాలి. అతన్ని వీలైనంత త్వరగా ఔట్ చేయగిలిగితే మేలు.. లేదంటే కొరకరాని కొయ్యగా మారడం గ్యారంటీ. సికందర్ రజాతో పాటు బంగ్లాదేశ్ సిరీస్‌లో రాణించిన ఇన్నోసెంట్ కియా, కెప్టెన్ రెగిస్ చకబ్వాపై కూడా ఒక కన్నేసి ఉంచడం మేలు. ఇక భారత్, జింబాబ్వే మధ్య ఈ నెల 18, 20, 22 తేదీల్లో హరారేలో 3 వన్డేలు జరుగుతాయి.
జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చకబ్వా
టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, షాబాద్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, మొహమ్మద్ సిరాజ్.
జింబాబ్వే: రెగిస్ చకబ్వా (కెప్టెన్), సికిందర్ రజా, తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ర్యాన్ బర్ల్, ఇన్నోసెంట్ కైయా, కైటానో టకుడ్జ్వానాషే, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమని, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌టర్ న్గార్వా, , మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో.
చదవండి: ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
నజీబుల్లా వీరవిహారం.. ఐర్లాండ్‌పై అఫ్ఘనిస్థాన్ సూపర్ విక్టరీ
Comments
Please login to add a commentAdd a comment