సాధారణంగానే భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెటర్లపై అభిమానం కూడా తారాస్థాయిలో ఉంటుంది. తమ అభిమాన క్రికెటర్‌ను కలుసుకోవడానికి వీలైతే ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడుతుంటారు. అలాంటి టీమిండియా ఆటగాళ్లకు విదేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా జింబాబ్వే పర్యటనకు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన కేఎల్ రాహుల్‌కు మ్యాచ్ ప్రారంభానికి ముందు వింత అనుభవం ఎదురైంది.
విషయంలోకి వెళితే.. హరారే వేదికగా జరుగుతున్న తొలి వన్డే ప్రారంభానికి ఒక్కరోజు ముందు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ సహా టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో కొందరు అభిమానులు వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. దీంతో రాహుల్, ఇషాన్‌లు స్వయంగా వెళ్లి ఫోటోలకు ఫోజిచ్చారు. ఆ తర్వాత ఒక 14 ఏళ్ల కుర్రాడు అక్కడికి వచ్చాడు.
కేఎల్ రాహుల్ అంటే విపరీతమైన అభిమానం అని చెప్పి అతనితో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్.. ''మరి రేపు మ్యాచ్ చూడడానికి వస్తున్నావా?'' అని అడిగాడు. దీనికి ఆ కుర్రాడు.. ''కచ్చితంగా.. స్కూల్ ఎగ్గొట్టి మరీ మ్యాచ్‌కు వస్తా'' అని బదులిచ్చాడు. దీంతో రాహుల్..లేదు అలా స్కూల్ బంక్ కొట్టి రానవసరం లేదు'' అని అన్నాడు. దానికి అతను.. ''రేపు స్కూల్‌లో కూడా ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఏం లేవు.. కచ్చితంగా వస్తా'' అంటూ బదులిచ్చాడు. దీంతో రాహుల్ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Virat Kohli International Debut: 14 ఏళ్ల కెరీర్ పూర్తి.. కోహ్లి ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment