పాకిస్తాన్‌పై జింబాబ్వే విజయం
సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన
బులవాయో: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాకిస్తాన్‌పై తొమ్మిదేళ్ల తర్వాత వన్డే మ్యచ్‌లో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. చివరిసారి జింబాబ్వే 2015లో పాక్‌ను ఓడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (39 పరుగులు; 7 పరుగులకు 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి జింబాబ్వే గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఎన్‌గరావా ((52 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్ రజా (56 బంతుల్లో 39; 6 ఫోర్లు), మరుమని (29; 2 ఫోర్లు, 1 సిక్స్), సీన్ విలియమ్స్ (23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ ఆఘా (3/42), ఫైజల్ అక్రమ్ (3/24) ఆకట్టుకున్నారు.
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 21 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. అప్పటికి ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం విజయసమీకరణానికి పాక్ 80 పరుగులు వెనుకబడి ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సీన్ విలియమ్స్, సికందర్ రజా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment