zimbabwe team
-
9 ఏళ్ల తర్వాత...
బులవాయో: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాకిస్తాన్‌పై తొమ్మిదేళ్ల తర్వాత వన్డే మ్యచ్‌లో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. చివరిసారి జింబాబ్వే 2015లో పాక్‌ను ఓడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (39 పరుగులు; 7 పరుగులకు 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి జింబాబ్వే గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఎన్‌గరావా ((52 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్ రజా (56 బంతుల్లో 39; 6 ఫోర్లు), మరుమని (29; 2 ఫోర్లు, 1 సిక్స్), సీన్ విలియమ్స్ (23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ ఆఘా (3/42), ఫైజల్ అక్రమ్ (3/24) ఆకట్టుకున్నారు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 21 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. అప్పటికి ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం విజయసమీకరణానికి పాక్ 80 పరుగులు వెనుకబడి ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సీన్ విలియమ్స్, సికందర్ రజా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. -
'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి'
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తుంది. తొలుత భారత్‌పై ఓటమి పాలైన పాకిస్తాన్.. అనంతరం పసికూన జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. ఇక వరుసగా రెండు ఓటములు చవిచూసిన పాకిస్తాన్.. వారి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే బాబర్ ఒక పనికిరాని కెప్టెన్ పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శించగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చేరాడు. టీ20 ప్రపంచకప్‌కు సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను ఎంపిక చేయకపోవడంపై అక్రమ్ సీరియస్ అయ్యాడు. పాకిస్తాన్ మిడిలార్డర్ దారుణంగా ఉంది అని అతడు విమర్శించాడు. ఒక వేళ పాక్ కెప్టెన్ తాను అయి ఉంటే ఖచ్చితంగా జట్టులో మొదటి ఆటగాడిగా షోయబ్ మాలిక్ పేరు ఉండేది అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. "పాక్ మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉందని గత ఏడాది కాలంగా మేము(పాక్ మాజీ ఆటగాళ్లు) పదే పదే చెప్పుతున్నాం. షోయబ్ మాలిక్ వంటి అనుభవ్ణడైనా ఆటగాడిని పిసీబీ ఇంట్లో కూర్చోబెట్టింది. అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు చేసిన పెద్ద తప్పిదం. ఒక వేళ నేను కెప్టెన్‌గా ఉంటే నా లక్ష్యం ఏంటి.. వరల్డ్ కప్ గెలవడమే కదా. అటువంటి అప్పడు జట్టులో షోయబ్ మాలిక్ నాకు కావాలంటే.. నేరుగా ఛైర్మన్, చీఫ్ సెలక్టర్ దగ్గరికి వెళ్లి ఎంపికచేయమని అడిగే వాడిని. అతడిని ఎంపికచేయకపోతే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా అనే చెప్పేవాడిని. కానీ మా జట్టలో అటువంటి వ్యక్తులు లేరు. జట్టులో ఖచ్చితంగా మాలిక్ ఉండాల్సింది. ఆస్ట్రేలియాలో ఆడడం.. షార్జా లేదా పాకిస్తాన్లో ఆడినంత సులభం కాదు. బాబర్ కెప్టెన్సీ విషయంలో మరింత తెలివిగా వ్యవహరించాలి. పాకిస్తాన్ ఏమీ చిన్న జట్టు కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి" అని అక్రమ్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: 'ఆ జట్టుతో భారత్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే అంతే సంగతి' -
పాకిస్తాన్‌పై సంచలన విజయం.. జింబాబ్వే డ్యాన్స్ అదిరిపోయిందిగా!
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అఖరి బంతికి జింబాబ్వే గెలుపొందింది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సికిందర్ రజా మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. డ్యాన్స్‌తో అదరగొట్టిన జింబాబ్వే పాకిస్తాన్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత జింబాబ్వే ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయారు. జింబాబ్వే ఆటగాళ్లు మైదానంలోనే పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియాలో జింబాబ్వే రిచర్డ్ నగరావా పాట పాడుతుండగా.. కెప్టెన్ ఎర్విన్ డ్యాన్స్ చేస్తే కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 30న బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. Celebrating yet another terrific performance! 🇿🇼#PAKvZIM | #T20WorldCup pic.twitter.com/0UUZTQ49eB — Zimbabwe Cricket (@ZimCricketv) October 27, 2022 చదవండి: T20 WC: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి' -
'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి'
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ కంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఇక జింబాబ్వే వంటి పసికూన చేతిలో బాబర్ సేన ఓటమి పాలవ్వడంపై పాకిస్తాన్ దిగ్గజ షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ వ్యూహాలపై, బాబర్ ఆజం కెప్టెన్సీపై అక్తర్ తీవ్ర విమర్శలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ మాట్లాడుతూ... " పాకిస్తాన్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అస్సలు బాగోలేదు. ఇప్పటికే ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. పాకిస్తాన్‌కు ఒక చెత్త కెప్టెన్ ఉన్నాడు. ఈ టోర్నీలో కెప్టెన్సీ నిర్వహణ ప్రధాన లోపం. ప్రపంచకప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించింది. ఇక ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి. జింబాబ్వే వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయారంటే మీ ఆట తీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైన జట్టు మేనేజేమెంట్‌కు జ్ఞానోదయం అవుతుందో లేదో నాకు అర్ధ కావడం లేదు" అని పేర్కొన్నాడు. బాబర్ బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు పాకిస్తాన్ లైనప్‌లో మార్పులు గురుంచి కూడా అక్తర్ చర్చించాడు. "జింబాబ్వేతో మ్యాచ్‌లో మా జట్టు నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగింది. జట్టు మేనేజేమెంట్‌కు బుర్ర లేదు. కేవలం ముగ్గురు పేసర్లు, సరైన మిడిలార్డర్ బ్యాటర్‌తో బరిలోకి దిగాల్సింది. ఇక బాబర్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు రావాలి. పవర్ ప్లేలో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చే మంచి ఓపెనర్లు అవసరం. ఫఖర్ జమాన్‌ను కేవలం బెంచ్‌కే పరిమితం చేశాడు. అతడికి ఆస్ట్రేలియాలో బాగా రాణించే సత్తా ఉంది. షాహీన్ షా ఆఫ్రిది ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అయినప్పటికీ అతడికి అవకాశం ఇస్తున్నారు. అతడు పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు అక్తర్ తెలిపాడు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 World Cup 2022: వరుస ఓటములు.. అయినా పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరే ఛాన్స్? -
ఆస్ట్రేలియా గడ్డ మీద జింబాబ్వే సరికొత్త చరిత్ర.. తొలిసారిగా
టాన్స్విల్లే వేదికగా జరిగిన మూడో వన్డేల్లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి పర్యటక జట్టు తప్పించుకుంది. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఆస్ట్రేలియా 141 పరుగులకే జింబాబ్వే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్ ర్యాన్ బర్ల్ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(94) మినహా మిగితా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. కాగా అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ రెగిస్ చకబ్వా (37 నటౌట్), ఓపెనర్ తాడివానాషే మారుమని (35) పరుగులతో రాణించారు. 8 ఏళ్ల తర్వాత తొలి విజయం 8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై తొలి విజయాన్ని జింబాబ్వే నమోదు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వేకు ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. ఇక ఓవరాల్‌గా ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వేకు ఇది మూడో విజయం కావడం విశేషం. తొలి సారిగా 1983 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. అనంతరం 2014లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయ భేరి మోగించింది. చదవండి: AUS vs ZIM: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా..! -
8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే!
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు జింబాబ్వే తమ జట్టును మంగళవారం ప్రకటించింది. స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌తో జరిగిన సిరీస్‌లకు దూరమైన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. చివరగా 2003-2004లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అదే విధంగా ఇరు జట్లు ముఖాముఖి తలపడి కూడా దాదాపు 8 ఏళ్ల కావస్తోంది. చివగా 2014లో ఆసీస్-దక్షిణాఫ్రికా జట్లతో ట్రై సిరీస్‌లో జింబాబ్వే తలపడింది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఈ సిరీస్ 2020 ఆగస్టులో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా రేండేళ్ల పాటు వాయిదా పడింది. టౌన్‌విల్లే వేదికగా ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగానే జరగనుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ జట్టును ప్రకటించింది. జింబాబ్వే జట్టు: రెగిస్ చకబ్వా (కెప్టెన్,), ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమాని, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యౌచి సికందర్ రజా, సీన్ విలియమ్స్ ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే' -
పాల్ స్టిర్లింగ్ మెరుపు సెంచరీ.. ఐర్లాండ్ ఘనవిజయం
డబ్లిన్: ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (75 బంతుల్లో 115 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ సెంచరీ చేశాడు. దీంతో జింబాబ్వేతో బుధవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. జింబాబ్వే జట్టులో కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, షేన్ గెట్కెట్, బెన్ వైట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో కివీస్ చెత్త రికార్డు.. -
మరో సారి కోహ్లిని వెనక్కి నెట్టిన పాక్ ఆటగాడు
పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. తాజా రికార్డుతో మరోసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టిన బాబర్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు. ఇటీవల ఐసీసీ అత్యుత్తమ వన్డే బ్యాట్స్మెన్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీని వెనక్కు నెట్టిన బాబర్.. ఈసారి టీ20ల్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల చేసి కోహ్లిని అధిగమించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 లో బాబార్ ఈ ఘనతను సాధించాడు. టీ20ల్లో 2వేల పరుగులు చేయడానికి కోహ్లి 56 ఇన్నింగ్స్‌లు తీసుకోగా బాబర్ ఈ ఘనతను కేవలం 52 ఇన్నింగ్స్‌ల్లో సాధించడం విశేషం. ఇక ఈ వరుసలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (62 ఇన్నింగ్స్), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (66 ఇన్నింగ్స్) మూడవ, నాలుగో స్థానాల్లో ఉన్నారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టి20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకారం బాబర్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ( చదవండి: ఆ బౌన్సర్‌కు హెల్మెట్ సెపరేట్ అయ్యింది..! ) -
1979 తర్వాత జింబాబ్వే తొలిసారి..
-
1979 తర్వాత జింబాబ్వే తొలిసారి..
హరారే: ప్రపంచకప్‌లో ఆడాలన్న జింబాబ్వే ఆశలు ఆవిరయ్యాయి. క్వాలిఫయర్స్‌లో భాగంగా యూఏఈతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమిపాలైంది. చివరి బంతికి సిక్సర్ కొడితే జింబాబ్వే గెలిచేదే, కానీ క్రీజులో ఉన్న ఇర్విన్ రెండు పరుగులే చేయడంతో యూఏఈ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రమీజ్ (59) టాప్ స్కోరర్. వర్షం కారణంగా జింబాబ్వే లక్ష్యాన్ని 40 ఓవర్లలో 230కి కుదించగా.. సీన్ విలియమ్స్ (80) పోరాడినా, జింబాబ్వే 226/7కే పరిమితమై ఓటమిపాలైంది. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచ కప్‌కు దూరం కావడం ఇదే తొలిసారి. వరల్డ్ కప్‌కు జింబాబ్వే అర్హత సాధించలేకపోవడంతో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లు రేసులోకి వచ్చాయి. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేత వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ రద్దయితే రన్‌రేట్ ప్రకారం ఐర్లాండ్ ముందుకు వెళుతుంది. -
జింబాబ్వేపై విండీస్ గెలుపు
హరారే: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో సోమవారం జరిగిన సూపర్‌సిక్స్ పోరులో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (138; 20 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన విండీస్ 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి గెలిచింది. శామ్యూల్స్ (86; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హోప్ (76; 5 ఫోర్లు, 1 సిక్స్), లూయిస్ (64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. -
టీ20ల్లో ఇప్పటికీ ఇదే బెస్ట్ బౌలింగ్
సాక్షి, స్పోర్ట్స్: క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్లకు అతడు సింహస్వప్నం. టీ20 క్రికెట్లో రెండు పర్యాయాలు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ అతడు. ఆ మిస్టరీ స్పిన్నర్ బౌలర్ మరెవరో కాదు లంక క్రికెటర్ అజంతా మెండిస్. నేడు ఈ లంక బౌలర్ పుట్టినరోజు. 2012లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంక ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వేతో ఆడింది. ఆ మ్యాచ్‌లో మిస్టరీ బౌలర్ మెండిస్ ప్రత్యర్ధి ఆటగాళ్లకు ఎలా ముచ్చెమటలు పట్టించాడో మరోసారి వీక్షించండి. ఆ మ్యాచ్‌లో కేవలం 8 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు మెండిస్. ఐసీసీ టీ20 క్రికెట్లో ఇప్పటికీ అత్యుత్తుమ ప్రదర్శనను తన పేరిట లిఖించుకున్న మెండిస్ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ అధికారిక ట్వీటర్లో ఈ వీడియో పోస్ట్ చేసింది. To celebrate the birthday of Ajantha Mendis, we take a look back at his sensational performance with the ball against Zimbabwe in the 2012 World T20! His figures on that day of 6/8, are still the best ever for a bowler in T20Is! Happy Birthday! 🎂 🎉 pic.twitter.com/KmDbnLIubq — ICC (@ICC) 11 March 2018 -
వాటే మ్యాచ్: అఫ్గాన్‌పై జింబాబ్వే సంచలనం
బులావాయో:ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫేవరెట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. గ్రూప్-బిలో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై జింబాబ్వే రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. కడవరకూ నువ్వా-నేనా అన్న రీతిలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేనే విజయం వరించింది. జింబాబ్వే 196 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకుని అద్భుతమైన గెలుపును అందుకుంది. ఫలితంగా అఫ్గానిస్తాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 49.3 ఓవర్లలో 194 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అఫ్గానిస్తాన్ ఓ దశలో విజయం దిశగా పయనించినా చివర వరకూ పోరాడటంలో విఫలమై ఓటమి చెందింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరాజయాన్ని కొనితెచ్చుకుంది. అఫ్గాన్ ఆటగాళ్లలో రెహ్మత్ షా(69), మొహ్మద్ నబీ(51) రాణించినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. 156 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయిన అఫ్గాన్..మరో 38 పరుగులు చేసి మిగతా వికెట్లను నష్టపోయింది. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు సాధించగా, సికిందర్ రాజా మూడు వికెట్లతో మెరిశాడు. ఇక బ్రెయిన్ విటోరి రెండు వికెట్లు, చతరా వికెట్ తీశారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 43 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్(89), సికిందర్ రాజా(60)లు హాఫ్ సెంచరీలతో సత్తాచాటుకున్నారు. -
అఫ్గాన్‌కు స్కాట్లాండ్ షాక్
బులవాయో: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫేవరెట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌కు స్కాట్లాండ్ షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ కాలమ్ మెక్లియోడ్ (146 బంతుల్లో 157 నాటౌట్; 23 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అతి పిన్న సారథి రషీద్ ఖాన్ నేతృత్వంలో అఫ్గాన్ మొదట 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. నబీ (92; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), నజీబుల్లా జద్రాన్ (67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వీల్, బెరింగ్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత స్కాట్లాండ్ 47.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి గెలిచింది. మెక్ లియోడ్కు బెరింగ్టన్ (67; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలుపొందగా, యూఏఈ కూడా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోనే 56 పరుగుల తేడాతో పపువా న్యూగినియాపై నెగ్గింది. జింబాబ్వే శుభారంభం మరోవైపు ఆతిథ్య జింబాబ్వే తొలి మ్యాచ్‌లో 116 పరుగుల తేడాతో నేపాల్‌పై జయభేరి మోగించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 380 పరుగులు సాధించింది. బ్రెండన్ టేలర్ (91 బంతుల్లో 100; 7 ఫోర్లు, ఒక సిక్స్), సికిందర్ రజా (66 బంతుల్లో 123; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) ధాటిగా ఆడి సెంచరీలు చేయడం విశేషం. ఐదో వికెట్‌కు వీరిద్దరు 173 పరుగులు జోడించారు. అనంతరం నేపాల్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసి ఓడిపోయింది. ‘సెంచరీ హీరో’ సికిందర్ రజా బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు. సికిందర్ రజా -
క్రికెట్ లోన్ ఇవ్వరా!
కరాచీ: పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, మార్ట్గేజ్ లోన్, హోమ్ లోన్ గురించి విన్నాం కానీ... ఈ క్రికెట్ లోన్ కొత్తగా ఉంది కదూ. కొత్తగా ఉన్నా... మేం ఆడుకునేందుకు లోన్ కావాల్సిందేనని జింబాబ్వే క్రికెట్ యూనియన్ (జెడ్సీయూ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి మొరపెట్టుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఓ విదేశీ పర్యటనకు వెళ్లలేనంత పరిస్థితి తలెత్తిందని జింబాబ్వే వాపోతోంది. ఇప్పుడు ఐసీసీ సాయం చేస్తేనే తమ క్రికెట్ ఆటలు సాగుతాయని అభ్యర్థిస్తోంది. మొత్తం మీద జింబాబ్వే కష్టాలు పాకిస్తాన్ కష్టాలుగా మారనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఆగస్టులో జింబాబ్వే క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆర్థిక కష్టాలతో జింబాబ్వే రాకపోతే పాక్ విలవిలలాడాల్సిన పరిస్థితి ఉంది. ఇదే జరిగితే సమీప భవిష్యత్‌లో పాక్‌లో విదేశీ జట్టు పర్యటన ఇక గగనమే అవుతుంది. అయితే జింబాబ్వే తమ తుది నిర్ణయాన్ని ఏప్రిల్‌లో వెల్లడించనుందని పీసీబీ చీఫ్ నజమ్ సేథి అన్నారు. -
క్రికెట్ చరిత్రలో మళ్లీ ఇలా జరగదేమో..!
-
క్రికెట్ చరిత్రలో మళ్లీ ఇలా జరగదేమో..!
షార్జా: క్రికెట్ చరిత్రలో కొన్నిసార్లు అరుదైన సంఘటనలు అవిష్కృతమవుతాయి. మళ్లీ అలాంటి ఫీట్లు జరిగే అవకాశం ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు సైతం అఫ్గానిస్తాన్, జింబాబ్వే వన్డే సిరీస్ గురించి అభిప్రాయపడుతున్నారు. ఓ వన్డేలో ఓడితే తర్వాతి వన్డేలో ప్రత్యర్థిపై రెండో జట్టు ప్రతీకారం తీర్చుకుంటుంది. అందులో భాగంగా ఆ మరుసటి వన్డేలో నమోదైన గణాంకాలు మాత్రం క్రికెట్ ప్రేమికులతో పాటు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ఒకే సిరీస్ లో ఇలా జరిగినా.. వరుస వన్డేల్లో ఇలాంటి ఫీట్ కావడం కష్టమే. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.. తమ వన్డే క్రికెట్లో రికార్డు విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు మరుసటి వన్డేలో అదే ప్రత్యర్థి జింబాబ్వే చేతిలో అంతే పరుగుల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. రెండో వన్డేలో నెగ్గిన జింబాబ్వే తొలి వన్డే దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో ఇరుజట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. జింబాబ్వే స్టార్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ (125; 121 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగడంతో పాటు సికిందర్ రజా (92; 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లాడి 5 వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు జింబాబ్వే బౌలర్లు గ్రేమ్ క్రీమర్ (4/41), చతారా (3/24)లు విజృంభించడంతో 30.1 ఓవర్లకు 179 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ జట్టులో రహ్మద్ షా (43), దౌలత్ జర్దాన్ (47 నాటౌట్) మాత్రమే ఆ జట్టు 154 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లకు 333 పరుగులు చేయగా, ప్రత్యర్థి జింబాబ్వే జట్టు 34.4 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. రెండో వన్డేలో అదే స్కోర్లు నమోదయ్యాయి. కానీ జట్లే మారాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం ఆలౌటైన జట్టు ఆడిన ఓవర్లలోనే వ్యత్యాసం తప్ప.. ఇతర అన్ని అంశాలు ఒకేలా రిపీట్ కావడం క్రికెట్ చరిత్రలోనే అరుదైనదిగా భావించవచ్చు. తొలి వన్డే: అఫ్గానిస్తాన్: 333/5 జింబాబ్వే: 179 ఆలౌట్ రెండో వన్డే: జింబాబ్వే: 333/5 అఫ్గానిస్తాన్: 179 ఆలౌట్ -
బంగ్లాదేశ్‌కు మూడో విజయం
ఢాకా: సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ అజేయంగా దూసుకెళుతోంది. జింబాబ్వేతో లీగ్ మ్యాచ్‌లో బంగ్లా 91 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 216 పరుగులు చేసింది. తమీమ్ (76; 6 ఫోర్లు), షకీబుల్ హసన్ (51; 6 ఫోర్లు) రాణించారు. తర్వాత జింబాబ్వే 36.3 ఓవర్లలో 125 పరుగుల వద్ద ఆలౌటైంది. షకీబుల్ 3 వికెట్లు పడగొట్టగా, మొర్తజ, సుంజాముల్ ఇస్లామ్, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు. -
శ్రీలంక గెలిచిందోచ్...
ఢాకా: వరుస ఓటములతో డీలాపడ్డ శ్రీలంకకు కాస్త ఊరట లభించింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన లంక ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత జింబాబ్వే 44 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటవ్వగా... శ్రీలంక 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలుపొందింది. లంక తరఫున కుశాల్ పెరీరా (49), కెప్టెన్ చండిమాల్ (38 నాటౌట్), తిసారా పెరీరా (39 నాటౌట్) రాణించారు. -
యువ భారత్ తడాఖా
కుర్రాళ్లు గర్జిస్తున్నారు. అండర్–19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్నారు. ఆసీస్‌పై 100 పరుగులతో జయభేరి మోగించిన యువ భారత్... వరుస మ్యాచ్‌ల్లో పపువా న్యూ గినియా, జింబాబ్వేలను 10 వికెట్లతో చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో ఎదురు లేని జట్టుగా అగ్రస్థానంలో నిలి చింది. ఈనెల 26న జరిగే క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ఐసీసీ అండర్–19 ప్రపంచకప్‌లో కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో యువ భారత్ అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే క్వార్టర్స్ చేరిన పృథ్వీ షా బృందం వరుసగా మూడో విజయంతో గ్రూప్‘బి’లో అజేయంగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగుల వద్ద ఆలౌటైంది. మిల్టన్ శుంబా (59 బంతుల్లో 36; ఒక సిక్స్) టాప్ స్కోరర్. మధెవెరె (30; 3 ఫోర్లు), కెప్టెన్ రోచ్ (31; ఫోర్, సిక్స్) రాణించారు. భారత బౌలర్లు అనుకూల్ రాయ్ (4/20), అభిషేక్ వర్మ (2/22), అర్షదీప్ సింగ్ (2/10) జింబాబ్వేను దెబ్బతీశారు. ఒకదశలో జింబాబ్వే 110/3 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అయితే లెఫ్టార్మ్ స్పిన్నర్లు అనుకూల్, అభిషేక్‌లు తిప్పేయడంతో 44 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లు కోల్పోయింది. తర్వాత 155 పరుగుల సునాయాస లక్ష్యాన్ని భారత్ కేవలం 21.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్ (59 బంతుల్లో 90 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్), హార్విక్ దేశాయ్ (73 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీలతో కదంతొక్కారు. శుభ్‌మాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, పపువా న్యూగినియాలపై గెలుపొందిన భారత్... ఈనెల 26న జరిగే క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బెంబేలెత్తించిన రాల్స్టన్ (7/15) క్రికెట్ కూన పపువా న్యూ గినియా (పీఎన్జీ)పై ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. తమ చివరి లీగ్‌లో ఆసీస్ 311 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట 8 వికెట్లకు 370 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... తర్వాత పీఎన్జీని 24.5 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూల్చింది. ఆసీస్ బౌలర్ జాసన్ రాల్స్టన్ (7/15) నిప్పులు చెరిగాడు. టోర్నమెంట్ చరిత్రలో ఏడు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మెక్‌స్వీని (156; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్ జాసన్ జస్కీరత్ సింగ్ సంఘా (88; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), పరమ్ ఉప్పల్ (61; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. గ్రూప్ ‘బి’లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్ చేరింది. గ్రూప్ ‘డి’లో శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్ కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. -
భారత కుర్రాళ్ల జోరు
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వరుస రెండు విజయాలతో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్..తాజాగా జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. తొలుత జింబాబ్వేను 154 పరుగులకే కుప్పకూల్చిన భారత్ జట్టు..ఆపై 21.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి సత్తాచాటింది. దాంతో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత యువ జట్టు గ్రూప్-బిలో టాప్ ప్లేస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసి 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మధవారే(30), షుంబా(36), నికోలస్ రోచ్(31)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా నిరాశపరిచారు. భారత స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లు సాధించగా, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. అటు తరువాత సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లలో హార్విక్ దేశాయ్(56 నాటౌట్;73 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడగా, శుభ్‌మాన్ గిల్(90 నాటౌట్;59 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయాడు. దాంతో భారత్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్దమైంది. -
శ్రీలంకకు జింబాబ్వే షాక్
ఢాకా: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంకపై జింబాబ్వే 12 పరుగులతో సంచలన విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది. మసకద్జ (73; 10 ఫోర్లు), సికందర్ రజా (81 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లంక బౌలర్లలో గుణరత్నెకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లంక 48.1 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరీరా (80; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూస్ (42; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. చివర్లో తిసారా పెరీరా (37 బంతుల్లో 64; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగినా ఫలితం లేకపోయింది. జింబాబ్వే బౌలర్లలో చటారాకు 4, జార్విస్, క్రీమర్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. -
పాక్‌లో జింబాబ్వే పర్యటన అనుమానం
కరాచీ : పాకిస్తాన్లో క్రికెట్ పునరుద్ధరణ మళ్లీ సందేహంలో పడింది. ఈ నెల 19న జింబాబ్వే జట్టు పాక్‌లో క్రికెట్ సిరీస్ ఆడేందుకు రావాల్సి ఉంది. అయితే బుధవారం కరాచీలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో జింబాబ్వే బోర్డు పునరాలోచనలో పడింది. పాక్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. కానీ ఆ వెంటనే రద్దు చేసుకోవడం లేదని, ఆలోచిస్తున్నామని తెలిపింది. పాక్ బోర్డుతో మరోసారి చర్చలు జరుపుతామని పేర్కొంది. -
పాక్ పర్యటన సురక్షితం కాదు: ఫికా
మెల్బోర్న్: పాకిస్తాన్లో విదేశీ క్రికెట్ జట్లు పర్యటించడం ఇప్పటికీ అంత సురక్షితం కాదని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘం సమాఖ్య (ఫికా) వ్యాఖ్యానించింది. జింబాబ్వే జట్టు పాక్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ టూర్‌కు వెళ్లకపోవడమే మంచిదని భద్రతా నిపుణులు సలహా ఇచ్చారని చెప్పింది. ‘ఆటగాళ్ల భద్రత మాకు చాలా ముఖ్యం. జింబాబ్వే జట్టు పర్యటనకు వెళ్లాలనుకుంటే మ్యాచ్ అధికారులను ఎవరినైనా పాక్‌కు పంపించి పరిస్థితులను సమీక్షిస్తే బాగుండేది. ఈ టూర్లో రిస్క్ ఎక్కువగా ఉందని ఫికా భద్రతా అధికారులు మాకు తెలిపారు. కాబట్టి ఇలాంటి సమయంలో అక్కడ పర్యటించడం అంత ఆమోదయోగ్యం కాదు’ అని ఫికా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టోనీ ఐరిష్ అన్నారు.