
డబ్లిన్: ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (75 బంతుల్లో 115 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ సెంచరీ చేశాడు. దీంతో జింబాబ్వేతో బుధవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 178 పరుగులు చేసింది.
అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. జింబాబ్వే జట్టులో కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, షేన్ గెట్కెట్, బెన్ వైట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో కివీస్ చెత్త రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment