పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. డబ్లిన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి ఐర్లాండ్ దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ అయూబ్(45), ఇఫ్తికర్ ఆహ్మద్(37 నాటౌట్) పరుగులతో రాణించారు.
ఐరీష్ బౌలర్లలో క్రెగ్ యంగ్ రెండు వికెట్లు, డెలానీ,అడైర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బల్బర్నీ(77) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఆఖరిలో కాంఫ్‌హెర్(15), డెలానీ(10) ఆజేయంగా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా, షాహీన్ అఫ్రిది, వసీం తలా వికెట్ సాధించారు.
Babar Azam is a cursed captain #IREvPAK IRELAND PROVE TO BE TOOO MIGHTY FOR 🇵🇰 😪💀 MOYE MOYE pic.twitter.com/LBNvtAd0Q6
— Shehryar Sajid Khan (@Sskwrites) May 10, 2024
IRELAND BEAT PAKISTAN!!! What an incredible series opener we've just witnessed! A historic victory for @cricketireland 🇮🇪👏👏👏
.
.#IREvPAKonFanCode #IREvPAK #FanCode pic.twitter.com/prvSBt37L5— FanCode (@FanCode) May 10, 2024
Comments
Please login to add a commentAdd a comment