టీ20 వరల్డ్‌కప్-2024ను పాకిస్తాన్ విజయంతో ముగించింది. ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన పాకిస్తాన్.. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
ఐరీష్ బ్యాటర్లలో గారెత్ డెలానీ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్‌కు 2 వికెట్లు దక్కాయి.
తీవ్రంగా శ్రమించిన పాక్..
అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు పాక్ తీవ్రంగా శ్రమించింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటకి కెప్టెన్ బాబర్ ఆజం(32) ఆజేయంగా నిలవగా.. ఆఖరిలో షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి పాక్‌కు రెండో విజయాన్ని అందించాడు.
107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు.
"టోర్నమెంట్‌ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో మేము బాగానే రాణించాము. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును ఒత్తడిలోకి నెట్టాము. ఫ్లోరిడా వికెట్ పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
కానీ బ్యాటింగ్‌లో మాత్రం మేము మా మార్క్‌ను చూపించలేకపోయాము. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. ఏదో విధంగా టెయిలాండర్ల సాయంతో మ్యాచ్‌ను ముగించాము. ఇంతకుముందు మ్యాచ్‌ల్లో కూడా యూఎస్‌ఎ, భారత్‌పై కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయాం.
జట్టు అవసరం బట్టి నేను ఏ పొజిషన్‌లోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అది ఓపెనింగ్ అయినా, ఫస్ట్‌డౌన్ అయినా కావచ్చు. ఇక జట్టులో మాత్రం అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మాకు కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మేము బంగ్లాపర్యటనకు వెళ్లనున్నాం.
ఈ నేపథ్యంలో మా బాయ్స్ తిగిరి కమ్‌బ్యాక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ టోర్నమెంట్‌లో ఎక్కడ తప్పు జరిగిందో అంచనా వేయాల్సిన అవసరం మాకు ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బాబర్ పేర్కొన్నాడు.
చదవండి: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment