టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాక్ జట్టుపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శలు ఎక్కుబెట్టారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ పార్దివ్ పటేల్ సైతం బాబర్ టార్గెట్ చేశాడు. ఆజం ఒక స్వార్ధపరుడు అంటూ పార్ధివ్ మండిపడ్డాడు.
"బాబర్ ఆజం ఒక సెల్ఫిష్ ప్లేయర్. జట్టు ప్రయోజనాలు కంటే తన స్వలాభమే ఎక్కువగా చూసుకుంటాడు. ఫఖార్ జమాన్‌ను కాదని తనే ఓపెనర్‌గా రావాలని బాబర్ నిర్ణయించుకున్నాడు. ఇది అస్సలు సరైన నిర్ణయం కాదు.
బాబర్ ఓపెనర్‌గా వచ్చినప్పుడు జమాన్‌ను కనీసం ఫస్ట్ డౌన్‌లోనైనా బ్యాటింగ్‌కు పంపాల్సింది. కానీ అది కూడా చేయలేదు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి ఆ దేశ దిగ్గజాలు కూడా ఇదే చెబుతున్నారు.
ప్రస్తుతం పాక్ జట్టులో టీ20లకు సెట్ అయ్యే ఆటగాళ్లు లేరు. టీ20ల్లో వారి స్ట్రైక్ రేట్ కూడా పెద్దగా బాగోలేదు. పాక్ ఇతర అంతర్జాతీయ జట్ల కంటే చాలా వెనుకబడి ఉన్నారని" ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ధివ్ పటేల్ పేర్కొన్నాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు పాకిస్తాన్ కెప్టెన్సీ పగ్గాలు తిరిగి చేపట్టిన బాబర్.. తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment