టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో చెత్త ప్రదర్శనతో ఇంటా.. బయటా విమర్శలు మూటగట్టుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఓవైపు దాయాది టీమిండియా వరుస విజయాలతో సూపర్-8లో సగర్వంగా అడుగుపెట్టగా.. పాక్ మాత్రం లీగ్ దశలోనే నిష్క్రమించింది.
పసికూనగా భావించే ఆతిథ్య అమెరికా జట్టు చేతిలో ఓటమితో ఈ ఐసీసీ ఈవెంట్‌ను ఆరంభించిన బాబర్ బృందం.. తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. అమెరికా కెనడా, పాక్‌లపై గెలిచి సూపర్-8 మార్గాలను సుగమం చేసుకోగా.. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అదృష్టం కూడా కలిసి వచ్చింది.
ఈ క్రమంలో పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి అమెరికా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా ఫలితం లేకుండా పోయినా.. గెలుపుతో ఈ ఈవెంట్‌ను ముగించగలిగింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఆట తీరు, కెప్టెన్ బాబర్ ఆజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ స్థానాన్ని మాజీ క్రికెటర్ రమీజ్ రాజాతో భర్తీ చేయాలంటూ సరదాగా పీసీబీకి సూచించాడు.
బాబర్ ఆజం బదులు రమీజ్ రాజా అయితే
‘‘వాళ్లు(పాక్ జట్టు) ఎప్పుడు కష్టాల్లో ఉన్నా రమీజ్ రాజా కాపాడేవాడు. ఈసారి కూడా జట్టుకు సీఈఓవో అవుతాడేమో ఎవరికి తెలుసు?!..
రమీజ్ రాజా ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. బాబర్ ఆజంకు బదులు రమీజ్ రాజాను కెప్టెన్‌గా నియమించాలి’’ అని మంజ్రేకర్ సరదాగా వ్యాఖ్యానించాడు.
కాగా మాజీ బ్యాటర్, 61 ఏళ్ల రమీజ్ రాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్(2021-2022)గా పనిచేసిన విషయం తెలిసిందే. అతడి హయాంలో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు..2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరింది. అదే విధంగా 2022లో ఫైనల్ చేరి.. రన్నరప్‌గా నిలిచింది.
చదవండి: అవును నిజమే.. నేను కూడా!: రోహిత్ శర్మతో గిల్.. పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment