టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్.. కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని చాటుకున్నాడు. ఓ అందమైన ఫొటోతో తమ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు.
కాగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుబ్‌మన్ గిల్.. బ్యాటర్‌గానూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 426 పరుగులు చేయగలిగాడు.
ఇక గిల్ సారథ్యంలో కేవలం ఐదు మ్యాచ్‌లే గెలిచిన గుజరాత్ ఎనిమిదో స్థానంలో నిలిచి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. ఓపెనర్‌గానూ విఫలం కావడంతో శుబ్‌మన్ గిల్‌పై ఐపీఎల్-2024 ప్రభావం గట్టిగానే పడింది.
టీ20 ప్రపంచకప్-2024 ఈవెంట్‌కు ఎంపిక చేసిన భారత ప్రధాన జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగగా.. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ స్థానం సంపాదించాడు.
దీంతో ఓపెనింగ్ బ్యాటర్ గిల్‌కు కేవలం రిజర్వ్ ప్లేయర్‌గా అవకాశం దక్కింది. ఈ క్రమంలో లీగ్ దశలో అమెరికాలో మ్యాచ్‌లు పూర్తైన అనంతరం.. ఆవేశ్ ఖాన్(పేసర్)తో పాటు గిల్‌ను రిలీజ్ చేసింది బీసీసీఐ.
అయితే, ఇందుకు శుబ్‌మన్ గిల్ క్రమశిక్షణా రాహిత్యమే కారణమని.. రోహిత్‌తో విభేదాల నేపథ్యంలో ఇన్‌స్టాలో కెప్టెన్‌ను అన్‌ఫాలో చేశాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే భారత బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ క్లారిటీ ఇవ్వగా.. గిల్ సైతం స్పందించాడు.
అవును నిజమే.. సామీతో పాటు నేను కూడా
రోహిత్ శర్మతో కలిసి ఆత్మీయంగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘సామీ(సమైరా), నేను.. క్రమశిక్షణగా ఎలా ఉండన్న అంశం గురించి రోహిత్ శర్మ నుంచి నేర్చుకుంటున్నాం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందులో రోహిత్ తన ముద్దుల కుమార్తె సమైరా శర్మను ఎత్తుకుని ఉన్నాడు. ఇలా ఒక్క ఫొటోతో వదంతులకు బ్రేక్ వేశాడు గిల్.
ఇక వరల్డ్‌కప్-2024లో ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియా.. తదుపరి మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో ఆడనుంది. కాగా భారత్, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా గ్రూప్-ఏలో ఉండగా.. ఈ గ్రూపు నుంచి భారత్, అమెరికా సూపర్-8కు అర్హత సాధించాయి. మిగతా మూడు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
చదవండి: Saurabh Netravalkar: నేత్రావల్కర్ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి! బ్యాగ్రౌండ్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment