సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి.. బ్యాగ్రౌండ్‌? | T20 WC: Saurabh Netravalkar's Wife Devi Snigdha Muppala, Who Is High Achiever Like Him | Sakshi
Sakshi News home page

Saurabh Netravalkar: నేత్రావల్కర్‌ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి! బ్యాగ్రౌండ్‌ ఇదే

Published Mon, Jun 17 2024 11:47 AM | Last Updated on Mon, Jun 17 2024 12:14 PM

T20 WC: Saurabh Netravalkar Wife Devi Snigdha Muppala: Who Is She High Achiever

భార్యతో సౌరభ్‌ నేత్రావల్కర్‌ (PC: insta/X)

టీ20 ప్రపంచకప్‌-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఒకడు. ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్‌ బౌలర్‌.. ఉన్నత విద్య ‍కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు.

ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సౌరభ్‌.. గత కొన్నేళ్లుగా అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ ముంబైకర్‌.. ఈ ఐసీసీ టోర్నీలో దుమ్ములేపుతున్నాడు.

లీగ్‌ దశలో కెనడా, పాకిస్తాన్‌పై విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన సౌరభ్‌.. టీమిండియాతో మ్యాచ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలర్‌‌.

ఇంతకీ ఎవరీమె?
ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్‌‌ కెరీర్‌తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.

ఒకే హోదాలో దంపతులు
సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్‌ మాదిరే ఆమె కూడా కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

భర్తతో కలిసి ఒరాకిల్‌ సంస్థలో ప్రిన్సిపల్‌ అప్లికేషన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్‌ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్‌- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.

కథక్‌ డాన్సర్‌
32 ఏళ్ల సౌరభ్‌కు క్రికెట్‌ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్‌ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్‌ కథక్‌ డాన్సర్‌ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్‌ డాన్స్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్‌ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.

స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.

అన్యోన్య దాంపత్యం
ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్‌- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్‌ చేస్తారు.

అదే విధంగా.. సౌరభ్‌ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్‌- ఫిట్‌నెస్‌ బ్లెండ్‌ ప్రోగ్రామ్స్‌కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్‌ కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తున్నారు.

చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్‌ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement