Saurabh Netravalkar
-
నిప్పులు చెరిగిన నేత్రావల్కర్, ఫెర్గూసన్
మేజర్ లీగ్ క్రికెట్లో ఇవాళ (జులై 12) సియాటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓర్కాస్‌పై వాషింగ్టన్ ఫ్రీడం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఓర్కాస్.. వాషింగ్టన్ ఫ్రీడం పేసర్లు సౌరభ్ నేత్రావల్కర్ (3.4-0-18-3), లోకీ ఫెర్గూసన్ (4-0-26-4), మార్కో జన్సెన్ (4-0-28-1), ఇయాన్ హాలండ్ (4-0-34-1) ధాటికి 19.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది.ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ 51 (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ 24 (19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు), శుభమ్ రంజనే 12 (17 బంతుల్లో) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడం.. లహీరు మిలంత (33 నాటౌట్), ఓబస్ పియెనార్ (31 నాటౌట్) రాణించడంతో 18.2 ఓవర్లలో విజయతీరాలకు (127/5) చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ డకౌట్ కాగా.. స్టీవ్ స్మిత్ 12, రచిన్ రవీంద్ర 26, ముక్తార్ అహ్మద్ 8, మ్యాక్స్‌వెల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఓర్కాస్ బౌలర్లలో నండ్రే బర్గర్ 2, ఇమాద్ వసీం, కెమారాన్ గానన్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. -
ఇద్దరూ టెకీలే: క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)
-
సౌరభ్ నేత్రావల్కర్ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి.. బ్యాగ్రౌండ్?
టీ20 ప్రపంచకప్-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్ నేత్రావల్కర్ ఒకడు. ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్ బౌలర్.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు.ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సౌరభ్.. గత కొన్నేళ్లుగా అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ ముంబైకర్.. ఈ ఐసీసీ టోర్నీలో దుమ్ములేపుతున్నాడు.లీగ్ దశలో కెనడా, పాకిస్తాన్‌పై విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన సౌరభ్.. టీమిండియాతో మ్యాచ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వరల్డ్‌క్లాస్ బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.ఇంతకీ ఎవరీమె?ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్ కెరీర్‌తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ నేత్రావల్కర్ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.ఒకే హోదాలో దంపతులుసౌరభ్ నేత్రావల్కర్ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్ మాదిరే ఆమె కూడా కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.భర్తతో కలిసి ఒరాకిల్ సంస్థలో ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.కథక్ డాన్సర్32 ఏళ్ల సౌరభ్‌కు క్రికెట్ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్ డాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.అన్యోన్య దాంపత్యంప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్ క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్ చేస్తారు.అదే విధంగా.. సౌరభ్ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్- ఫిట్నెస్ బ్లెండ్ ప్రోగ్రామ్స్‌కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్! -
కోహ్లితో పరిచయం లేదు.. వికెట్ తీసినందుకు ఏమన్నాడంటే!
తనకు ఇష్టమైన రెండు రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందని అమెరికా క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నాడు. తన కెరీర్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదని.. అంతా త్వరత్వరగా జరిగిపోయిందంటూ హర్షం వ్యక్తం చేశాడు.ఏదేమైనా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వికెట్ తీయడం భావోద్వేగ క్షణంగా మిగిలిపోతుందని సౌరభ్ నేత్రావల్కర్ ఎమోషనల్ అయ్యాడు. కాగా భారత్‌కు చెందిన నేత్రావల్కర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిఅండర్-19 ప్రపంచకప్‌లోనూ యువ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. సీనియర్ జట్టులో చోటు దక్కకకపోవడంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే ఒరాకిల్‌లో ఉద్యోగం సంపాదించిన నేత్రావల్కర్.. ప్రస్తుతం అమెరికా తరఫున టీ20 ప్రపంచకప్-2024 బరిలో దిగాడు.విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన నేత్రావల్కర్.. రోహిత్ శర్మ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తన తొలి టీ20 ప్రపంచకప్‌లోనే రెండు బిగ్ వికెట్లు తీసి మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు.అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో అమెరికా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికే కెనడా, పాకిస్తాన్‌లపై విజయాలతో గ్రూప్-ఏ సెకండ్ టాపర్‌గా సూపర్-8కు చేరువైంది.ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ అనంతరం తన భావాలు పంచుకున్న సౌరభ్ నేత్రావల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రెండు రంగాల్లో కెరీర్ కొనసాగించడం ఆనందంగా ఉంది. అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి.విరాట్‌తో నాకు అంతగా పరిచయం లేదుఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇక గత రెండు మ్యాచ్‌లు(పాక్, భారత్) అత్యంత కీలకమైనవి. విరాట్ వికెట్ తీయడం ఓ ఎమోషనల్ మూమెంట్.అతడికి బౌలింగ్ చేస్తున్నపుడు ఆఫ్ స్టంప్ ఎగురగొట్టాలని భావించా. నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి వికెట్ తీశా. అండర్-15, అండర్-17 డేస్ నుంచే నాకు సూర్యకుమార్ యాదవ్ తెలుసు.మేము కలిసినపుడు నాటి డ్రెసింగ్‌రూం వాతావరణం గురించి చర్చించుకుంటాం. అయితే, విరాట్‌తో నాకు అంతగా పరిచయం లేదు కానీ.. అతడి వికెట్ తీసిన తర్వాత నన్ను అభినందించాడు’’ అని సౌరభ్ నేత్రావల్కర్ పేర్కొన్నాడు. చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్! View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్!
సౌరభ్ నేత్రావల్కర్.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం మారుమోగిపోతున్న పేరు. ఈ రైటార్మ్ పేసర్ అండర్-19 కప్-2010 ఎడిషన్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ఆడిన నేత్రావల్కర్.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్, ముంబైకర్ రోహిత్ శర్మకు జూనియర్. అదే విధంగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకున్నాడు.అంతేకాదు.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో.. భారత జట్టు ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బౌలింగ్ చేసిన ఘనత కూడా సౌరభ్ నేత్రావల్కర్ సొంతం.ప్రత్యర్థిగా ఉన్న టీమ్‌లో ధోని, కోహ్లిముంబై తరఫున రంజీలు ఆడిన నేత్రావల్కర్.. ఎన్సీఏలో యువరాజ్ సింగ్ వికెట్ పడగొట్టడం ద్వారా 2009లో వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలో బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ పేస్‌బౌలర్.. యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనాలతో కలిసి డ్రెస్సింగ్‌రూం పంచుకున్నాడు.అప్పుడు వీరి జట్టుకు ప్రత్యర్థిగా ఉన్న టీమ్‌లో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి వంటి స్టార్లు ఉండటం విశేషం. ఇక అంచెలంచెలుగా ఎదిగి అండర్ క్రికెట్ వరల్డ్‌కప్ ఆడే అవకాశం దక్కించుకున్న సౌరభ్ నేత్రావల్కర్.. 2010 నాటి ఆ ఈవెంట్లో టీమిండియా తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.అగార్కర్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలు ఉండటంతోఅయితే, సీనియర్ లెవల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయాడు ఈ ముంబైకర్. అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలు ఉన్న జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికీ పట్టుదలని నేత్రావల్కర్ 2013లో రంజీల్లో అరంగేట్రం చేశాడు.అయితే, సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిగి చదువు మీద శ్రద్ధ పెట్టాడు. ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన అతడు.. ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లిన సౌరభ్ నేత్రావల్కర్‌కు 2015లో న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది.యాప్ రూపకర్త ప్లేయర్ అనాలిసిస్ చేసేందుకు వీలుగా అతడు రూపొందించిన క్రిక్‌డీకోడ్ యాప్‌నకు ఫిదా అయిన యూనివర్సిటీ యాజమాన్యం అతడికి స్కాలర్షిప్ కూడా ఇచ్చింది.కార్నెల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన సౌరభ్ నేత్రావల్కర్‌కు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒరాకిల్ సంస్థ ఉద్యోగం ఆఫర్ చేసింది. అయితే, అక్కడే మళ్లీ తిరిగి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు నేత్రావల్కర్.అలా అమెరికా జట్టులో చోటుఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల సరళింపు నేపథ్యంలో.. H1B కార్డ్ హోల్డర్‌గా ఉన్న నేత్రావల్కర్‌కు 2018లో యూఎస్ఏ జట్టులో అడుగుపెట్టే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు కెప్టెన్‌గానూ వ్యవహరించాడతడు.ఈ నేపథ్యంలో యూఏఈతో టీ20 మ్యాచ్ సందర్భంగా 2019లో సౌరభ్ నేత్రావల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పపువా న్యూగినియాతో మ్యాచ్‌తో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటి వరకు అమెరికా తరఫున 48 వన్డేలు ఆడిన సౌరభ్ నేత్రావల్కర్ 73 వికెట్లు తీశాడు. 30 టీ20లలో కలిపి 31 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటితొలిసారిగా మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా తరఫున బరిలోకి దిగిన నేత్రావల్కర్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ రిజ్వాన్(9), ఇఫ్తికార్ అహ్మద్ రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేసి పాక్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. పాక్ పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇక టీమిండియాతో మ్యాచ్‌లోనూ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. స్టార్ బ్యాటర్, ఓపెనర్ విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన నేత్రావల్కర్.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(3) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో అమెరికా భారత్ చేతిలో ఓడిపోయినా ఈ టెకీ మాత్రం తనదైన ముద్ర వేయగలిగాడు. ఈ క్రమంలో సౌరభ్ నేత్రావల్కర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.కాగా ఒరాకిల్‌లో పనిచేస్తున్న నేత్రావల్కర్.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు దాదాపు నెల రోజుల పాటు సెలవు(జూన్ 17 వరకు) పెట్టినట్లు సమాచారం. ఒకవేళ అమెరికా సూపర్-8కు గనుక క్వాలిఫై అయితే తన లీవ్‌ను పొడిగించుకుంటాడు.పేటెంట్ ఉందినెట్టింట సెర్చ్ క్వెరీలో భాగంగా అత్యంత వేగంగా ఆటోకంప్లీట్ అయ్యే వినూత్న అల్గారిథమ్‌ను సౌరభ్ నేత్రావల్కర్ రూపొందించాడు. ఇందుకు సంబంధించి అతడి వద్ద పేటెంట్ రైట్ కూడా ఉంది.ఇంకో అల్గారిథమ్ పేటెంట్ కోసం అతడు అప్లై చేశాడు. ఈ విషయాలను నేత్రావల్కర్ స్వయంగా క్రిక్‌బజ్‌తో పంచుకున్నాడు. తాను ఒక కోడర్ అని.. SQL(లాంగ్వేజ్) & C విభాగంలో పనిచేస్తానని పేర్కొన్నాడు. కేవలం ఉద్యోగం, క్రికెట్ మాత్రమే కాదు సంగీతంలోనూ నేత్రావల్కర్‌కు ప్రావీణ్యం ఉంది. ఇక అమెరికాపై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ 32 ఏళ్ల పేసర్.. ‘‘బ్రదర్’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేయడం నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే.. ఎవరీ నేత్రావల్కర్?
టీ20 వరల్డ్‌కప్-2024లో పెను సంచలనం నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా జట్టు పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అమెరికా ఘన విజయం సాధించింది.సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో పాక్‌ను అమెరికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన అమెరికా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో ఫలితాన్ని నిర్ణయించాల్సింది.సూపర్ ఓవర్లో అమెరికా అదుర్స్..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ సూపర్ ఓవర్ వేసిన పేసర్ మహ్మద్ అమీర్ ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 7 పరుగులివ్వడం గమనార్హం. అనంతరం అమెరికా తరపున సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే..ఇక పాకిస్తాన్‌ను ఓడించిన అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు నలుగురు ఉండటం గమనార్హం. యూఎస్ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ వంటి ఆటగాళ్లు భారత మూలాలు ఉన్న క్రికెటర్లే.అమెరికా విజయంలో మోనాంక్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్య చేధనలో మోనాంక్ పటేల్(50) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నేత్రావల్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 18 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్‌కు పాకిస్తాన్ మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక అమెరికా విజయంలో కీలక పాత్ర పోషించిన మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ సౌరభ్ నేత్రావల్కర్?సౌరభ్ నేత్రావల్కర్ ముంబైలో జన్మించాడు. 32 ఏళ్ల సౌరభ్ 2010 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుత భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌తో కలిసి నేత్రావల్కర్ ఆడాడు. అదే విధంగా దేశవాళీ క్రికెట్లో ముంబైకు నేత్రావల్కర్ ప్రాతినిథ్యం వహించాడు.క్రికెట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఉద్యోగంపై దృష్టిసారించాడు. 2013లో ముంబై యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరభ్.. అనంతరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. 2016లో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డ్రిగీ అందుకున్నాడు.ఆ తర్వాత ఒరాకిల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. కానీ క్రికెట్‌పై మక్కువ మాత్రం నేత్రావల్కర్‌కు పోలేదు. జాబ్ చేస్తుండగానే గల్ఫ్ జెయింట్స్, సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడేవాడు. అనంతరం అమెరికా దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో సీనియర్ జట్టులో చోటు దక్కింది. ఎవరీ మోనాంక్ పటేల్?31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చిన మోనాంక్.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే స్టీవన్ టేలర్ నుంచి అమెరికా జట్టు పగ్గాలను మోనాంక్ పటేల్ సొంతం చేసుకున్నాడు. SAURABH NETRAVALKAR - THE MULTI TALENTED GUY! 🥶If being a software engineer at Oracle, defeating Pakistan wasn't enough, he has previously shared his videos on Instagram Playing Ukulele. 😄👌 pic.twitter.com/uIGWofSkPZ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2024