1/9
టీ20 ప్రపంచకప్-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్ నేత్రావల్కర్ ఒకడు.
2/9
ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్ బౌలర్.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు. ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్ కెరీర్‌తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
3/9
ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ నేత్రావల్కర్ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.
4/9
సౌరభ్ నేత్రావల్కర్ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్ మాదిరే ఆమె కూడా కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
5/9
భర్తతో కలిసి ఒరాకిల్ సంస్థలో ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.
6/9
32 ఏళ్ల సౌరభ్‌కు క్రికెట్ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్ డాన్స్ ఫిట్‌నెస్ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.
7/9
స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.
8/9
ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్ క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్ చేస్తారు.
9/9
అదే విధంగా.. సౌరభ్ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్- ఫిట్‌నెస్ బ్లెండ్ ప్రోగ్రామ్స్‌కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.