తనకు ఇష్టమైన రెండు రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందని అమెరికా క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నాడు. తన కెరీర్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదని.. అంతా త్వరత్వరగా జరిగిపోయిందంటూ హర్షం వ్యక్తం చేశాడు.
ఏదేమైనా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వికెట్ తీయడం భావోద్వేగ క్షణంగా మిగిలిపోతుందని సౌరభ్ నేత్రావల్కర్ ఎమోషనల్ అయ్యాడు. కాగా భారత్‌కు చెందిన నేత్రావల్కర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి
అండర్-19 ప్రపంచకప్‌లోనూ యువ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. సీనియర్ జట్టులో చోటు దక్కకకపోవడంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే ఒరాకిల్‌లో ఉద్యోగం సంపాదించిన నేత్రావల్కర్.. ప్రస్తుతం అమెరికా తరఫున టీ20 ప్రపంచకప్-2024 బరిలో దిగాడు.
విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపి
ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన నేత్రావల్కర్.. రోహిత్ శర్మ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తన తొలి టీ20 ప్రపంచకప్‌లోనే రెండు బిగ్ వికెట్లు తీసి మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో అమెరికా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికే కెనడా, పాకిస్తాన్‌లపై విజయాలతో గ్రూప్-ఏ సెకండ్ టాపర్‌గా సూపర్-8కు చేరువైంది.
ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ అనంతరం తన భావాలు పంచుకున్న సౌరభ్ నేత్రావల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రెండు రంగాల్లో కెరీర్ కొనసాగించడం ఆనందంగా ఉంది. అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి.
విరాట్‌తో నాకు అంతగా పరిచయం లేదు
ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇక గత రెండు మ్యాచ్‌లు(పాక్, భారత్) అత్యంత కీలకమైనవి. విరాట్ వికెట్ తీయడం ఓ ఎమోషనల్ మూమెంట్.
అతడికి బౌలింగ్ చేస్తున్నపుడు ఆఫ్ స్టంప్ ఎగురగొట్టాలని భావించా. నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి వికెట్ తీశా. అండర్-15, అండర్-17 డేస్ నుంచే నాకు సూర్యకుమార్ యాదవ్ తెలుసు.
మేము కలిసినపుడు నాటి డ్రెసింగ్‌రూం వాతావరణం గురించి చర్చించుకుంటాం. అయితే, విరాట్‌తో నాకు అంతగా పరిచయం లేదు కానీ.. అతడి వికెట్ తీసిన తర్వాత నన్ను అభినందించాడు’’ అని సౌరభ్ నేత్రావల్కర్ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్!
Comments
Please login to add a commentAdd a comment