టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు మెగా టైటిల్ నెగ్గనేలేదు. గతేడాది సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ వన్డే వరల్డ్‌కప్ బరిలో దిగిన రోహిత్ సేన లీగ్ దశలో దుమ్ములేపింది.
ఓటమన్నదే ఎరుగక సెమీ ఫైనల్ చేరి.. ఆపై ఫైనల్లోనూ అడుగుపెట్టింది. కానీ.. అసలైన పోరులో.. అహ్మదాబాద్‌లో దాదాపు లక్ష మంది అభిమానుల నడుమ.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది.
ఒత్తిడిలో చిత్తై
ఫైనల్లో ఒత్తిడికి చిత్తై కంగారూలకు ట్రోఫీని సమర్పించుకుంది. ఇక దాదాపు పదకొండేళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించే అవకాశం ముంగిట నిలిచింది టీమిండియా. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది.
అభిమానుల అంచనాలు కూడా అదే రేంజులో ఉన్నాయి. చాలా మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కూడా టైటిల్ ఫేవరెట్లలో రోహిత్ సేన ముందుంటుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మా మీద ఆశలు పెట్టుకోవద్దని నేను చెప్పను
భారీ అంచనాలు ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని.. కాబట్టి ఇలాంటి హైప్‌నకు తాము దూరంగా ఉంటేనే మంచిదని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మా మీద ఆశలు పెట్టుకోవద్దని నేను చెప్పను.
నిజానికి మన దేశంలో క్రికెట్‌కు ఉన్న స్థానం వేరు. అదే మన బలం. అయితే, ఒక్కోసారి అతిగా ఆలోచిస్తూ.. మనపై భారీ అంచనాలు ఉన్నాయనే విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ.. ఆ దిశగా దృష్టి సారిస్తే అదే బలహీనతగా మారే అవకాశం ఉంది.
దానిని నుంచి స్ఫూర్తి, శక్తిని పొందేలా ఉండాలి
కాబట్టి మన బలాన్ని మాత్రమే నమ్ముకుని.. దానిని నుంచి స్ఫూర్తి, శక్తిని పొందేలా ఉండాలి. మాకు వెన్నుదన్నుగా ఉన్న అభిమానుల కోసం.. వారి కలలు నెరవేర్చేలా ఆడాలి అన్న ఆలోచన మాత్రమే దరికిరానివ్వాలి’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు.
కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ జూన్ 1న మొదలుకానుంది. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాళ్లంతా అమెరికా చేరుకోగా.. కోహ్లి ఇంకా భారత్‌లోనే ఉన్నాడు.
చదవండి: T20 WC: ఓపెనర్‌గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
Comments
Please login to add a commentAdd a comment