ముంబైలో జరిగిన వరల్డ్‌కప్ విజయోత్సవాల అనంతరం టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లండన్ వెళ్లిపోయాడు. విరాట్ భార్య అనుష్క శర్మ.. పిల్లలు విరుష్క, అకాయ్‌లతో కలిసి లండన్‌లో ఉంటుంది. వీరిని కలిసేందుకు విరాట్ లండన్‌కు పయనమయ్యాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమం అనంతరం విరాట్ నేరుగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. విరాట్ విమానాశ్రమంలోకి వెళ్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
విరాట్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి, ఇప్పట్లో అతను టీమిండియాకు ఆడే అవకాశం లేదు. ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఉన్నప్పటికీ విరాట్ అందుబాటులో ఉండకపోవచ్చు. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ సమయానికి విరాట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదీ లేదంటే విరాట్ అందుబాటులోకి వచ్చేది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయానికే.
ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న (జులై 4) ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది.
11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్‌లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి.
విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment