టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా యూఎస్‌ఏతో నిన్న (జూన్ 12) జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన విరాట్.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా (టాప్-7 ఆటగాళ్లలో) రికార్డుల్లోకెక్కాడు.
విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 525 మ్యాచ్‌ల్లో 36 సార్లు డకౌటయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో (టాప్-7లో) విరాట్ తర్వాత సచిన్ టెండూల్కర్ (34), రోహిత్ శర్మ (33), వీరేంద్ర సెహ్వాగ్ (31), సౌరవ్ గంగూలీ (29) ఉన్నారు.
మొత్తం భారత జట్టులో (11 మంది ఆటగాళ్లలో) అత్యధిక సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉంది. జహీర్ 309 మ్యాచ్‌ల్లో 44 సార్లు డకౌటయ్యాడు. జహీర్ తర్వాత ఇషాంత్ శర్మ (40), హర్భజన్ సింగ్ (37), విరాట్ (36), అనిల్ కుంబ్లే (35) ఉన్నారు.
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 495 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 59 సార్లు డకౌటయ్యాడు. ఈ విభాగంలో విండీస్ మాజీ పేసర్ కోట్నీ వాల్ష్ (54), సనత్ జయసూర్య (53) టాప్-3లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ డకౌట్ అయినా టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. భారత్ మరో 10 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అర్ష్‌దీప్ సింగ్ (4-0-9-4), సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్) భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ గెలుపుతో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment