టీ20 ప్రపంచకప్-2024లో ముందుకు సాగే క్రమంలో టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆతిథ్య అమెరికాను ఓడించి గ్రూప్-ఏ నుంచి సగర్వంగా సూపర్-8లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.
కాగా పసికూనే అయినా అమెరికాను తక్కువ అంచనా వేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికే పాకిస్తాన్‌కు అవగతమైన విషయం తెలిసిందే. మినీ ఇండియాగా పేరొందిన యూఎస్‌ఏ జట్టు చేతిలో పాక్ ఓడి(సూపర్ ఓవర్) భారీ మూల్యమే చెల్లించింది.
టీమిండియాతో సమానంగా ఉన్న అమెరికా
కెనడా సైతం అమెరికా చేతిలో చిత్తుగా ఓడి పాక్‌తో పాటు సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు విజయాలతో టీమిండియాతో సమానంగా ఉన్న అమెరికా.. నెట్ రన్‌రేటు పరంగా వెనుకబడి ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.
ప్రాక్టీస్ సెషన్‌కు రోహిత్, కోహ్లి డుమ్మా.. కారణం?
ఇక టీమిండియా- అమెరికా మ్యాచ్‌కు న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియం వేదిక కానుంది. బుధవారం రాత్రి జరుగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ డుమ్మా కొట్టినట్లు సమాచారం.
పాకిస్తాన్‌పై విజయం తర్వాత రోహిత్ శర్మ బ్రేక్ తీసుకోగా.. కోహ్లి సైతం విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక యూఎస్‌ఏతో మ్యాచ్‌కు ముందు జరిగిన ట్రెయినింగ్ సెషన్ ఆప్షనల్ కాబట్టి సూర్య కూడా దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీరంతా జట్టుతో కలిసి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ షేర్ చేయడం గమనార్హం.
టీమిండియా తదుపరి మ్యాచ్‌లు ఇవే
కాగా పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, యూఎస్‌ఏలతో పాటు గ్రూప్-ఏలో ఉన్న భారత జట్టు.. ఇప్పటికే ఐర్లాండ్, పాకిస్తాన్‌లను చిత్తు చేసింది. తదుపరి బుధవారం యూఎస్‌ఏతో.. అనంతరం శనివారం కెనడాతో తలపడనుంది.
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ(ఐర్లాండ్‌పై 52(రిటైర్డ్ హర్ట్), పాకిస్తాన్‌పై 13) ఫర్వాలేదనిపించగా.. విరాట్ కోహ్లి(1, 4), సూర్యకుమార్ యాదవ్(2, 7 ) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు.
చదవండి: అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్ ఆజం
Fielding drills ✅
Target 🎯 hitting with match intensity ✅#T20WorldCup | #TeamIndia | #INDvUSA
WATCH 🎥 🔽https://t.co/DlNDWYcgvL— BCCI (@BCCI) June 12, 2024
Comments
Please login to add a commentAdd a comment