మేజర్ లీగ్ క్రికెట్‌లో ఇవాళ (జులై 12) సియాటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓర్కాస్‌పై వాషింగ్టన్ ఫ్రీడం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఓర్కాస్.. వాషింగ్టన్ ఫ్రీడం పేసర్లు సౌరభ్ నేత్రావల్కర్ (3.4-0-18-3), లోకీ ఫెర్గూసన్ (4-0-26-4), మార్కో జన్సెన్ (4-0-28-1), ఇయాన్ హాలండ్ (4-0-34-1) ధాటికి 19.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది.
ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ 51 (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ 24 (19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు), శుభమ్ రంజనే 12 (17 బంతుల్లో) పరుగులు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడం.. లహీరు మిలంత (33 నాటౌట్), ఓబస్ పియెనార్ (31 నాటౌట్) రాణించడంతో 18.2 ఓవర్లలో విజయతీరాలకు (127/5) చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ డకౌట్ కాగా.. స్టీవ్ స్మిత్ 12, రచిన్ రవీంద్ర 26, ముక్తార్ అహ్మద్ 8, మ్యాక్స్‌వెల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఓర్కాస్ బౌలర్లలో నండ్రే బర్గర్ 2, ఇమాద్ వసీం, కెమారాన్ గానన్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment