breaking news
Snigdha
-
చీర కడితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసి బాగా పాపులర్ అయిన నటి స్నిగ్ధ. ‘అలా మొదలైంది’ చిత్రంతో కెరీర్‌ని ప్రారంభించి.. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ తదితర చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. సినిమాల్లోనే కాకుండా బటయ కూడా అబ్బాయి గెటప్‌లోనే ఉంటారు టాలెటెండ్ నటి. అబ్బాయిల మాదిరే ప్యాంట్, షర్ట్ ధరించి..హెయిర్ స్టైల్ కూడా అలానే మెంటేన్ చేస్తుంటారు. ఆమె లుక్, మాటతీరే.. సినిమా చాన్స్‌లు తెచ్చిపెట్టాయి. ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. మొన్నటివరకు మంచి డిమాండ్ ఉండేది. నటనకు విరామం వచ్చినా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదని చెబుతోంది ఈ నటి. సినిమాల్లో నటించకపోయినా..స్టేజ్ షోల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నానని చెబుతోంది.ఇక తన లుక్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇలా (ప్యాంట్, షర్ట్ ధరించి మగరాయుడిలా) ఉండడం వల్లే.. మంచి క్యారెక్టర్లు వచ్చాయి. ఒకవేల ఇప్పుడు నేను చీర కట్టుకుంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. నేను 5 నిమిషాల్లో చీరకట్టుకోగలను కానీ..కంఫర్టబుల్‌గా ఉండలేను. ఫ్యాన్స్ కోసమే చీర కట్టడంలేదు’అని నవ్వుతూ చెప్పారు. ఇక పెళ్లి గురించి అడగ్గా.. ‘కచ్చితంగా చేసుకుంటాను.కానీ ఇప్పుడు కాదు. కరెక్ట్ పర్సన్ దొరకాలి. నాకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటా’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.ఇక తన ఆదాయ మార్గాలను వివరిస్తూ.. ‘నాకు యాక్టింగ్‌తో పాటు మ్యజిక్ కూడా వచ్చు. సంగీత దర్శకురాలిగా పని చేశాను .ఎగ్జిక్యూటివ ప్రొడ్యూసర్‌గానే వర్క్ చేశా. ఇలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని హాయిగా గడుపుత్నున్నా. సినిమా చాన్స్‌ల కోసం నేను ఎవరిని అడగను. వచ్చిన అవకాశాలనే తీసుకుంటాను. నా నోటిదూల కారణంగానే సినిమా చాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు షోలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నా’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే ఇంతవరకు ఎవరూ కమిట్మెంట్ అడగలేదు. ఒక సిస్టర్లా, బ్రదర్‌లా నన్ను చూసుకున్నారు’ అని స్నిగ్ద చెప్పుకొచ్చింది. -
ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి
మగరాయుడి గెటప్‌తోనే పాపులర్ అయింది తెలుగింటి అమ్మాయి స్నిగ్ధ (Actress Snigdha Nayani). 'అలా మొదలైంది' సినిమాతో తన కెరీర్ మొదలైంది. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ ఇలా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్‌గా పలు షోలు చేస్తోంది. ఈ నటి రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా మగరాయుడిలాగే ఉంటుంది. ఆ కారణం వల్లే ముఖంపై..పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోతానని చెప్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. ముఖంపై గడ్డాలు, మీసాలు రావడానికి గల కారణమేంటని యాంకర్ అడిగాడు. అందుకు స్నిగ్ధ స్పందిస్తూ.. షూటింగ్స్‌కు వెళ్తున్న సమయంలోనే పీసీఓడీ వచ్చింది. దీని వల్ల అవాంచిత రోమాలు వస్తుంటాయి. అలాగే చాలామంది అమ్మాయిలకు ఫేషియల్ హెయిర్ ఉంటుంది. గుండు గీయించుకున్నా..నెలకోసారి థ్రెడింగ్ చేసుకుంటారు. ఇది చాలా మామూలు విషయం. అయితే నేను షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు నా ముఖంపై హెయిర్ కనిపిస్తుందనగానే వెంటనే మేకప్‌మ్యాన్ లేజర్‌తో గీకేసేవారు. దానివల్ల అదింకా ఎక్కువైంది. మరో విషయమేంటంటే.. ఎంబీఏ అయిపోగానే నేను గుండు చేయించుకున్నాను. అప్పుడతడు నా తలపై నుంచి ముఖం మీది దవడ వరకు బ్లేడుతో గీకాడు. అప్పటినుంచే అవాంచిత రోమాలు రావడం చిన్నగా మొదలైంది. మా అమ్మక్కూడా ఫేషియల్ హెయిర్ ఉంది అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.చదవండి: సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ దర్శకుడిని చితకబాదిన స్టార్ హీరో -
సౌరభ్ నేత్రావల్కర్ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి.. బ్యాగ్రౌండ్?
టీ20 ప్రపంచకప్-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్ నేత్రావల్కర్ ఒకడు. ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్ బౌలర్.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు.ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సౌరభ్.. గత కొన్నేళ్లుగా అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ ముంబైకర్.. ఈ ఐసీసీ టోర్నీలో దుమ్ములేపుతున్నాడు.లీగ్ దశలో కెనడా, పాకిస్తాన్‌పై విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన సౌరభ్.. టీమిండియాతో మ్యాచ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వరల్డ్‌క్లాస్ బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.ఇంతకీ ఎవరీమె?ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్ కెరీర్‌తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ నేత్రావల్కర్ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.ఒకే హోదాలో దంపతులుసౌరభ్ నేత్రావల్కర్ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్ మాదిరే ఆమె కూడా కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.భర్తతో కలిసి ఒరాకిల్ సంస్థలో ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.కథక్ డాన్సర్32 ఏళ్ల సౌరభ్‌కు క్రికెట్ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్ డాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.అన్యోన్య దాంపత్యంప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్ క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్ చేస్తారు.అదే విధంగా.. సౌరభ్ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్- ఫిట్నెస్ బ్లెండ్ ప్రోగ్రామ్స్‌కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్! -
43 ఏళ్లు దాటినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: నటి
అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం వంటి సినిమాలతో నటి స్నిగ్ద మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ఆహార్యంతోనే స్నిగ్ద టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. అడపిల్లే అయినా మగరాయుడి గెటప్‌లో ఆమె పండించే హాస్యానకి ఫ్యాన్స్ ఫిదా అవుతారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ స్నిగ్ద మగరాయుడే అని చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే ఆమె డేర్‌గా ఉంటారనేది నిజం. వాస్తవంగా స్నిగ్ద శివ భక్తురాలు, ప్రతీ సంవత్సరం శివమాల ధరిస్తానని ఆమె గతంలో కూడా పలు వేదికల మీద తెలిపారు. ఓ ఫ్రోగ్రామ్లో స్నిగ్దను చూసిన డైరెక్టర్ నందినీ రెడ్డి మొదట ఆమెకు ‘అలా మొదలైంది' సినిమాలో చాన్స్ ఇచ్చింది. ఆ సినిమాలో తన పాత్రకు మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు అందుకుంది. స్నిగ్ద తన పెళ్లి గురించి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 43ఏళ్లు. అయినా ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదని ఓ ఇంటర్యూలో ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. 'నాకు పెళ్లి బంధంపై పెద్దగా నమ్మకం లేదు. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కూడా కలగలేదు. ఇప్పటి వరకు నా జీవితంలో అలాంటి సందర్భం కూడా రాలేదు. ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను. 120 రోజుల పాటు ఇలా దీక్షలోనే టైమ్ గడిచిపోతుంది. పెళ్లి చేసుకుంటే నేను మరోకరి ఆధీనంలోకి వెళ్లిపోతాను. అందుకే మ్యారేజ్ చేసుకోవడం అంటే అంతగా ఇష్టం లేదు. అని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని కని జీవితం అంతా వారి చుట్టూ తిరిగే బదులు హాయిగా సంపాదించిన దాంట్లో కొంత మనకోసం ఖర్చు పెట్టుకుంటూ.. మిగిలన డబ్బు అనాథశ్రమాలలోని పిల్లలకు ఉపయోగిస్తే వాళ్లు బాగు పడుతారు. ప్రస్తుతం నేను అలాంటి పనే చేస్తున్నానని ఆమె తెలిపింది. ఫైనల్‌గా తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే మాత్రం లేదని ఆమె తేల్చేసింది. -
ఓ ప్రేమా... ఏదమ్మా! నీ చిరునామా?
కుమార్‌రాజా, స్నిగ్ధ జంటగా ఆదిలక్ష్మీ కంబైన్స్ పతాకంపై ఈశ్వరమ్మ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ ప్రేమా.. ఏదమ్మా! నీ చిరునామా?’. కోపూరు చంద్రమౌళి దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ -‘‘కుటుంబ కథ నేపథ్యంలో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ ఇది. పాటల రికార్డింగ్ ఇటీవలే పూర్తయ్యింది. నవంబర్‌లో మొదటి షెడ్యూల్‌ని తిరుపతిలో ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రకథ అద్భుతంగా ఉందని, మంచి పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందని కుమార్‌రాజా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్-ఎలెందర్, కెమెరా: రఘు.