ఓ ప్రేమా... ఏదమ్మా! నీ చిరునామా?
ఓ ప్రేమా... ఏదమ్మా! నీ చిరునామా?
Published Thu, Oct 17 2013 12:54 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
కుమార్‌రాజా, స్నిగ్ధ జంటగా ఆదిలక్ష్మీ కంబైన్స్ పతాకంపై ఈశ్వరమ్మ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ ప్రేమా.. ఏదమ్మా! నీ చిరునామా?’. కోపూరు చంద్రమౌళి దర్శకుడు.
ఈ చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ -‘‘కుటుంబ కథ నేపథ్యంలో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ ఇది. పాటల రికార్డింగ్ ఇటీవలే పూర్తయ్యింది. నవంబర్‌లో మొదటి షెడ్యూల్‌ని తిరుపతిలో ప్రారంభిస్తాం’’ అని చెప్పారు.
ఈ చిత్రకథ అద్భుతంగా ఉందని, మంచి పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందని కుమార్‌రాజా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్-ఎలెందర్, కెమెరా: రఘు.
Advertisement
Advertisement